Nindu Noorella Saavasam October 9th, ఈరోజు ఎపిసోడ్​లో మిస్సమ్మ రాథోడ్​కి అమర్​తో జరిగిన కథంతా చెప్పుకు వస్తుంది. అప్పుడు రాథోడ్ అదంతా విని కింద పడిపోతాడు. వెనుక నుంచి అరుంధతి కూడా ఆ మాటలు వింటుంది.


అరుంధతి: ఒక్క మాట ఎక్కువ మాట్లాడితేనే ఆయనకు నచ్చదు. అలాంటిది ఈ అమ్మాయి అన్ని గొడవలు పడింది. ఇంకేం ఉంచుతారులే అని అనుకుంటుంది.


మరోవైపు మిస్సమ్మ వెనక తిరిగి చూసేసరికి అక్కడ రాథోడ్ ఉండడు. ఏమైందని కిందకి చూసేసరికి కళ్లు తిరిగి పడిపోతాడు రాథోడ్. వెంటనే వెళ్లి రాథోడ్​ని లేపుతుంది మిస్సమ్మ.


రాథోడ్: ఆయన కళ్లల్లోకి చూసి మాట్లాడడానికే సగం మంది జడిసి నోరు కూడా ఎత్తరు. అలాంటిది నువ్వు అన్ని మాటలు అన్నావు. అసలు ఆయన లెఫ్ట్నెంట్ అని నీకు గుర్తుందా?


మిస్సమ్మ: అదే రాథోడ్ గారు మామూలుగా అయితే మనిషిని చూసిన వెంటనే అంచనా వేసేస్తాను. కానీ ఎందుకు అంచనా వేయలేకపోయాను అని అనుకుంటున్నాను. అయినా ఇన్ని మాటలు అన్న తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్లిపోవడమే మంచిది.


రాథోడ్: కానీ మీ నాన్నగారి కోసం సంతకం కావాలన్నావు కదా?  సార్​కి కోపం ఎక్కువ కానీ సెంటిమెంట్స్ కూడా ఎక్కువే. ఒకసారి విషయం చెప్పు ఆయనే కరిగిపోయి సంతకం పెట్టేస్తారు.


మిస్సమ్మ: ఆయన మనసు లేని మొండి మనిషి. ఎంతకీ కరగరు, నేను ఇంకా బయలుదేరుతాను రాథోడ్.


అరుంధతి: నేను కనిపించే, వినిపించే ఏకైక అమ్మాయి కూడా ఇల్లు వదిలి వెళ్లిపోతాను అంటుంది. ఇప్పుడు మను నుంచి నా పిల్లల్ని ఎవరు కాపాడతారు? వాళ్లను ఎవరు చూసుకుంటారు? అని బాధపడుతుంది.


ఆ తర్వాత సీన్లో అరుంధతి హాల్లోకి వచ్చినప్పుడు మనోహరి తన పనిమనిషితో సరదాగా కబుర్లు చెప్పుకోవడాన్ని చూస్తుంది.  అప్పుడు తను  గతంలో మనుతో గడిపిన తీపి జ్ఞాపకాలన్నీ గుర్తుతెచ్చుకుంటూ ఉంటుంది.


అరుంధతి: అసలు నువ్వు చాలా మారిపోయావు మను. ఒకప్పుడు మనం ఎంత ఆనందంగా ఒకరికోసం ఒకరు గడిపే వాళ్లం. ఇప్పుడు ఇంతలాగా ఎలా మారిపోయావు అని బాధపడుతుంది.


మరోవైపు అంజు తప్పా.. మిగిలిన పిల్లలు ముగ్గురు బాగా చదువుకోవాలని మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ అంజు మాత్రం తన మంచం మీద కూర్చుని ఉంటుంది.


అంజు: మీరు నాకు సంబంధం లేని టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నారు. చదువు గురించి మాట్లాడుతున్నారు అలాంటివన్నీ నాకు ఎక్కవు. ఈ డిస్కషన్స్ అన్ని వేస్ట్ ఆఫ్ టైం. అయినా ఆ మిస్సమ్మ వెళ్లిపోతుంది లేకపోతే ఒక ఆట ఆడుకునేదాన్ని. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది. అని అనగా ఇంతలో మిస్సమ్మ, రాథోడ్​తో పాటు అక్కడికి వస్తుంది.


మిస్సమ్మ: సరే పిల్లలు నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి.


అంజలి: వి విల్ మిస్ యు మిస్సమ్మ అని ఓవరాక్షన్ చేస్తుంది అంజలి.


తర్వాత మిస్సమ్మ, రాథోడ్​తో పాటు హాల్లోకి వస్తుంది. అప్పుడు మనోహరి వాళ్లకి కనిపిస్తుంది.


మనోహరి: వెళుతున్నందుకు చాలా బాధగా ఉంది.


మిస్సమ్మ: ఏం చేస్తాం మీరు ఎవరిని అపాయింట్ చేస్తే వాళ్లే ఉండేటట్టు దేవుడి రాతలో రాసుందేమో? అందుకే ఇలా జరిగింది. ఇంక నేను బయలుదేరుతాను. వెళ్లే ముందు పెద్దవాళ్లు ఆశీర్వాదాలు కూడా తీసుకుంటాను.


మను: ఆ తప్పకుండా అటువైపు ఉన్నారు వెళ్లు అని ఆనందంగా చెప్తుంది. అప్పుడు మిస్సమ్మ అమర్ వాళ్ల అమ్మ నాన్నల దగ్గర కూడా ఆశీర్వాదాలు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతుంది.


మరోవైపు చిత్రగుప్తుడు తన ఉంగరం పోయినందుకు బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అరుంధతి అక్కడికి వస్తుంది.


అరుంధతి: ఏంటి మిస్టర్ గుప్తా ఒక్కరోజులో నేను ఆత్మనవ్వడం ఏంటి? నాకు ఇన్ని విషయాలు తెలియడమేంటి?  సొంత స్నేహితురాలు ఇన్ని ఘోరాలు చేయడమేంటి? ఈ మధ్యలో నీ ఉంగరం పోవడం ఏంటి?


చిత్రగుప్తుడు: అబ్బా ఏం తెలియలేనట్టు ఎంత బాగా నటిస్తుందో? అని మనసులో అనుకుంటాడు.


అరుంధతి: ఏంటి మిస్టర్ గుప్తా అలా చూస్తున్నారు. కొంపతీసి ఆ ఉంగరాన్ని నేనే తీసాను అనుకుంటున్నారా?


చిత్రగుప్తుడు: అబ్బే నేను ఎందుకు అలా అనుకుంటాను? అయినా మీకు ఆ అవసరం ఏముంది? నా ఉంగరం తీయడానికి..


అరుంధతి: అయినా మిస్టర్ గుప్తా  ఆ అమ్మాయిని ఇంట్లో ఉంచడానికి ఒక కారణమైన కావాలి. దేవుడా ఒక్క కారణం చూపు అని ఆలోచిస్తూ ఉండగా వెంటనే ఏదో ఐడియా వచ్చినట్టు అక్కడ నుంచి పారిపోతుంది.


చిత్రగుప్తుడు: తనకు చూసిన వెంటనే ఆలోచన  వచ్చింది నాకు మాత్రం ఏ పరిష్కారం ఉండదు. స్వామి నా ఉంగరం నాకు దక్కేలా చూడు అని అనుకుంటాడు.


అదే టైంలో మిస్సమ్మ సూట్ కేస్ సర్దుకుంటూ గేటు వద్దకు వచ్చేస్తుంది. ఇంతలో అరుంధతి మిస్సమ్మని పిలుస్తుంది. అదే సమయంలో రాథోడ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు.


అరుంధతి: అబ్బా కరెక్ట్ టైంలో రాథోడ్ వచ్చాడు. ఇప్పుడు ఈ అమ్మాయి నాతో మాట్లాడితే నేను ఎవరినో తెలిసిపోతుంది.


మిస్సమ్మ: నేను ఇంక వెళ్తున్నానండి అని అరుంధతితో అంటుంది. కానీ రాథోడ్ తనతో మాట్లాడుతుందేమో అనుకుంటాడు.


రాథోడ్: వెళ్తున్నట్టు నాకు తెలుసు కదా అయినా చెప్తున్నాను ఏంటి? పాపం అందరికీ చెప్పింది కదా నాకు చెప్తున్నట్టు ఉంది పిచ్చి పిల్ల అని మనసులో అనుకుంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.


Join Us On Telegram: https://t.me/abpdesamofficial