Trinayani August 23rd: పాముని బంధించిన కుండలోనే పాలు కావాలంటూ సుమన అంతరాత్మ రచ్చ - నయని మాంగల్యానికి ముప్పు?

కుండలో ఉన్న పాలు తనకి కావాలంటూ నయని మగ గొంతుతో అరవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందాం.

Continues below advertisement

Trinayani August 23rd: తిలోత్తమా కుండకు గరుడ వస్త్రాన్ని కడుతూ ఉండగా నయనికి అనుమానం వచ్చి లోపలికి వెళ్తుంది. ఇక గరుడ వస్త్రాన్ని కట్టేసి కట్టేసానురా అని ఊపిరి పీల్చుకుంటుంది తిలోత్తమా. అప్పుడే నయని వచ్చి ఏం చేస్తున్నారు.. కిచెన్ లోకి కుండా ఎందుకు తీసుకొచ్చారు అని అనటంతో ఇద్దరు షాక్ అవుతారు. ఇక తిలోత్తమా నువ్వు తెచ్చిన పాలు కుండలో పోసాము.. పుట్టలో పోయడానికి వెళ్తున్నాము అని అంటుంది.

Continues below advertisement

ఇక వల్లభ తిలోత్తమా నెత్తిలో ఆ కుండను పెట్టగా ఇద్దరు అక్కడ్నుంచి బయలుదేరుతుండగా.. నయనికి అనుమానం వస్తుంది. ఇక హాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా చర్చలు చేసుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్తున్నారు అంటూ తిలోత్తమా పై ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇక పాలల్లో కలిపిన పౌడర్ వాసనకు సుమన ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ ఉంటుంది. తిలోత్తమా వాళ్ళు బయలుదేరుతుండగా వెంటనే నయని మగ గొంతుతో ఆపండి అని అరవటంతో ఇంట్లో వాళ్లంతా భయపడతారు.

తనకు ఆ పాలు కావాలి అని అంటుంది. ఇక కుండ దగ్గరికి వచ్చి వాసన పీల్చుకుంటూ ఉంటుంది. తిలోత్తమా మాత్రం భయపడుతూ ఉంటుంది. ఇక అందరూ సుమన ప్రవర్తనను చూసి భయపడి కుండను దింపమని తిలోత్తమాతో అంటారు. దాంతో తిలోత్తమా కుండను చేతిలో పట్టుకొని సుమన వైపు చూపించగా పైన కప్పి ఉన్న గరుడ వస్త్రాన్ని చూసి నాకు వద్దు అంటూ భయపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

వెంటనే విశాల్ తన తల్లితో ఎందుకు గరుడ వస్త్రాన్ని కట్టావు అని అడుగుతాడు. దాంతో తిలోత్తమా కవర్ చేసి మాట్లాడటంతో నయని అనుమానం పడుతుంది.  నిజంగా అందులో పాలు ఉన్నాయా అని అడుగుతుంది. ఇంట్లో వాళ్ళు కూడా అనుమానం పడటంతో తిలోత్తమా గరుడ వస్త్రాన్ని తీయకుండా పాలు కిందికి పోస్తుంది. ఇక అవి పాలే అని ఇంట్లో వాళ్ళు అంటారు. ఇక తల్లి కొడుకులిద్దరు మెల్లిగా జారుకుంటారు.

ఆ తరువాత నయని ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ ఉండగా.. అక్కడికి విశాల్ వస్తాడు. ఇక తిలోత్తమా తీసుకెళ్లిన కుండలో పాలు ఉన్నాయా లేవా అని.. గరుడ వస్త్రాన్ని ఎందుకు కప్పిందని.. ఎవరిని కూడా తోడు తీసుకోలేదు అని తనలో ఉన్న అనుమానాలన్నీ బయటకు పెడుతుంది. ఆ కుండలో పాలే కాదు ఇంకా ఏదో ఉంది అని అంటుంది.

అంతేకాకుండా అత్తయ్య కంగారు పడినట్లు కనిపించింది అని అందులో ఏదో ఉంది అని అంటుంది. దాంతో ఏముందో చెప్పు అని విశాల్ అనడంతో.. కుండ అటు ఇటు కదులుతుంది అంటే అందులో ప్రాణం గల ప్రాణం ఉందని అనుమానం అంటుంది. ఆ తర్వాత తిలోత్తమా, వల్లభ అఖండ స్వామి దగ్గరికి చేరుకుంటారు. ఇక ఆఖండ స్వామి కుండని కిందికి దింపుతాడు. మధ్యలో వల్లభ భయపడుతూ మాట్లాడుతూ ఉంటాడు.

ఇక తిలోత్తమా ఇప్పుడు పాముని విడిచి పెడతారా అనటంతో.. అయితే మీరు ప్రాణాలు విడిచి పెడతారా అని అఖండ స్వామి అనటంతో వారిద్దరు కంగారు పడతారు. అలా ఎందుకు అంటున్నారు అని ప్రశ్నించడంతో.. ఇప్పుడు గరుడ వస్త్రాన్ని విప్పితే ఆ తర్వాత నాగయ్య మిమ్మల్ని కాటు వేస్తాడు అని అంటాడు.

దాంతో అందులోనే బంధించమని అంటుంది తిలోత్తమా. ఇక పామును బంధించాము కాబట్టి.. అనుకున్నది చేయవచ్చా అని అడుగుతుంది. దాంతో స్వామి కొన్ని జాగ్రత్తలు చెప్పటంతో ఆ తల్లి కొడుకులు అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక ఇంట్లో ఉన్న హాసిని తిలోత్తమా గురించి వెటకారం చేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే నయనికి మూడో కంటి ద్వారా మంగళసూత్రం రాయికి కట్టి ఆ రాయి నీళ్లలో మునిగినట్లు కనిపిస్తుంది. వెంటనే కంగారు పడటంతో విశాల్ అక్కడికి వస్తాడు. వాళ్లకు అలా కనిపించిందని భయపడుతూ చెబుతుంది.

 

also read it : Prema Entha Madhuram August 22th: టెండర్ వదులుకుంటానంటూ షాకిచ్చిన ఆర్య.. తన లెటర్ తో భర్తను సంతోషపెట్టిన అను?

 

 Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Continues below advertisement