Nindu Noorella Saavasam October 5th: ఈరోజు ఎపిసోడ్ లో మనోహరి మాట్లాడుతూ నేను ఎలాగైనా అమర్ ని దక్కించుకుంటాను, క్రితంసారిలా అస్సలు వదులుకోను. అమర్ తో కలిసి జీవించటానికి దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చాడు. ఏం చేసైనా సరే అమర్ ని సొంతం చేసుకుంటాను. అరుంధతి ఫోటో చూస్తూ నువ్వేమీ బాధపడకు, అమర్ ని నీకంటే నేను బాగా చూసుకుంటాను. నువ్వు అన్నదానివే గుర్తు లేకుండా చేస్తాను. ఇక పిల్లల సంగతి అంటావా నేను చెప్పినట్టు వింటే అమర్ కనుసన్నల్లో ఉంచుతాను. లేదంటే అమర్ కి శాశ్వతంగా దూరం చేసేస్తాను. ఇక ఆ ముసలి వాళ్ళ సంగతి అంటావా..వాళ్ళ గురించి ఎలాంటి మాట ఇవ్వలేను ఎందుకంటే వాళ్ళు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు. రేపటి నుంచి నాది అమర్ ది కొత్త కధ మొదలవుతుంది..... బాయ్ అరుంధతి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
Also Read: మేజర్ ను చూసి షాకైన మిస్సమ్మ - మనోహరి నిజస్వరూపం తెలుసుకున్న అరుంధతి!
చిత్రగుప్తుడు: నువ్వు విన్నదంతా నిజం. ఈ నిజం నీకు తెలియకూడదనే నిన్ను నాతో రమ్మని చెప్పాను. ఇన్నాళ్లు నువ్వు స్నేహం అనుకున్నది విషం అని మనసులో అనుకుంటాడు.
మనోహరి గురించి తెలుసుకుని బాగా ఎమోషనల్ అవుతుంది అరుంధతి.
చిత్రగుప్తుడు : నీ బాధ నాకు అర్థమైంది కానీ నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తాను. ఈరోజు తో మీ దశదినకర్మ పూర్తయింది. సూర్యాస్తమయం అయ్యేలోగా మనం మన లోకానికి వెళ్లాలి.
అరుంధతి: నా పిల్లల్ని ఏం చేస్తుందో అని భయంగా ఉంది.
చిత్ర గుప్తుడు : నన్ను క్షమించు నేను ఏమి సాయం చేయలేను. పదా మనం ఇక్కడి నుంచి వెళ్దాం.
అరుంధతి: నా కుటుంబం ఇలాంటి పరిస్థితులలో ఉండగా నన్ను రమ్మని ఎలా పిలుస్తున్నారు. పదండి మనం మన ఇంటికి వెళ్దాం.
చిత్రగుప్తుడు: తప్పు బాలిక.. నీకు ఆ ఇంటికి రుణం తీరిపోయింది. నువ్వు ఇంక ఆ ఇంటికి వెళ్ళకూడదు. మనం మా లోకానికి వెళ్ళక తప్పదు.
మరొకవైపు ఇంటికి వెళ్లిన తర్వాత తాళాలు తీయమని భార్యకి చెప్తాడు అమర్ తండ్రి.
అమర్ తల్లి: తాళాలు నా దగ్గర లేవు అంటుంది.
అమర్: రాథోడ్ తాళాలు నీ దగ్గర ఉన్నాయా..
రాథోడ్ : నా దగ్గర లేవు లీలా దగ్గర ఉండి ఉంటాయి.
అమర్: నీ దగ్గర ఎక్స్ట్రా సెట్ ఉంచుకోవాలి కదా అని మందలిస్తాడు.
ఇంతలో మనోహరి వాళ్లు వస్తారు.
మనోహరి : ఇంట్లోకి వెళ్లకుండా అందరూ బయట ఉన్నారు ఏంటి.
అమర్ తల్లి : తాళాలు నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ఎలా లోపలికి వెళ్ళమంటావు.
మనోహరి లీలని తాళాలు గురించి అడుగుతుంది.
Also Read: ఉలూచిని కనిపెట్టిన నయని - విశాల్ ని కాటేసిన నల్ల నాగు!
లీల : నా దగ్గర లేవు,ఆ కేర్ టేకర్ అమ్మాయి లాస్ట్ లో వచ్చింది. తాళాలు తన దగ్గరే ఉండి ఉంటాయి.
మనోహరి : ఆ అమ్మాయికి కాల్ చేయి రాథోడ్ మొదటి రోజే అందర్నీ బయట నుంచో పెట్టేసింది.
అమర్ తండ్రి : అమ్మాయి మనతో పాటు కారు ఎక్కిందా లేదా..
మనోహరి :నాకేం తెలుసు
అమర్: మనలో ఒకరిని అలా ఎలా వదిలేసి వచ్చేస్తారు.
మనోహరి : తను ఏమైనా చిన్న పిల్లా.. మనం కార్లు తీస్తున్నప్పుడు వచ్చి ఎక్కాలి కదా.
అమర్ తండ్రి : తీసుకురావాల్సిన బాధ్యత మనది. చివరిగా వచ్చింది మీరు. తీసుకురాకుండా వదిలేసి వచ్చేసారు.
అమర్: అయిపోయిందానికి గొడవ ఎందుకు నాన్న, రాథోడ్.. ఆమెకి ఫోన్ చెయ్యు.
రాథోడ్ పక్కకు వెళ్లి మిస్సమ్మ కి ఫోన్ చేస్తాడు.
రాథోడ్: ఎక్కడున్నావు.
మిస్సమ్మ : అదృష్టానికి ఆమడ దూరంలో, దరిద్రానికి చాలా దగ్గరలో ఉన్నాను.
రాథోడ్: నీ మాటలు నాకు ఏమీ అర్థం కావట్లేదు కానీ నువ్వు ముందు ఇంటికి రా.
మిస్సమ్మ: ఫోన్ లిఫ్ట్ చేసి నేను ఆ ఇంటికి రాలేను ఆ ఇంటికి నాకు బంధం తెగిపోయింది.
రాథోడ్: ముందు ఇంటికి రా వచ్చాక అన్ని మాట్లాడుకుందాం.
మిస్సమ్మ: నాలాంటి మంచి కేర్ టేకర్ ని మీరు వదులుకోలేరు.
రాథోడ్: ఇంకాపుతావా.. తాళాలు నీ దగ్గర ఉండిపోయాయి.
Also Read: ఆదర్శ్ విషయంలో మురారీని బోల్తా కొట్టించిన ముకుంద- అయోమయంలో కృష్ణ!
మిస్సమ్మ తన బ్యాగ్ లో చేయి పెట్టి చూసుకొని తాళాలు కనిపించడంతో ఇంక అక్కడికి వెళ్లడం తప్పదు అనుకొని బాధపడుతూ బయలుదేరుతుంది.
అదే సమయంలో చిత్రగుప్తుడు టైం అవుతుంది మనం వెళ్లాలి అని అరుంధతికి చెప్తాడు.
అరుంధతి: నా కుటుంబం కష్టాల్లో ఉంటే నన్ను రమ్మనమని ఎలాగా పిలుస్తున్నారు. మీకు మనసు ఎలా ఒప్పింది. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి వాళ్ళని రక్షించుకుంటాను.
చిత్రగుప్తుడు: నీ దశదినకర్మ పూర్తయింది. ఇక నీకు ఆ ఇంటికి, ఆ మనుషులకి ఎలాంటి సంబంధం లేదు. సూర్యాస్తమయం అయ్యేలోపు మనం ఇక్కడ నుంచి వెళ్లాలి.
అరుంధతి: నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నా పిల్లల్ని అత్తమామల్ని కాపాడుకోలేను ఎలాగైనా నేను ఇక్కడే ఉండాలి. గుప్తా గారిని ఎలా అయినా మేనేజ్ చేయాలి అనుకుంటుంది.
ఇంతలో చిత్రగుప్తుడు తనతోపాటు రమ్మని చేయందిస్తాడు. అప్పుడు అతను చేతికి ఉన్న ఉంగరం చూస్తుంది అరుంధతి. తనకి గతంలో జరిగిన సంఘటన గుర్తొస్తుంది.
అరుంధతి: మీ చేతికి అన్ని ఉంగరాలు ఉన్నాయి ఏంటి?
చిత్రగుప్తుడు : ఇప్పుడు వీటి చరిత్ర నీకెందుకు.
అరుంధతి: చెప్పండి గుప్తా గారు. అందులోని మీ చూపుడు వేలికి ఉన్న ఉంగరం స్పెషల్ గా కనిపిస్తుంది ఏంటది.
చిత్రగుప్తుడు : మా లోకం నుంచి వేరే లోకానికి వెళ్లాలన్నా, వేరే లోకం నుంచి మాలోకానికి వెళ్లాలన్నా ఈ ఉంగరం కచ్చితంగా ఉండాలి.
ఈ విషయం గుర్తుకొచ్చిన అరుంధతి చిత్రపుత్రుడిని చూస్తూ గబుక్కున లేచి అతని చేయి పట్టుకొని నన్ను ఎలా అయినా ఇక్కడ ఉండేలాగా చూడండి అంటూ బ్రతిమాలుతున్నట్లుగా బ్రతిమాలి ఆ ఉంగరం తీయటానికి ప్రయత్నిస్తుంది.
ఎపిసోడ్ ముగిసింది