Prema Entha Madhuram August 15th: ఛాయాదేవితో  ఆర్య ఎవరు నువ్వు అనటంతో.. తన ఫేస్ అందరికీ చూపిస్తుంది. వచ్చి ఆర్య ఎదురుగా నిలబడి ఛాయాదేవి.. నీ చిరకాల శత్రువుని అని పొగరుగా అంటుంది. హౌ ఆర్ యు మిస్టర్ ఆర్య వర్ధన్ అంటూ.. సారీ టెన్షన్ లో ఉండి ఈ క్వశ్చన్ అడగకూడదేమో అని అంటుంది. వెంటనే ఆర్య ఎవరు నువ్వు.. ఎందుకు నన్ను టార్గెట్ చేశావు అని ప్రశ్నిస్తాడు. దాంతో ఛాయాదేవి.. అన్ని ఒకేసారి ఎందుకు అడుగుతున్నావు.. అన్ని విషయాలు తెలుసుకోవాలన్న ఆరాటం దేనికి ఆర్య వర్ధన్.. ఒక్కొక్కటి తెలుసుకుంటూ పోదాం.. ఈ శత్రుత్వం ఒక్కరోజుతో తీరిపోయేది కాదు అని అనటంతో వెంటనే ఆర్య కోపంతో హ్మ్ అంటూ చెయ్యి పెట్టి ఆపుతాడు.


నువ్వు నా బాబు అనుకొని భాను బాబుని తీసుకొచ్చావు.. మర్యాదగా తన బాబుని తనకు అప్పజెప్పు అని అంటాడు. వెంటనే జిండే కూడా నీకు ఆర్య గురించి తెలియదు. నువ్వు బాబుని ఇవ్వకపోతే పోలీసులు అరెస్టు చేస్తారు అని అంటాడు. ఇక ఛాయాదేవి ఆర్య గురించి తనకు తెలియనిది ఏముంది అని ఆర్య స్టేటస్, బ్యాగ్రౌండ్ మొత్తం చెప్పేస్తుంది. ఆ తర్వాత అను ఛాయాదేవిని బ్రతిమాలి కాళ్లు పట్టుకుందాం అనే లోపు ఆర్య ఆపుతాడు.


ఆ తర్వాత ఛాయాదేవి తను నీ కన్నా కొడుకు కాదని తెలిసాక ఇక నాకేం పని అని తన మనిషిని పిలుస్తుంది. ఇక అతడు బాబుని తీసుకొని రావటంతో ఛాయ దేవి ఆ బాబుని తీసుకొని.. నీవల్ల ఆర్య వర్ధన్ సిటీ మొత్తం తిరిగేసాడు, తనలో భయం కనిపించింది అని బాబుకు ముద్దు పెట్టి అనుకి ఇస్తుంది. ఇక ఆర్య అనుని తీసుకెళ్ళమని దంపతులకు చెబుతాడు. ఆ తర్వాత ఆర్య మదన్ పై బాగా ఫైర్ అవుతాడు.


ఇప్పటికీ నువ్వు చాలా తప్పులు చేశావు. ఈసారి మాత్రం ఏదైనా చేస్తే అసలు ఊరుకునేది లేదు అని బెదిరించడంతో మదన్ కూడా ఏమాత్రం భయపడకుండా మాట్లాడుతాడు. ఇక ఆర్య అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఛాయాదేవి ఆపి మన మధ్య శత్రుత్వం ఎలా మొదలైందో దాని గురించి అడుగుతావని అనుకుంటే అలా వెళ్ళిపోతున్నావేంటి అని అనటంతో ఆర్య తన స్టైల్ లో  సమాధానం చెప్పి అక్కడినుంచి వెళ్తాడు.


జిండే కూడా ఛాయాదేవితో.. ఆర్య ఎదుట నిలబడి శత్రువు అని చెప్పినా కూడా తను భయపడలేదు అంటే తన గురించి ఏంటో పూర్తిగా తెలుసుకో అన్నట్లు మాట్లాడి.. మరోసారి ఆర్య జోలికి వస్తే బాగుండదు అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మదన్ ఛాయాదేవితో ఆర్య భయపడతాడు అనుకుంటే తిరిగి ఇలా కౌంటర్ ఇచ్చాడు ఏంటి అని అనటంతో.. వెంటనే ఛాయాదేవి.. అతనిలో ఎంతో కొంత భయం ఉంది కానీ అది బయటపడటం లేదు అని.. ఇక ఆర్యను అసలు వదిలేది లేదు అంటూ నేనేంటో అతడికి చూపిస్తానని పొగరుగా అంటుంది.


మరోవైపు మాన్సీ లాయర్ కి ఫోన్ చేసి వర్ధన్ ఫ్యామిలీలోకి తను వెళ్లే లాగా చేయమని చెబుతుంది. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత.. అదే సమయంలో అక్కడ  అంజలి ఛాయాదేవి ఇంట్లోకి సీరియస్ గా వెళ్లడంతో అంజలిని చూసి ఇక్కడికి ఎందుకు వచ్చింది.. ఏం జరుగుతుంది అని తనను ఫాలో అవుతుంది. ఇక అంజలి కోపంగా లోపలికి వెళ్లి తన అన్న మదన్ పై ఫైర్ అవుతుంది. నీకు ఆర్య సార్ చాలా రకాలుగా హెల్ప్ చేశాడు నువ్వేంటి ఇలా చేస్తున్నావు అని అరుస్తుంది.


దాంతో మదన్ ఆర్య తనను టార్గెట్ చేసిన విషయాల గురించి చెబుతూ.. తనను బాధ పెట్టాలి అని ఛాయాదేవితో చేతులు కలిపాను అని అంటాడు. ఇక అంజలి ఛాయాదేవిపై కూడా ఫైర్ అవుతుంది. కానీ తను మాత్రం కూల్ గా సమాధానం చెబుతుంది. ఆ తర్వాత మదన్ నువ్వు ఎందుకు అంతలా వాళ్ళ గురించి ఆరాటపడుతున్నాము.. మా దాంట్లో కలిసిపో అని అనడంతో ఛాయాదేవి కూడా అవును మా దాంట్లో కలిసిపో ముగ్గురం కలిసి ఆర్యకు ఎదురు దెబ్బ కొడదాం అని అంటుంది. దాంతో అంజలి తిరిగి ఛాయాదేవి పై ఫైర్ అవుతుంది.


ఆర్య సర్ జోలికి వస్తే బాగుండదు అని హెచ్చరిస్తుంది. అంతేకాకుండా తన అన్నతో నువ్వు ఇలా చేస్తున్నావ్ అన్న సంగతి అమ్మ వాళ్లతో చెబుతాను అనటంతో.. మదన్ కోపంతో రగిలిపోతూ.. నువ్వు నీ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నేను కూడా ఇలాగే చేస్తాను.. నా జోలికి రావద్దు.. నీ హద్దులో నువ్వు ఉండు అంటూ గెట్ అవుట్ అని అరుస్తాడు. దాంతో అంజలి షాక్ తో అక్కడ నుంచి వెళ్తుంది. ఇదంతా మాన్సీ గమనిస్తుంది. ఇక ఛాయాదేవి ఆర్యకు శత్రువు కాబట్టి.. మాన్సీ ఛాయాదేవితో కచ్చితంగా చేతులు కలిపే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 


 


also read it : Trinayani August 14th: 'త్రినయని' సీరియల్: హాసినికి విలువైన బహుమతి ఇచ్చిన సుమన.. నెలవంకతో తిలోత్తమాకు బోల్తా కొట్టించే ప్లాన్ చేసిన విశాలాక్షి?


 


Join Us on Telegram: https://t.me/abpdesamofficial