Brahmamudi today episode: కావ్య, శ్వేత ఇద్దరూ వెన్నెల గురించి ఆ ఫంక్షన్ గురించి మాట్లాడుకోవడం మొత్తం తను విన్నానని కావ్యకి కారులో చెబుతాడు రాజ్ . దానికి తీరుగా కావ్య కూడా వెన్నెల గురించి అడుగుతుంది. అసలు ఈ బాబు ఎవరు ఈ బాబు గురించి ఏంటి అని కావ్య గట్టిగా రాజుని నిలదీసి అడుగుతుంది. నువ్వు ఏమీ అనుకున్న కూడా నేను అసలు చెప్పను వాడు నా వాడు, నా ఇంటికి వారసుడు అని చెబుతాడు. కారులో సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల కావ్య ఎటువైపు వెళ్లలేక ఇంటి వరకు చేరుకుంటుంది.
స్వప్నతో సంతకం చేయించేసాం కదా ఇప్పుడు ఈ కళ్యాణ్ తో సంతకం చేయించాలి అని రాహుల్ తో చెబుతుంది రుద్రాణి. రాహుల్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఫైల్ ఇచ్చి సంతకం చేయమని చెబుతాడు. సరిగ్గా కళ్యాణ్ సంతకం చేసే సమయానికి అనామిక వచ్చి ఇంటికి వెళ్దామని చెప్తుంది. మీ ఇంటికి నేను రాను. నువ్వు ఒక్కదానివే వెళ్ళు అని అంటాడు. అనామిక గొడవ పెట్టుకుంటుంది. మూడు స్పాయిల్ అవ్వడంతో ఆ ఫైల్ మీ సంతకం చేయకుండా అలాగే ఉండిపోతుంది. లాస్ట్ వినిట్లో అనామిక వచ్చి మూడు మొత్తం స్పాయిల్ చేసిందని రాహుల్, రుద్రాణి తెగ బాధపడతారు.
తన మనవడు రాజ్ గురించి కావ్యని అడుగుతుంది అమ్మమ్మ. చిన్నబాబుకి రాజ్ తండ్రి కాదు కదా అని ఎలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పెద్దావిడ. కానీ కావ్యమాత్రం ఆ బాబు గురించి వాళ్ళ అమ్మ గురించి ఎలా అయినా తెలుసుకోవాలని అంటుంది.
కాంట్రాక్ట్ ఫైల్ మీద కళ్యాణ్ చేత ఎలా అయినా సంతకం పెట్టించాలి అని అనుకుంటాడని రాహుల్ చాలా ప్రయత్నిస్తుంటాడు. అదే సమయానికి కళ్యాణ్ దగ్గరికి వస్తాడు రాజ్.
కళ్యాణ్: ఏంటన్నయ్య అలా చూస్తున్నావ్...
రాజ్: నేను తప్పుకొని నేనొక్కడినే కష్టాల్లోకి నెట్టేసాను. నేను మీ అందరిని ఎప్పటికీ కష్టం రాకుండా చూసుకోవాలి అనుకున్నాను. కానీ ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ విషయంలో నీకు ఎటువంటి హెల్ప్ చేయలేకపోతున్నాను.
కళ్యాణ్: నాకు కావలసింది నీ ఓదార్పు కాదు అన్నయ్య నీ మీద పడిన నిందని తొలగించుకుని తిరిగి నువ్వు నీ కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి. అదే నాకు కావలసినది. ఆరోజు నేను నిజంగా సంతోష పడతాను. నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటే సారీ అన్నయ్య. ఎందుకో చెప్పాలని అనిపించింది.
రాజ్: బాధ పెడుతున్నది నువ్వు కాదురా... నేను ఈ ఇంట్లో అందరిని కూడా బాధ పెడుతున్నాను.
కళ్యాణ్: మరి తెలిసి కూడా ఎందుకు చేస్తున్నావు అన్నయ్య.
అలా అడిగిన వెంటనే రాజు ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు.
కాంటాక్ట్ ఫైల్ గురించి ఎక్కడ చెప్పేస్తాడేమో అని రాహుల్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు.
రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాక రాహుల్ మళ్లీ కళ్యాణ్ దగ్గరకి వెళ్దాం అనుకున్న సమయానికి కావ్య అటునుండి వెళ్తూ ఉంటుంది. కళ్యాణ్ వదినా ఎక్కడికి వెళుతున్నారు అని కావ్యాని అడుగుతాడు. గుడికి అని చెప్పి కాసేపు ఇద్దరు మాట్లాడుకుంటారు. అప్పుడే కళ్యాణ్ వదినని ఒక కొత్త డీల్ వచ్చింది అని రాహుల్ తెచ్చిన డీల్ గురించి చెప్పి, అలాగే అది తీసుకువచ్చా తీసుకోకూడదా అని అడుగుతాడు.
ఎవరు శకుంతలా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించా అని అడుగుతుంది కావ్య. దీంతో రాహుల్ హడావిడిగా వచ్చి డీటైల్స్ చెప్పేలోపు అదొక ఫ్రాడ్ అని , తాను పొరపాటు పడ్డానని, క్షమించమని చెబుతాడు. రాహుల్ ఇంత బాధ్యతాయుతంగా ప్రవర్తించడం చూసి తనలో మార్పుకి చాలా ఆనందపడతాడు కళ్యాణ్.
కావ్య పక్కన ఉన్నంతవరకు ఇలాంటి మోసాలు చేయలేమని, అందుకే కావ్యని కూడా పదవినుంచి తప్పించలని రాహుల్, రుద్రాణి లు ఆలోచిస్తారు.
ఉదయం నుండి బాబు పాలు తాగకుండా ఏడుస్తున్నాడు అని డాక్టర్ కి ఫోన్ చేస్తాడు రాజ్.