Brahmamudi Telugu Serial Today Episode:  కావ్య ఇంటికి రావడాన్ని చూసి ఆవేదనతో  మూర్తి ఎందుకొచ్చావని అడుగుతాడు. మా వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో తెలియదా? అంటూ వెళ్లిపో అని చెప్తాడు.  ఇది నా పుట్టిలు నాన్న ఎప్పుడైనా నాకు వచ్చే హక్కు ఉంది అంటూ కావ్య అనగానే.. నువ్వు ఆ ఇంటి నుంచి ఎప్పుడు ఈ ఇంటికి వచ్చినా.. వెళ్లేటప్పుడు పుట్టేడు దుఃఖంతో పంపిస్తున్నాం అంటూ బాధపడతాడు కృష్ణమూర్తి. మా వల్ల నువ్వు మీ అత్తింట్లో అనుభవిస్తున్న వేధన ఇంక చాల్లేమ్మ అనడంతో..


కావ్య: నాన్న ఎవరో ఏదో అనుకుంటారని.. ఏదో నింద నా మీద పడుతుందని కన్నవాళ్లకి నా పుట్టింటికి దూరంగా బతకడం నావల్ల కాదు నాన్న. అత్తగారిల్లు నా అర్హత. పుట్టిల్లు నాకు పుట్టుకతో వచ్చిన హక్కు.


అప్పు: అక్క అట్ల మాట్లాడకే.. నాయిన కరెక్టుగానే చెప్పిండు. నువ్విక్కడికి రాకపోవడమే మంచిది. మమ్మల్ని కలవకపోవడమే మంచిది.


కనకం: ఆపండి.. ఎందుక దాన్ని రావొద్దంటున్నారు. ఏదైనా తప్పు జరిగి ఉంటే అది నావల్లే జరిగింది. నేను ఆ ఇంటికి వెళ్లను. దాన్ని కూడా రావొద్దంటే జీవితాంతం ఆ ఇంట్లో జైళ్లో మగ్గిపోయినట్లు మగ్గిపోవాలా?


కావ్య: మీరు అనే వాళ్లే లేకపోతే నేను అనేదాన్నే లేను. కాబట్టి నేను వస్తూనే ఉంటాను. నన్ను ఆపే హక్కు వాళ్లకే కాదు మీక్కూడా లేదు. వస్తాను.. వస్తూనే ఉంటాను.


అని చెప్పి బ్యాగ్‌ తీసుకుని కావ్య వెళ్లిపోతుంది.   మరోవైపు దుగ్గిరాల ఇంట్లో  సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటుంటే.. కావ్య డల్‌గా లోపలికి వస్తుంది. కావ్యను చూసిన అపర్ణ  కోపంగా ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది. దీంతో కావ్య పుట్టింటికి వెళ్లానని చెప్పడంతో ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది. కరెక్ట్‌ టైంలో కరెక్ట్‌ తప్పు చేశావు కావ్య అని మనసులో అనుకుంటుంది అనామిక. ఇంతలో  కళ్యాణ్‌ వచ్చి వదినను ఏమీ అనొద్దని ధాన్యలక్ష్మీకి చెప్తాడు.


ధాన్యలక్ష్మీ: నీకేం తెలియదు నువ్వు ఊరుకో.. మనుషులందరూ మంచివాళ్లే మాట్లాడేదంతా నిజాలే అనుకుంటావు.


కళ్యాణ్‌: అందరి గురించి నాకు తెలియదు.. అప్పు మాత్రం మంచిది.


ధాన్యలక్ష్మీ: నీ కవితలో ఉన్నంత స్వచ్చంగా మనుషులు ఉండరు ఇక్కడ. లోపలంతా కుళ్లు కుతంత్రాలే..


  అనగానే అన్ని కుతంత్రాలు నేను ఏం చేశానని అడుగుతుంది కావ్య.  ఆ ఇంటితో రిలేషన్‌ పెట్టుకోవద్దని చెప్పానుగా అంటుంది ధాన్యలక్ష్మీ.. ఇదే విషయం నేనెప్పుడో చెప్పాను కానీ ఎప్పుడైనా నా మాట విన్నారా మీరు అంటూ అపర్ణ, ధాన్యలక్ష్మీని ప్రశ్నిస్తుంది. అనామిక కూడా కావ్యను తప్పుపడుతుంది.  రుద్రాణి, కావ్యను స్వప్నను వారి ఫ్యామిలీని కలిపి తిడుతుంటే..


స్వప్న: ఇప్పుడు నా విషయం ఎందుకు లాగుతున్నారు అత్తయ్య..


రుద్రాణి: నువ్వు కూడా ఈ తప్పులో భాగమే కదా?


స్వప్న: ఏం తప్పు జరిగింది ఇందాకట్నుంచి చూస్తున్నాను. ఏదో పెద్ద ఆరిందలాగా మాట్లాడుతున్నారు. నిజం చెప్పాలంటే తప్పు చేసింది మీరు. ఏ తప్పు చేయని నా మీద నిందలు వేసింది మీరే. గొడవలు పెట్టింది మీరు.. వాటిని అడ్డు పెట్టుకుని నన్ను ఇంట్లోంచి గెంటివేయాలని చూసింది మీరే.


రాహుల్‌: స్వప్న నువ్వు మాట్లాడుతుంది మా మామ్ తో కాస్త నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.


స్వప్న: మీ అమ్మతో కలిసి నన్ను అనుమానించి ఇంట్లొంచి పంపించేయాలని చూశావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావా? అసలు మోసానికి ప్రతిరూపాలు నువ్వు మీ అమ్మ. నా చెల్లి గురించి కానీ నా గురించి కాని ఎవరైనా మాట్లాడితే..


అంటూ అందరికీ వార్నింగ్‌ ఇస్తుంటే.. కావ్య, స్వప్నను తీసుకుని పైకి వెళ్లిపోతుంది.  నీ కోడలు చూడు వదిన అక్కతో అన్ని తిట్టించి తర్వాత కూల్‌గా తీసుకుపోతుంది అంటూ రుద్రాణి, అపర్ణకు చెప్తుంది.  పైకి తీసుకెళ్లిన కావ్య, స్వప్నను కూల్‌ చేస్తుంటే.. స్వప్న ఎవరెవరు ఎలాంటి వారో మనకు తెలియదా? నువ్వు మెత్తగా మాట్లాడినా నిన్ను నెత్తిన పెట్టుకున్నారా. నేను ఇలాగే మాట్లాడతా? ఇకనుంచి మా అత్తకు, మా ఆయనకు సినిమా చూపిస్తా? అంటూ వెళ్లిపోతుంది.


కింద అపర్ణ, ధాన్యలక్ష్మీ, రుద్రాణి మీటింగ్‌ పెట్టుకుని కోడళ్ల గురించి మాట్లాడుకుంటారు. వారిని ఎలా కంట్రోల్‌ చేయాలోనని ఆలోచిస్తారు. నా కోడలు జోలికొస్తే.. కావ్యను ఊరికే వదలనని ధాన్యలక్ష్మీ చెప్పి వెళ్లిపోతుంది. అపర్ణ కూడా కావ్యకు త్వరలోనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానని చెప్పి వెళ్లిపోతుంది. దీంతో రుద్రాణి పుల్‌ హ్యాపీగా ఫీల్‌ అవుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.


Also Read: ‘నా సామిరంగ’ ట్రైలర్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?