Brahmamudi Serial Today Episode:  రాజ్‌, శ్వేత కారులో వెళ్తుంటే కావ్య ఫోన్‌ చేస్తుంది. రాజ్‌ లిఫ్ట్‌ చెయ్యడు. దీంతో  క్లయింట్స్‌ వచ్చి అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు వీడు ఎక్కడికెళ్లాడు అని సుభాష్‌ సీరియస్‌ అవుతాడు. ఇంతలో కావ్య, కళ్యాణ్‌ను పక్కకు తీసుకెళ్లి శ్వేతకు డైవోర్స్‌ వచ్చాయన్న సంతోషంలో ఉన్నారు అందుకే నా కాల్‌ లిఫ్ట్‌ చేయడం లేదని నువ్వు నీ ఫోన్‌ నుంచి కాల్‌ చేయ్‌ అని చెప్తుంది. దీంతో కళ్యాణ్‌ తన ఫోన్‌  నుంచి రాజ్‌కు కాల్‌ చేస్తాడు. తన ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని కళ్యాణ్‌ ఫోన్‌తో కాల్‌ చేయిస్తుందని రాజ్‌ శ్వేతతో చెబుతూ కాల్‌ లిఫ్ట్‌ చేసి వెటకారంగా మాట్లాడతాడు. అయితే అన్నయ్య నేను కళ్యాణ్‌ని అని చెప్పగానే రాజ్‌ తడబడతాడు. దీంతో ఆఫీసులో మీటింగ్‌ గురించి కళ్యాణ్‌ చెప్పగానే రాజ్‌ వస్తున్నానంటూ కాల్‌ కట్‌ చేస్తాడు. మరోవైపు సుభాష్‌ టెన్షన్‌ పడుతుంటే మేనేజర్‌ వచ్చి రాజ్‌ సార్‌ లేకపోయినా ఈ ప్రాజెక్టు గురించి కావ్య మేడంకు మొత్తం తెలుసని మేడంతో ప్రజంటేషన్‌ ఇప్పించండని చెప్తుంది. దీంతో సుభాష్‌, కావ్యను పిలుస్తాడు.


కావ్య: మామయ్యా ఆయన వచ్చేస్తుంటాడు.


సుభాష్‌: వాడు ఎక్కడికెళ్లాడో తెలుసా?


కావ్య: తెలుసు మామయ్యా కానీ చెప్పలేను (అని మనసులో అనుకుంటుంది)


సుభాష్‌: పోనీ ఎంత సేపట్లో వస్తాడో తెలుసా? ఎప్పుడొస్తాడో తెలియని వాడి కోసం ఎంతసేపని ఎదురుచూస్తాం.


కావ్య: మనం ఇప్పుడు వెయిట్‌ చేయడం తప్పా ఏం చేయగలం మామయ్యా


సుభాష్‌: నీకు ఈ డిజైన్స్‌ గురించి తెలుసట కదా


అనగానే కావ్య మొహమాటపడుతుంది. రాజ్‌ ఏమంటాడోనని ఫీలవుతుంది. దీంతో సుభాష్‌, ప్రకాష్‌...  కావ్యను ఒప్పించి మీటింగ్‌ హాల్ ల్లోకి తీసుకెళ్తారు. మీటింగ్‌లో అందరికీ కావ్య డిజైన్స్‌ గురించి డీటెయిల్స్ ఎక్స్‌ ప్లైన్‌ చేస్తుంది. దీంతో కావ్య డిజైన్స్‌ సూపర్బ్‌ గా ఉన్నాయని ముద్ర కంపెనీ వాళ్లు మెచ్చుకుంటారు. మరోవైపు అప్పు తన రూం సర్దుకుంటుంది. కనకం వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతుంది. చదువుకోవడానికి స్టడీ టేబుల్‌ తెచ్చుకోవడానికి ఇక్కడ సర్దుతున్నాను అని చెప్పగానే.. కనకం, మూర్తి అప్పును మెచ్చుకుంటారు. అప్పు మారిపోయిందని.. కళ్యాణ్‌ను పూర్తిగా మర్చిపోయిందని సంతోషిస్తారు కనకం, మూర్తి.  మరోవైపు ఆఫీసులో అందరూ మాట్లాడుకుంటుండగా రాజ్‌, శ్వేత వస్తారు. రాజ్‌ ను చూసిన కంపెనీ ప్రతినిధులు మీరు మీటింగ్‌ మిస్‌ అయ్యారు. కానీ డీల్‌ మిస్‌ కాలేదు. మీ మిస్సెస్‌ వేసిన డిజైన్స్‌ మాకు బాగా నచ్చాయి అంటూ కావ్యను పొగడ్తలతో ముంచెత్తుతారు. తర్వాత రేపే అగ్రిమెంట్ చేసుకుందామని వారు వెళ్లిపోతారు.


సుభాష్‌: ఏరా మీటింగ్‌ పెట్టుకుని ఎక్కడికి వెళ్లావు. ఏ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా?


ప్రకాష్‌: ఈమెవరు? ( శ్వేతను చూపిస్తూ అడుగుతాడు.) నీతో ఉందేంటి?


సుభాష్‌: అవున్రా ఎవరు?


అని అడగ్గానే కావ్య కల్పించుకుని రాజ్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌ అని చెప్పగానే నాకెప్పుడు చెప్పలేదు అని సుభాష్‌ అడుగుతాడు. దీంతో ఇబ్బంది పడుతూనే రాజ్‌ తింగరి సమాధానాలు చెప్తుంటాడు. మరోవైపు అపర్ణ హాల్లో కూర్చుని ఫోన్‌ చూస్తుంటుంది. ధాన్యలక్ష్మీ టీ తాగుతుంది. ఇంతలో అనామిక, రుద్రాణి పైనుంచి వచ్చి మధ్యలో నిలబడి నువ్వు వెళ్లి అగ్గి పెట్టు మీ అత్తయ్యా ఆజ్యం పోస్తుంది అని చెప్పగానే అనామిక వచ్చి అపర్ణతో ఈ తాళాలు నువ్వు కావ్యకు ఇచ్చావు కద అత్తయ్య అనగానే అందరూ షాక్‌ అవుతారు. ధాన్యలక్ష్మీ వచ్చి కోపంగా వెటకారంగా అపర్ణను తిడుతుంటే అపర్ణ కూడా ధాన్యలక్ష్మీకి కౌంటర్‌ ఇస్తుంది. కావ్యను పుల్‌గా సపోర్ట్‌ చేస్తుంది.


ధాన్యలక్ష్మీ: నువ్వు నామీద కోపంతోనే కావ్యను నెత్తిన పెట్టుకుంటున్నావు అక్క


అపర్ణ: నువ్వు ఒకప్పుడు నెత్తిన పెట్టుకుని మోసుకుంటూ తిరిగావు. అప్పుడు నా మీద కోపంతోనే నా కోడలును నెత్తిన పెట్టుకున్నావా?


ధాన్యలక్ష్మీ: ఇప్పుడు నీకు అర్థం కాదు అక్క అర్హత లేని వాళ్లను అందలం ఎక్కించినందుకు ఏదో ఒకరోజు నువ్వే బాధపడతావు.


అపర్ణ: అయితే ఈ దీర్ఘాలన్నీ అరోజు తియ్యి. అప్పటి వరకు దాచిపెట్టుకో..


అంటూ చెప్పి కోపంగా లోపలికి వెళ్లిపోతుంది అపర్ణ. దీంతో అనామిక ఏదో ఆలోచిస్తు ఉండగానే రుద్రాణి వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఎప్పటికైనా ఈ ఇంట్లో పెత్తనం పెద్దకోడలుదే అని చెప్పింది కదా దాని గురించే ఆలోచిస్తున్నాను అని  చెప్పడంతో త్వరలోనే లాకర్‌లో రెండు లక్షలు పోయాయని తెలుస్తుంది అప్పుడు అపర్ణ కు కావ్య మీద ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇక జీవితంలో తాళాలు కావ్యకు ఇవ్వదని రుద్రాణి చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. 



Also Read: నా భార్యకేమైనా 16 ఏళ్లా? - ఏజ్‌ గ్యాప్‌ అనేది సమస్యే కాదు.. ట్రోల్స్‌పై ఆర్భాజ్‌ ఖాన్‌