తెలుగులో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటస్టెంట్ లకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో పెద్దగా చెప్పక్కర్లేదు. అందులోనూ ప్రేక్షకాదరణ పొందిన వారైతే వారికి బయట ఇంకా క్రేజ్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ శ్రీహాన్ కు పబ్లిక్ లోనే కాదు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కెరీర్ ప్రారంభంలో షార్ట్ ఫిల్మ్ లలో నటించిన శ్రీహాన్.. ఇప్పుడు బుల్లితెరపై కూడా కనిపిస్తున్నాడు. ‘బిగ్ బాస్’తో అతనికి మరింత పాపులారిటీ వచ్చింది. అంతేకాకుండా కో యాక్టర్ సిరి హనుమంతుతో కలసి చాలా షార్ట్ ఫిల్మ్ లలో నటించాడు. అవన్నీ మంచి వ్యూస్ సంపాదించుకున్నాయి. వీరి జంటకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఇటీవల శ్రీహాన్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ వార్నింగ్ ఇచ్చింది. అదేంటీ, అనుపమ శ్రీహాన్ కు వార్నింగ్ ఇవ్వడం ఏంటీ అనుకుంటున్నారా? కంగార పడొద్దు.. అనుపమా ఇచ్చింది స్వీట్ వార్నింగే. 


శ్రీముఖి యాంకర్ గా ఓ ప్రముఖ చానెల్ లో ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ అనే ప్రోగ్రామ్‌ను టెలికాస్ట్ అవుతోంది. ఈ షోలో ప్రతీ వారం బుల్లి తెర నుంచి నటీనటులు వచ్చి సందడి చేస్తూ ఉంటారు. తాజా ఎపిసోడ్‌లో నటి అనుపమ పరమేశ్వరన్ ముఖ్య అతిథిగా పాల్గొంది. దీంతో ఆ షో లో సందడి వాతావరణం నెలకొంది. బ్లాక్ కలర్ డ్రెస్ లో వచ్చిన అనుపమా మొత్తం షోలో మెరిసిపోయింది. ఈ క్రమంలో బిగ్ బాస్ స్టార్ శ్రీహాన్ అనుపమ పరమేశ్వరన్ కలసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, భూమిక కలసి నటించిన ‘ఖుషి’ సినిమాలో నడుము సీన్ ను స్కిట్ లాగా చేశారు. 


ఇందులో భూమిక పాత్రలో అనుపమ కనిపించగా.. పవన్ పాత్రలో శ్రీహాన్ చేశాడు. ‘సిద్దు నువ్ నా నడుము చూశావ్’ అని అనుపమా డైలాగ్ చెప్పగానే.. శ్రీహాన్ ‘‘లేదు నేను చూడలేదు. అయినా బెత్తుడంత నడుము లేదు, అది నేను చూశానంటా’’ అని పవన్ కళ్యాణ్ స్టైల్‌లో డైలాగ్ చెప్తుండగానే అనుపమ.. ‘‘ఇది నేను సిరికు చెప్తా’’ అని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో శ్రీహాన్ స్టన్ అయిపోయి డైలాగ్ చెప్పడం ఆపేశాడు. ఇక ఈ సీన్ తో సెట్ లో నవ్వులు విరిశాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




శ్రీ హాన్ ‘బిగ్ బాస్’తో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హౌస్ లో తనదైన స్టైల్ లో మొదటి నుంచీ చివరి వరకూ బాగా ఆడి ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. అంతే కాదు ఈ సారి బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ నే అయినా అతనికంటే ఎక్కువ మొత్తంలో క్యాష్ ను గెలుచుకున్నాడు శ్రీహాన్. ‘బిగ్ బాస్’ క్రేజ్ తో ఇప్పుడు అతనికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. 



Read Also:  ‘పఠాన్’కు పాట్లు - బాయ్‌కాట్‌పై బాలీవుడ్ కలవరం, కేంద్రాన్ని ఆశ్రయించిన సినీ పెద్దలు