Krishna Mukunda Murari October 5th: మురారీ, కృష్ణ బయటకి వెళ్లబోతుంటే భవానీ ఆదర్శ్ గురించి వివరాలు తెలుసుకోమని ఆపుతుంది. దీంతో కృష్ణ ఆగిపోవడంతో మురారీ ఒక్కడే వెళ్ళిపోతాడు. కృష్ణ ఫీల్ అయి ఉంటుందని మురారీ అనుకుంటాడు. రోడ్డు మీద ముకుంద మురారీని ఆపుతుంది. ఆదర్శ్ కోసం తాను కూడా వస్తానని అనేసరికి ఇదేమి ప్లాన్ కాదు కదా డౌట్ పడతాడు. ముకుంద తనని కూడా తీసుకెళ్లమంటే తీసుకెళ్లలేదని భవానీకి ఫోన్ చేసి అబద్ధం చెప్తుంది. ప్రభాకర్, శకుంతల కూర్చుని మాట్లాడుకుంటారు. కృష్ణ వచ్చి వినాయకుడి విగ్రహాన్ని తీసుకొస్తానని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతుంది. తాను ఎప్పుడు చెప్పానా అని ఆలోచిస్తూ ఉంటాడు. మళ్ళీ వెళ్ళి గణేషుడిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. చిన్నాన్న అనలేదు అంటున్నాడు మరి భవానీ అత్తయ్య అలా ఎందుకు చెప్పారని కృష్ణ అనుమానపడుతుంది. మురారీ వాళ్ళు ఒకతన్ని కలుస్తారు.


Also Read: కళ్యాణ్ ని దూరం పెడుతున్న అప్పు- కావ్యపై అనామికలో మొదలైన అసూయ- రాజ్ మంచితనం!


సార్: ఆదర్శ్ కి ఏమైందో నాకు తెలియదు. కానీ అతనికి సాధారణ జీవితం పట్ల ఆసక్తి పోయింది. మనుషులతో మాట్లాడటం ఇష్టం లేదు


మురారీ: ఆదర్శ్ కి ఒకసారి కాల్ చేయండి నేను మాట్లాడతాను


సార్: అతను ఫోన్ మాట్లాడటం లేదు వాకీ టాకీ మాత్రమే వాడుతున్నాడు. ఆదర్శ్ వస్తాడనే నమ్మకాన్ని వదిలేసుకుంటేనే మంచిది అనేసరికి మురారీ వెళ్ళిపోతాడు


ముకుంద: థాంక్యూ సర్ ఈ ప్రపంచంలో నా ప్రేమని అర్థం చేసుకున్నది మీరు ఒక్కరే. మీతో అబద్ధం చెప్పించినందుకు క్షమించండి


ముకుంద కోసం కృష్ణ వెతుకుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకో ముకుంద ప్లాన్ అనుకుంటుంది. అప్పుడే భవానీ ఎదురుపడితే కృష్ణ ఆదర్శ్ గురించి ఎవరు చెప్పారని అడుగుతుంది. మేజర్ చెప్పారని అంటుంది. ముకుంద, మురారీని తీసుకుని కాఫీ షాప్ లో కూర్చుని నటిస్తుంది. ఆదర్శ్ ఎవరిలో కలవడం లేదని తెలిసి చాలా బాధగా ఉందని కన్నీళ్ళు పెట్టుకుంటుంది. వాళ్ళని అటుగా వెళ్తున్న ప్రభాకర్ చూస్తాడు


మురారీ: ఆదర్శ్ రాడనే విషయం ఇంట్లో చెప్పొద్దు పండుగ సమయంలో ఈ విషయం తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు అందరూ బాధగా ఉంటారు


Also Read: ఎంక్వరీ మొదలెట్టిన రిషి - శైలేంద్ర క్రూరత్వం, దేవయానిలో మొదలైన భయం!


ముకుంద: సరే, కానీ పండగ అయిన తర్వాత ఈ విషయం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది


శకుంతల ప్రసాద్ దంపతుల దగ్గరకి వచ్చి ముకుంద గురించి మాట్లాడుతుంది. మొగుడి గురించి అడిగితే అంత కోపంగా సమాధానం చెప్పింది ఏంటి? అందరితో ఆ పిల్ల అలాగే ఉంటుందా అని ఆరా తీస్తుంది. అదేం లేదు ఆ పిల్ల తరహా అంతేలే పట్టించుకోవద్దని ప్రసాద్ సర్ది చెప్తాడు. వీళ్లందరితో బాగానే ఉంటుంది కదా మరి నా బిడ్డతో మాత్రం ఎందుకు గరంగా ఉంటుందని ఇది ఏదో తేల్చాలని శకుంతల డిసైడ్ అవుతుంది. కృష్ణ ముకుంద ఎక్కడ ఉందని అలేఖ్యని అడుగుతుంది. తనకి తెలియదని అంటుంది.