బిగ్ బాస్ అనేది ప్రారంభమయిన తర్వాత ప్రతీ సీజన్‌లో టాస్కులు, కంటెస్టెంట్స్ పొందే పనిష్మెంట్లు.. ఇవన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. సీజన్, సీజన్‌కు ఇవన్నీ మారుతూనే ఉంటాయి. కానీ దాదాపు ప్రతీ బిగ్ బాస్ సీజన్ లాంచ్ ఎపిసోడ్ మాత్రం ఒకేలా ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 7 మాత్రం పూర్తిగా అన్నింటికంటే భిన్నం అని, ఉల్టా పుల్టా అని లాంచ్ ఎపిసోడ్ నుండే నిరూపించుకోవడం మొదలుపెట్టింది. ఎందుకంటే మొదటి ఎపిసోడ్‌లోనే బిగ్ బాస్ సీజన్ 7లో అనేక మార్పులు జరగనున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మార్పులు చూస్తుంటే.. బిగ్ బాస్ సీజన్ 7లో మరెన్నో కొత్త మార్పులు ఉండబోతున్నాయని అర్థమవుతోంది.


నాగ్ నో ఎంట్రీ..
మామూలుగా ఇప్పటివరకు జరిగిన ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో హోస్ట్.. కంటెస్టెంట్స్ కంటే ముందే హౌజ్‌లోకి వెళ్లి అసలు ఆ హౌజ్ ఎలా ఉంటుంది అని ప్రేక్షకులకు చూపించేవారు. కానీ బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ ఉంబోతున్న హౌజ్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలియలేదు. ఎందుకంటే నాగార్జున ముందుగా హౌజ్‌లోకి వెళ్లలేదు. నేరుగా కంటెస్టెంట్స్‌నే అందులోకి పంపించారు. పైగా కంటెస్టెంట్స్ లోపలికి వెళ్లే సమయానికి అక్కడ కనీసం ఫర్నీచర్ కూడా లేదు. ఆ తర్వాత వారే ఫర్నీచర్‌ను టాస్క్ ఆడి గెలుచుకున్నారు. అది కూడా ఒక టైమర్‌ను సెట్ చేసి.. ఆ టైమ్‌లోపు కంటెస్టెంట్స్ అందరూ కలిసి ఎంత ఫర్నీచర్ తెచ్చుకోగలిగితే.. అంత ఫర్నీచర్ వారి సొంతమని చెప్పారు.


పవర్ అస్త్రా ప్రేక్షకుల చేతుల్లో..
బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా ఎంటర్ అయిన వెంటనే అందరికీ ఒక ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. వారంతా కేవలం కంటెస్టెంట్సే అని ‘పవర్ అస్త్రా’ ఎవరు గెలుచుకుంటారో వారు మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌లో హౌజ్‌మేట్స్‌లాగా కొనసాగుతారని చెప్పారు. అంటే ఇప్పటివరకు హౌజ్‌లో ఎవరూ కన్ఫర్మ్‌గా కంటెస్టెంట్స్ అవ్వలేదని అర్థం. అంటే ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు. పవర్ అస్త్రా లభించిన వారిని మాత్రమే బిగ్ బాస్ హౌజ్‌లో ఉంచి, మిగతావారిని పంపించేసి కొత్త వారిని తీసుకొస్తారా అన్న అనుమానాలు కూడా ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. పైగా ఈ పవర్ అస్త్రా ఎవరికి దక్కాలి అన్న నిర్ణయం ప్రేక్షకుల చేతిలో ఉంటుందని చెప్పారు కానీ అది ఎలా అనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.


10 కాదు ఒకటి మాత్రమే..
బిగ్ బాస్ ప్రేక్షకులు తమకు నచ్చిన ఒక కంటెస్టెంట్‌కు అయినా లేదా వేర్వేరు కంటెస్టెంట్స్‌కు అయినా 10 ఓట్లు వేసే అవకాశం ఉండేది. కానీ ఈసారి ఒక ప్రేక్షకుడికి ఒక ఓటు మాత్రమే అని చెప్పి నాగార్జున పెద్ద షాకే ఇచ్చారు. మిస్డ్ కాల్ అయినా హాట్‌స్టార్ నుండి అయినా ఒకరు కేవలం ఒక ఓటు మాత్రమే వేయగలరని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా బిగ్ బాస్‌లో మామూలుగా 20కు పైగా కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతూ ఉంటారు. కానీ ఈసారి కేవలం 14 మంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌజ్‌లోకి వెళ్లారు. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నా కేవలం ఇద్దరిని మాత్రమే అలా తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. మరి ఈ 14 మంది కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ సీజన్ 7 ఎంతకాలం నడుస్తుంది అనే విషయంపై కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు మొదలయ్యాయి.


Also Read: పెద్దాయన మారిపోయుండు - ‘బిగ్ బాస్’ ఓటింగ్ విషయంలో కీలక మార్పులు, ఇలాగైతే కష్టమే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial