Prema entha madhuram september 25th: ఒరేయ్ అన్నయ్య నువ్వు నన్ను ఏడిపిస్తే పెద్దయ్యాక నేను పెద్ద కార్ కొని అమ్మను మాత్రమే అందులో తీసుకొని వెళ్తాను నిన్ను తీసుకొని వెళ్ళను అని అంటుంది అక్కి.


అభయ్: లేదు అమ్మకి నేనే కారు కొని అందులో తీసుకొని వెళ్తాను అని ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు.


అను: లేదు మన ముగ్గురం కలిసి ఒకే కారులో వెళ్దాము. ఇంక మనం గుడి లోపలికి వెళ్దాము అని అనగా ఇంతలో పిల్లలు ఇద్దరు అను దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు.


అభయ్: ఆ రాముడు కూడా తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఎన్నో సాధించారు కదమ్మా. మాకు అమ్మయినా నాన్న అయినా నువ్వే అందుకే మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని అంటాడు. దానికి అను ఆశీర్వదిస్తుంది తర్వాత ముగ్గురు లోపలికి వెళ్తారు. అక్కడ అను గుడి పుస్తకంలో వాళ్ళ నేమ్స్ రాస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న అతను తండ్రి పేరు కూడా రాయమని అంటాడు.


అను: ఇలాంటప్పుడైనా ఆర్య సార్ పేరు రాద్దాము ఇప్పుడైనా సర్ నీ తండ్రిగా చెప్పే అవకాశం దొరికింది అని మనసులో అనుకొని ఆర్య పేరు తండ్రి స్థానంలో రాస్తుంది. ఆ తర్వాత సీన్లో ఆర్య, నీరజ్, అంజలి, జెండేలు గుడి దగ్గరికి వస్తారు.


ఆర్య: అంతా మనం అనుకుంటున్నాట్టే జరుగుతుంది కదా జెండే. అందరి పేర్లు నోట్ చేసుకోమని చెప్పావు కదా?


జెండే: ఎస్ ఆర్య ఆన్లైన్ లోనే కాదు గుడికి వచ్చి పాటిస్పేట్ చేస్తున్న వాళ్ళ అందరి పేర్లు నోట్ చేయమని చెప్పాను అని అనగా ఇంతలో ఒక తండ్రి తన కొడుకుని ఎత్తుకుంటూ ఉండగా ఆ దృశ్యాన్ని చూసి ఆర్య ఆగిపోతాడు.


అంజలి: పిల్లలు గుర్తొస్తున్నారా సార్ ఏం పర్వాలేదు ఆ దేవుడు ఎలాగైనా మిమ్మల్ని పిల్లలతో, అనుతోని కలుపుతారు నాకు ఆ నమ్మకం ఉంది. అని అంటుంది. ఆ తర్వాత సీన్లో అంజలి ఒక చెట్టు దగ్గర నించొని పేపర్లో ఏదో రాస్తుంది.


నీరజ్: ఏమి రాస్తున్నావ్ అంజలి?


అంజలి: ఈ చెట్టు దగ్గరకి వచ్చి ఏం కోరుకొని పేపర్ మీద రాసిన అది నిజమవుతుందట అందుకే నా కోరిక కోరుకున్నాను అని అనగా ఆ కాగితాన్ని లాక్కొని ఆ కోరిక ఏంటో చదువుతాడు నీరజ్. అందులోకి అను ఆర్య సార్ నీ చేరుకోవాలి కుటుంబమంతా ఆనందంగా ఉండాలి అని రాసి ఉంటుంది.


నీరజ్: కోరిక అంటే నీకోసం కోరుకుంటావు అనుకున్నాను కానీ కుటుంబం కోసం కోరుకుంటున్నావు చూడు నువ్వు గ్రేట్ అంజలి. ఐయామ్ లక్కీ 


అంజలి: అను వస్తేనే ఆర్య సార్ బాగుంటారు ఆర్య సార్ బాగుంటేనే కుటుంబం ఆనందంగా ఉంటుంది.


జెండే: వెరీ గుడ్ అంజలి వర్ధన్ ఇంటి కోడలివి అని నీ మంచితనం తోని నిరూపించుకున్నావు అని అంటాడు. ఆ తర్వాత సీన్లో అను గుడి దగ్గర కృష్ణుడి అడుగులను ముద్రలు వేస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ అవి చూస్తూ ఉంటారు. ఇంతలో అటువైపే వస్తున్న ఆర్యని అక్కీ చూసి ఫ్రెండ్ అని గట్టిగా అరుస్తుంది. ఆ మాట విన్న అను వెంటనే కంగారుపడి మరోవైపు నుంచి వెళ్లిపోదామని చూడగా అక్కడ నిరజ్ వాళ్ళు ఉంటారు. ఇలా దొరికిపోయానేంటి అని భయపడిన అను మరో దారి నుండి అక్కడి నుంచి వెళ్లి దాక్కుంటుంది. ఇంతలో అభయ్, అక్కిలు ఆర్య దగ్గరికి వస్తారు.


అక్కి: హాయ్ ఫ్రెండ్


ఆర్య: హాయ్ డియర్ నువ్వు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నావా? నీ డ్రెస్ చాలా బాగుంది


అక్కి: థాంక్స్ ఫ్రెండ్ నువ్వైనా నా డ్రెస్ బాగుంది అన్నావు మా అమ్మ మా అన్నయ్య డ్రస్సు బాగుంది అని అన్నది అని అనగా ఇంతలో నీరజ్ అంజలీలు కూడా అక్కకి హాయ్ అని అంటారు. అప్పుడు అక్కి అభయ్ ని వాళ్లకు పరిచయం చేస్తుంది.


అంజలి: చూడు నీరజ్ వీళ్లు భలే ముచ్చటగా ఉన్నారు కదా రా ఫొటోస్ తీసుకుందామని పిల్లలు ఇద్దరితో నీరజ్, అంజలీలు ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఈ దృశ్యాన్ని అంతటినీ ఒక మూల నుంచి చూస్తుంది అను. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత అను పిల్లలిద్దరినీ పక్కకు లాక్కొని వస్తుంది.


అను: రండి మనం ముందు ఇక్కడి నుంచి బయలుదేరుదాము. మన సందు చివర ఉన్న సెలబ్రేషన్స్ లో పాటిస్పేట్ చేద్దాము.


అక్కి: అదేంటమ్మా అలా అంటావు మనం ఇంత దూరం వచ్చింది ఇందుకే కదా వెళ్లిపోమంటావ్ ఏంటి నేను రాను అని పేచీ పెడుతుంది.


అభయ్: పాపం చెల్లి అంతలా బతిమిలాడుతుంది కదమ్మా. వద్దు ఉందాము అని అనగా అను వెళ్లిపోదామని అంటుంది. ఇంతలో జెండే అటువైపు వచ్చి ఆక్కీ టైం అవుతుంది రండి అని అంటాడు. ఇంతలో పిల్లలు ఇద్దరు జెండే దగ్గరకు వెళ్తారు. అను ఏమి చేయలేక ముఖాన్ని కప్పుకొని ఉండిపోతుంది. అప్పుడు జెండే పిల్లలు ఇద్దరినీ తన భుజాల మీద ఎక్కించుకొని కాంపిటీషన్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు. అక్కడ పిల్లలందరూ డాన్స్ చేస్తూ ఉంటారు.


అను: దేవుడా దయచేసి ఈ రోజు నేను ఆర్య సార్ కి కనిపించకుండా ఉండేటట్టు నువ్వే చేయాలి అని దేవుడిని వేడుకుంటుంది.


Also Read: Brahmamudi September 25th: రాజ్ ని ఆకాశానికెత్తేసిన కావ్య- స్వప్న మర్డర్ కి రాహుల్ స్కెచ్, రగిలిపోతున్న రుద్రాణి


Join Us On Telegram: https://t.me/abpdesamofficial