Prema Entha Madhuram August 24th: అను తన గదిలో ఒంటరిగా కూర్చొని జరిగిన గతాన్ని తలుచుకుంటుంది. ఛాయాదేవి మాట్లాడిన మాటలు కూడా తలుచుకొని రౌడీలు ఆర్యను చంపడానికి ప్రయత్నించిన ఘటనను తలుచుకుని కంగారుపడుతూ.. తను ఎవరు అనేది సర్ శత్రువులకు తెలిసిపోయింది అని.. తనను, పిల్లలను అడ్డుపెట్టుకొని సర్ ని మరింత బాధ పెడుతున్నారు అని అనుకుంటుంది.


అంతేకాకుండా తను.. వారికి ఇంత దగ్గర అవడం వల్లనే ఇటువంటి సమస్యలు ఎదురవుతున్నాయని.. ఇక ఎక్కువ కాలం ఆర్య దగ్గర నిజం దాచడం కష్టమని.. పరిస్థితులు ఎలా మారుతాయో భయంగా ఉందని ఇక వెంటనే పిల్లల దగ్గరికి వెళ్ళగా అక్కడ ప్రీతి, రేష్మలను చూసి వారి మంచితనాన్ని తలుచుకొని వారిని మిస్ అవుతున్నందుకు బాధపడుతూ పిల్లల్ని అక్కడి నుంచి తీసుకెళ్తుంది.


ఇక 4 సంవత్సరాలు తర్వాత అను మరో ఇంట్లో  కనిపిస్తుంది. అంతేకాకుండా పిల్లలకు అక్షర, అభయ్ అని పేర్లు కూడా మారుస్తుంది. ఇద్దరు పిల్లలు చాలా తెలివిగా కనిపిస్తారు. ముఖ్యంగా అభయ్ మాటలు అచ్చం ఆర్య మాటలు లాగానే ఉండటంతో సంతోషపడుతుంది. ఇక పిల్లలకు టిఫిన్ చేస్తూ ఉండగా.. పిల్లలిద్దరూ ఒకరిపై ఒకరు కంప్లైంట్ ఇచ్చుకుంటూ ఉంటారు.


ఆ తర్వాత స్పోర్ట్స్ కాంపిటీషన్ ఉందని మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అందరు వస్తున్నారని.. నువ్వు కూడా వచ్చి ఎంకరేజ్ చేయాలి కదా అని అనటంతో అప్పుడే అభయ్ తినేటప్పుడు మాట్లాడకూడదని చెప్పి టాపిక్ ఆపేస్తాడు. ఇక అను తన మనసులో కొడుకు చాలా అర్థం చేసుకుంటాడని.. నాన్నను మాత్రం దగ్గర చేయలేనని బాధపడుతుంది.


ఆ తర్వాత ఆర్య బెస్ట్ బిజినెస్ మాన్ ఆఫ్ ది టికెట్ గెలిచినందుకు మీడియా సమక్షంలో ఇంటర్వ్యూ జరుగుతుంది. ఇక మీడియా వాళ్ళంత ఆర్య సక్సెస్ కి కారణాలు అడుగుతూ ఉంటారు. ఇక ఈ ఇయర్ సోషల్ సర్వీస్ లో ఏం చేస్తున్నారని అడగటంతో.. తమ టాయ్స్ కంపెనీ గురించి చెబుతాడు. ఇక అందులో 20% చైల్డ్ ఎడ్యుకేషన్ కు ఉపయోగిస్తానని అంటాడు.


దాంతో అక్కడున్న వాళ్లంతా ఫిదా అయ్యి చప్పట్లు కొడతారు. ఇక ఇంటర్వ్యూ మొత్తం అయిపోయాక ఒక మీడియా ప్రతినిధి ఆర్య దగ్గరకు వచ్చి మీరు చేస్తున్న మంచి పని పబ్లిసిటీ చేస్తామని అడగటంతో ఆర్య తనకు అలా నచ్చదని అనటంతో జిండే ప్రతి ఒక్కరికి తెలియాలి కదా అని ఒప్పిస్తాడు. ఇక ఆ తర్వాత ఆర్య మన నెక్స్ట్ ప్రోగ్రాం ఏంటి అనటంతో.. నేచర్ స్కూల్ లో స్పోర్ట్స్ కాంపిటీషన్లో చీఫ్ గెస్ట్ గా వెళ్లాలని చెబుతాడు.


ఆ రిపోర్టర్ అక్కడికి కూడా వస్తామని అంటాడు. దానికి ఆర్య సరే అంటాడు. తర్వాత మాన్సీ చేతిలో పేపర్ తీసుకొని ఆర్య ఇంటికి వచ్చి నీరజ్ అని కోపంగా అరుస్తూ కనిపిస్తుంది. ఇక శారదమ్మ అడ్డుపడ్డ కూడా అలాగే అరుస్తుంది. అప్పుడే అక్కడికి నీరజ్ దంపతులు వస్తారు. ఇంత కేకలు వేసిన రావటానికి ఇంత ఆలస్యం ఏంటి.. పైన గదిలో కబుర్లు చెప్పుకుంటున్నారా అని కోపంగా అంటుంది.


వెంటనే అంజలి.. ఎక్కువగా మాట్లాడుతున్నావు అని అనటంతో మీరు ఎక్కువ చేస్తున్నారు అని మాన్సీ అంటుంది. విడాకులు రాకముందే పరాయి ఆడదానితో గడుపుతున్నావు నీకు సిగ్గు అనిపించడం లేదా అని నీరజ్ ను అడగటంతో వెంటనే నీరజ్.. నీలాంటి క్రిమినల్ భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి కానీ.. అంజలి లాంటి మంచి అమ్మాయిని భార్యని చెప్పుకోవడానికి సిగ్గు ఏంటని తిరిగి సమాధానం ఇస్తాడు.


అంజలి తన భార్య అంటూ గట్టిగా చెబుతాడు. ఇక అంజలి కొత్తగా ఏం గొడవ తీసుకొచ్చావు అని అనటంతో గొడవ వచ్చేలాగా చేసింది మీరు అని పొగరుగా అంటుంది. పేపర్స్ చూపిస్తూ ఏంటి ఇది అని నీరజ్ ను అడుగుతుంది. మ్యాటర్ అందులో ఉంది కదా చదువుకో అని నీరజ్ కూడా పొగరుగా సమాధానం ఇస్తాడు. చదివాను కాబట్టే ఇక్కడికి వచ్చాను అంటూ.. ఏంటి నేను నిన్ను, నీ ఫ్యామిలీని మానసికంగా హింసిస్తున్నానా.. అందుకని వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించమని పిటిషన్ పెట్టుకున్నావా అని అడుగుతుంది. అంటే మిమ్మల్ని నేను అంత హింసిస్తున్నానా అని అనడంతో.. వెంటనే నీరజ్ అవును అని నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నో సాకులు చెప్పి విడాకులు రాకుండా చేస్తున్నావు అంటూ కోపంగా అరుస్తాడు.


also read it : Trinayani August 23rd: పాముని బంధించిన కుండలోనే పాలు కావాలంటూ సుమన అంతరాత్మ రచ్చ - నయని మాంగల్యానికి ముప్పు?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial