Brahmamudi October 5th: వినాయక పూజ ఎవరు చేయాలనే దాని మీద సీతారామయ్య పోటీ పెడతాడు. కొత్త జంటలు గురి చేసి బాణం వేయాలని ఎవరైతే టార్గెట్ మధ్యలో వేస్తారో ఆ జంట పూజ చేయవచ్చని చెప్తాడు. కళ్యాణ్ తన వంతు వచ్చినప్పుడు అప్పుని కలసి ఆడదాం రమ్మని పిలుస్తాడు. సరే అని వెళ్తుంది కానీ అనామిక వచ్చి రోజు మీరే కదా కలిసి కబడ్డీ ఆడేది ఇక నేను ఆడతానని అంటుంది. కళ్యాణ్, అనామిక జంట కూడా ఫెయిల్ అవుతుంది. ఇక రాజ్, కావ్య వంతు వస్తుంది. ఈ పోటీలో ఎలాగైనా గెలవాలని కావ్య అంటుంది. రాజ్ అంత దగ్గరగా ఉండేసరికి కావ్య మైమరిచిపోయి చూస్తుంది. ఇద్దరూ కలిసి గురి చూసి బాణం విసురుతారు. రాజ్ వాళ్ళు గెలిచారని అందరూ సంతోషపడతారు. కావ్య రాజ్ ని పట్టుకుని చిన్నపిల్లలా గెంతులేసి హగ్ చేసుకుంటుంది. వాళ్ళ గెలుపు చూసి అనామిక కుళ్ళుకుంటుంది. మనం గెలవాల్సింది వాళ్ళు గెలిచారని మొహం మాడ్చుకుంటుంది. అన్నయ్యే కదా గెలిచిందని కళ్యాణ్ అంటాడు.
Also Read: ఎంక్వరీ మొదలెట్టిన రిషి - శైలేంద్ర క్రూరత్వం, దేవయానిలో మొదలైన భయం!
ఇదే కరెక్ట్ టైమ్ అనుకుని కావ్య మళ్ళీ రాజ్ రాసిన చీటీ చూసేందుకు వెళ్తుంది. సరిగా దాన్ని తీసి ఓపెన్ చేసే టైమ్ కి ఇంద్రాదేవి పిలుస్తుంది. దీంతో దాన్ని చేతిలో పెట్టుకుని అలాగే వెళ్ళిపోతుంది. అప్పు డల్ గా ఉండటం చూసి ఏమైంది అలా ఉన్నావని అడుగుతుంది. అదేం లేదని చెప్తుంది. పూలు గుమ్మానికి కట్టమని ధాన్యలక్ష్మి ఇస్తుంది. అవి కట్టేందుకు వెళ్తుంటే కళ్యాణ్ వచ్చి పిలుస్తాడు. తన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదని అడుగుతాడు. అప్పు కోపంగా నాతో పని ఏముందని వెళ్ళి అనామికతో ముచ్చట్లు పెట్టుకోమని అరుస్తుంది.
కళ్యాణ్: ఏమైంది నీకు నేను అనామికని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా?
అప్పు: నాకెందుకు నువ్వు ఎవరిని చేసుకుంటే నాకేంటి? అప్పుడే అనామిక కళ్యాణ్ ని పిలుస్తుంది
కళ్యాణ్: నేనేమైనా తప్పు చేశానా? తప్పు చేస్తే సరి చేసుకుంటాను చెప్పు
అప్పు: వెళ్ళు ముందు నీ అనామిక పిలుస్తుంది. ఈసారి వెళ్లకపోతే వచ్చి లాక్కుని వెళ్తుంది
రాజ్ రాసిన చీటీ కావ్య చీర కొంగులో కట్టుకుని ముడి వేసుకుంటుంది. పూజ అయిన తర్వాత అందులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటుంది. ఇక రాజ్ దంపతులు కలిసి వినాయక పూజ చేస్తారు. రాజ్ చేతుల మీదుగా ఇంటి పత్రాలు తన తండ్రికి ఇవ్వమని కావ్య కోరుకుంటుంది. ఇంత మందిలో ఎందుకు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇస్తానని రాజ్ మొహమాట పడతాడు. కావ్య మాత్రం డాక్యుమెంట్స్ ఆయన చేత అమ్మానాన్నకి ఇప్పిస్తానని చెప్పాను కదా అదే చేస్తున్నానని అంటుంది. రాజ్ వాటిని కృష్ణమూర్తి వాళ్ళకి అందిస్తాడు.
Also Read: శకుంతలని అవమానించిన ముకుంద- కృష్ణ ఉగ్రరూపం!
రాజ్: మీకు ఇక ఏ సమస్య రాకూడదని కోరుకుంటూ మీ ఇంటి డాక్యుమెంట్స్ మీ చేతిలో పెడుతున్నాను
కృష్ణమూర్తి: మీలాంటి దేవుడు మాకు అండగా ఉన్నంత వరకు మాకు ఏ సమస్యలు రావు అనేసి చేతులెత్తి దణ్ణం పెడతాడు
పెద్దవాళ్ళ చేతులు ఆశీర్వదించాలి మొక్కడానికి కాదని రాజ్ తన మంచితనం నిరూపించుకుంటాడు.
కృష్ణమూర్తి: ఇటువంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. గొప్పగా బతకాలని నా భార్య ఆశపడుతుంటే నేను చాలా సార్లు కొప్పడ్డాను కానీ విధి ఆడిన నాటకంలో నా కూతుర్లు ఇద్దరూ ఈ ఇంటికి వచ్చి చేరారు. మొదట్లో తండ్రిగా వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని భయంగా ఉండేది. కానీ ఇప్పుడు మిమ్మల్ని మా కూతుర్ని చూస్తుంటే ఇంతకుమించి ఆనందం మరొకటి లేదు
కనకం: మీరు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి