Prema entha madhuram september 4th: ఎపిసోడ్ ప్రారంభంలో మీ ఆఫీసు నేను చూస్తాను అని అక్షర అనగా ఆర్య తన సెక్రెటరీ నీ అక్షర కి ఆఫీస్ ని చూపించమని చెప్తాడు. అక్షర వెళ్లిపోయిన తర్వాత జెండే తిను చాలా పద్ధతులతో విలువలతో పెరిగినట్టు ఉన్నది వాళ్ళ అమ్మ తినని బాగా పెంచింది చాలా తెలివైన పిల్ల అని పొగుడుతాడు. అప్పుడు ఆర్య చంటి పిల్లలు తెల్ల కాగితాలతో సమానం.మనం ఏమి రాస్తే అదే వాళ్ళ జీవితం అవుతుంది. ఇప్పటినుంచే విలువలతో పెంచుతున్నారు అని అంటాడు.


ఆ తర్వాత సీన్లో ఛాయాదేవి స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి స్కూల్ ని మూయమని చెప్పాను లేకపోతే నోటీసులు పంపిస్తాను మూడే రోజులు టైం ఇస్తున్నాను అని బెదిరిస్తుంది. ప్రిన్సిపల్ ఎంత బతిమిలాడినా కూడా ఛాయాదేవి అస్సలు తగ్గదు. ఛాయాదేవి పక్కనే ఉన్న మాన్సి ఈ మాటలన్నీ విని నవ్వుకుంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపల్ ఆర్య కి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పగా ఆర్య కాన్ఫరెన్స్ కలపమని చెప్తాడు. కాన్ఫరెన్స్లో ఆర్య ఒకవేళ కాని ఈ స్కూల్ ని ఆపేద్దామని ఆలోచనలో ఉంటే నేను ఇంకో మార్గం నుంచి వస్తాను.


 బిజినెస్ లో నిన్ను పూర్తిగా తొక్కేస్తాను. నీ దగ్గర ఉన్న ఇల్లీగల్ ఆక్టివిటీస్ అన్నిటిని బయటపెడతాను అని బెదిరిస్తాడు. ఫోన్ని మ్యూట్లో పెట్టి మాన్సి ఇప్పుడు అవన్నీ ఎందుకు స్కూల్ జోలికి రాము అని చెప్పే అని ఛాయాదేవి తో అంటుంది. కానీ ఛాయాదేవి ఆ మాటలేవి పట్టించుకోకుండా నువ్వు ఆ స్కూల్ ని ఎంత కాపాడుతుంటే నాకు అంత నాశనం చేయాలనిపిస్తుంది. ఎలాగైనా స్కూల్ ని నాశనం చేస్తాను దానికి నాకు నష్టం వచ్చిన సరే ఏం పర్లేదు అని అంటుంది ఛాయ దేవి.


 సరే అయితే నాశనానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆర్య. ఆ తర్వాత సీన్లో అక్షర తిరిగి ఆర్య దగ్గరికి వచ్చి లేట్ అవుతుంది ఫ్రెండ్ ఇంటికి వెళ్దాము అని అనగా ఆర్య తనని ఇంట్లో దింపడానికి బయలుదేరుతాడ. మరోవైపు అభయ్ చెల్లి ఇంకా రాలేదు అని గడప బయట ఎదురు చూస్తూ ఉంటాడు. హాల్లో కూర్చుని పిల్లలు ఆయనకి ఎంత దగ్గర కాకూడదు అనుకుంటున్నాను అంతే దగ్గర అవుతున్నారు ఇలాగైతే ఆయన ప్రాణానికి ప్రమాదమే.


 దీని నుంచి ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల ఆర్య అక్షరాని పట్టుకొని ఇంటికి వస్తాడు. ఆర్య ని చూసిన అను లోపలికి వెళ్లి దాక్కుంటుంది. లోపలికి రా ఫ్రెండ్ ఇది మా ఇల్లు అని అక్షర అనగా స్ట్రేంజర్స్ ని లోపలికి తీసుకురావద్దు అని అభయ్ అంటాడు. తిను స్ట్రేంజర్ కాదు నా ఫ్రెండే అని చెప్పి లోపలికి తీసుకొని వస్తుంది అక్షర. మరోవైపు అను ఎంతో కంగారుపడుతూ ఉంటుంది. ఇంతలో నీరజ్ ఆర్య కి ఫోన్ చేసి అను కనబడిన విషయం చెప్తాడు. ఆర్య వెంటనే అక్కడి నుంచి పరిగెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.


 ఇంతలో అను ఊపిరి పీల్చుకొని హాల్లోకి వస్తుంది. ఆర్య తెచ్చిన గిఫ్ట్ లను అభయ్ కి ఇవ్వగా వద్దు అని కోపంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు.నువ్వు లేటుగా వచ్చావు అని అన్నయ్య కోపం అని అక్షర కి సద్ది చెప్తుంది అను. మరోవైపు ఆర్య పరిగెత్తుకుంటూ నీరజ్ దగ్గరికి వస్తాడు. నిజంగానే అను కనిపించిందా అని అనగా పక్కనే ఉన్న అంజలి జరిగిన విషయం అంత ఆర్య కి చెప్తుంది. పంజాగుట్ట సర్కిల్ దగ్గరే కనిపించింది కచ్చితంగా చుట్టుపక్కలే ఉంటుంది. నా గొంతు విని అలెర్ట్ అయిపోయింది అనవసరంగా అరిచాను అని అంటుంది అంజలి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial