Krishna Mukunda Murari October 4th: ప్రభాకర్.. ముకుంద ఏదో తేడా కొడుతుందని అనుకుంటాడు. కృష్ణ తన చిన్నమ్మ శకుంతల కోసం వెతుకుతూ ఉండగా ముకుంద ఎదురుపడుతుంది. ఎవరి కోసం వెతుకుతున్నావ్ మురారీ కోసమా అంటుంది. గుండెని ఎవరైనా వెతుకుతారా? అనేస్తుంది.


ముకుంద: మరి మీ తొట్టి గ్యాంగ్ కోసమా


కృష్ణ: మాటలు తిన్నగా రానివ్వు పెద్ద కోడలు చిన్న కోడలు చేతిలో తిట్లు తిన్నదంటే బాగోదు


ముకుంద: నన్ను పెద్ద కోడలిని అని ఫిక్స్ చేయడానికి ట్రై చేసిన ప్రయోజనం ఉండదు


కృష్ణ: నేను ఏసీపీ సర్ భార్యని అని చెప్పాను. అది భార్యాభర్తల బంధం


ముకుంద: సంప్రదాయ కబుర్లు చెప్పకు నేను వాటిని పట్టించుకోను


Also Read: అనామిక, కళ్యాణ్ పెళ్లి ఫిక్స్- రాజ్ రహస్యం తెలుసుకున్న కావ్య మనసు ముక్కలు


కృష్ణ: అప్పుడు నిన్ను మనిషిగా ఎవరు చూడరు


ముకుంద: నన్ను ప్రేమించిన వాడు చూస్తే చాలు. నా దారికి, ప్రేమకి అడ్డురాకు. వెళ్ళి తొట్టి గ్యాంగ్ తో ముచ్చట్లు పెట్టుకో కానీ నాతో పెట్టుకోకు


కృష్ణ: నీ మాటలకి బెదిరిపోవడానికి నేనేం అలేఖ్యని కాదు. ఏసీపీ సర్ జోలికి వచ్చినా, మా ఇద్దరి మధ్యలోకి వచ్చినా ఏం చేస్తానో కూడా నాకు తెలియదు. నేను మీ నాన్నని గౌరవించి మాట్లాడుతున్నా నువ్వు మా చిన్నాన్న గురించి పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది


ముకుంద: మాట్లాడతాను చేపలు, చెట్లు అమ్మాడు అని అవమానించేలా మాట్లాడేసరికి కృష్ణ కంట్రోల్ తప్పి అరుస్తుంది.


ఆవేశంగా గదిలోకి వచ్చి బాధపడుతుంది. మురారీ ఏమైందని అడుగుతాడు. తన చిన్నాన్న గురించి చాలా తక్కువ చేసి మాట్లాడుతుందని ఫీల్ అవుతుంది. కృష్ణ నేల మీద పడుకుంటుంటే బెడ్ మీద పడుకోవచ్చు కదా అంటాడు. కానీ కృష్ణ మాత్రం వినదు. కృష్ణని బయటకి తీసుకెళ్తానని మురారీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. వాళ్ళు ఇద్దరూ బయటకి వెళ్ళకుండా క్యాన్సిల్ చేయాలి, దాంతో పాటు ఆదర్శ్ అనే మాట ఈ ఇంట్లో ఎవరి నోట రాకుండ చేస్తేనే మనశ్శాంతి ఉంటుందని ముకుంద అనుకుంటూ ఉండగా శకుంతల వచ్చి పలకరిస్తుంది.


శకుంతల: నీ మొగుడు మిలటరీ ఆఫీసర్ అంట కదా. ఏడాదికి ఎన్ని సార్లు ఉంటాడు అల్లుడు. భవానీ బిడ్డ అంటే అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడానికి పెట్టి పుట్టాలి


ముకుంద: ఇక ఆపుతారా? ప్రశాంతంగా ఉండనివ్వరా వెళ్ళండి అవతలకి


తన అరుపులకి కృష్ణ, మురారీ గదిలో నుంచి కిందకి వస్తారు


Also Read: అమ్మా లే అమ్మా లే అంటూ కదిలించేసిన రిషి, జగతిది హత్యే అని బయటపడుతుందా!


కృష్ణ: నీకేమైన పిచ్చా ఇంటికి వచ్చిన బంధువులతో ఇలాగేనా మాట్లాడేది


ముకుంద: వాళ్ళు నీకు బంధువులు నాకు కాదు


మురారీ: ఇట్స్ టూ మచ్


ముకుంద: సిచ్యువేషన్ చేయి దాటితే ఇలాగే ఉంటుంది


కృష్ణ: ఇప్పటికే చాలా మాట్లాడావ్ చిన్నమ్మకి సోరి చెప్పు


ముకుంద: అడ్డమైన వాళ్ళకి సోరి చెప్పే టైప్ కాదు


కృష్ణ: నీ టైప్ గురించి మాట్లాడుకోవాలి. ఇంకోసారి ఇలా మావాళ్ళని అంటే


మురారీ: అత్తయ్య ఆవిడ తరఫున నేను సోరి చెప్తున్నా


Also Read: ముకుందని పుట్టింటికి పంపించేయమన్న ప్రభాకర్- క్షమాపణ చెప్పమన్న కృష్ణ


కృష్ణ, మురారీ బయటకి వెళ్లబోతుంటే భవానీ పిలుస్తుంది. కల్నల్ ఆదర్శ్ డీటైల్స్ చెప్తానని అన్నారు వెళ్ళి డీటైల్స్ తీసుకుని రమ్మని చెప్తుంది. పూజ సామాన్లు తీసుకురావడానికి వెళ్తున్నాం వస్తూ తీసుకొస్తామని కృష్ణ అంటుంది. ఇంట్లో మీ చిన్నాన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని వదిలిపెట్టి వెళ్తే బాగోదని కృష్ణని ఆపేస్తుంది. ఆదర్శ్ ఆచూకీ తెలిసి ముకుంద జీవితం బాగుపడేలా చేయమని భవానీ దేవుడిని కోరుకుంటుంది.