Ammayigaru Serial Today Episode రూప రాజు భార్యగా ఇంటి కోడలిగా అంగీకరించమని ప్రతాప్ ముత్యాలుని వేడుకుంటాడు. మోకాలు వంచి ముత్యాలు ముందు కూర్చొంటాడు. పెద్దయ్య అలా మోకాలు మీద కూర్చొవడంతో రూపతో పాటు అందరూ బాధ పడతారు. ముత్యాలు మాత్రం కనికరించదు. అందరూ ఏడుస్తారు. దాంతో రాజు తన తల్లి ముత్యాలు రెండు కిడ్నీలు చెడిపోవడంతో రూప అలియాస్ అమ్మాయి గారే కిడ్ని ఇచ్చి నిన్ను బతికించారని రాజు తన తల్లితో చెప్తాడు. ముత్యాలు షాక్ అయిపోతుంది. ఏడుస్తుంది. ముత్యాలుతో పాటు రూప తల్లిదండ్రులు కూడా షాక్ అయిపోతారు. ప్రతాప్ కూతుర్ని హగ్ చేసుకుంటాడు. 


ముత్యాలు: అంటే నన్ను కాపాడింది అమ్మాయిగారా.
రాజు: అమ్మ పది రూపాయలు సాయం చేస్తేనే డప్పుకొట్టుకునే ఈ రోజుల్లో ఇంత పెద్ద విషయం ఇంట్లో తెలీకుండా నాకు చెప్పకుండా అమ్మాయి గారు నీకు కిడ్నీ ఇచ్చారమ్మా. ఇప్పుడు కూడా ఈ విషయం చెప్పకపోతే నేను బతికి వేస్ట్ అమ్మా. అందుకే చెప్పా. ఇలాంటి అమ్మాయిగారినా నువ్వు ఇంట్లోకి రానివ్వను అని చెప్పింది. 
రాజుతండ్రి: ముత్యాలు ఇంకా చెప్పాలి అంటే నువ్వు ఈరోజు మా ముందు ఉండటానికి అమ్మాయి గారే కారణం. అది గుర్తు పెట్టుకో.
ముత్యాలు: రెండు చేతులు జోడించి రూప దగ్గరకు వెళ్లి ఇంత ఎందుకు చేశారమ్మాయి గారు.
రూప: నాకోసం రాజుని కన్నారు. అలాంటి మీ కోసం ఏదైనా చేయాలి అనిపించింది. అందుకే మీకు ప్రాణం పోసే అవకాశం ఉంది అంటే అది నేను వదులుకోలేకపోయాను అత్తయ్య. 
ముత్యాలు: మరి నీ ప్రాణం పోతే మీ నాన్నని ఎవరు చూసుకొనే వారు అమ్మాయిగారు.
రూప: మా నాన్నని చూసుకోవడానికి రాజు ఉంటాడు. రాజుని చూసుకోవడానికి మీరు ఉంటారు. రాజు నాన్న తప్ప నాకు వేరు ప్రపంచం లేదు కదా అత్తయ్య. 


ముత్యాలు అమ్మాయిగారిని హగ్ చేసుకొని ఏడుస్తుంది. అత్తాకోడళ్లు ఒకటైనందుకు అందరూ సంతోషిస్తారు. ముత్యాలు పెద్దయ్యగారికి కూడా రెండు చేతులు జోడించి క్షమాపణ అడిగి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఇంతలో లాయర్‌ మురగన్‌ని కొట్టి కొట్టి లాక్కొని ప్రతాప్ చెల్లి విజయాంబిక వస్తుంది. 


ప్రతాప్: చంద్ర మనం బాగుండటం వీళ్లకి ఇష్టం లేనట్లుంది. అడుగడుగునా మనకి ఎదురు అవుతూనే ఉన్నారు విషయం కనుక్కొని పంపించేసే. దీపక్ నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా ఇలాంటి వాళ్లని కలవొద్దని. 
రూప: రాజు మురగన్ బాబాయ్ పరిస్థితి చూస్తుంటే అత్తయ్యకి మన ప్లాన్ తెలిసిపోయింది అనుకుంటా. ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే ఏమవుతుందో అని భయంగా ఉంది రాజు. ఇప్పుడు ఏం చేయాలి.
దీపక్: మామయ్య మమ్మీ మీతో ఏదో మాట్లాడాలి అని చెప్పింది.
ప్రతాప్: ఇలాంటి నీచులతో మాట్లాడటం నాకు ఇష్టం లేదు.
విజయాంబిక: నా గురించి వదిలేయ్ తమ్ముడు. ఇప్పుడు నీ ముందు ఉన్న ఈ మనిషి గురించి ఆలోచించు. ఇతను రాజు ఆఫీస్‌లో గుమస్తా.. అంటే ఒకప్పుడు మన ఇంట్లో ఈ రాజులాగే అన్నమాట. తమ్ముడు రాజు, రూపలు వీడితో నాటకం ఆడించి నేను ఉన్న హోటల్ గదిలోకి వీడిని పంపించి నన్ను తప్పుడు మనిషిగా చూపించారు. 
ప్రతాప్: చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ నాటకం ఆడటానికి సిగ్గు లేదా. 


రాజునే అంతా చేశాడని దీపక్ చెప్పి మురగన్‌కి నిజం చెప్పమని అంటాడు. రూప, రాజు టెన్షన్ పడతారు. మురగన్ నోరు విప్పడని సాక్ష్యాలు తీసుకొచ్చానని సీసీ టీవీ ఫుటేజ్ విజయాంబిక చూపిస్తుంది. ప్రతాప్‌తో పాటు అందరూ షాక్ అయిపోతారు. సాటి ఆడది అని కూడా చూడకుండా ఈ రోజు తనకు చేసిన అన్యాయం రేపు తన అమ్మకో అక్కకో చేస్తాడని ఇలాంటి వాడినా మన రూప పెళ్లి చేసుకుందని విజయాంబిక ప్రతాప్‌ని నిలదీస్తుంది. దాంతో ప్రతాప్ అల్లుడు రాజు చెంప మీద కొడతాడు. మొన్న నీ మీద హత్యా ప్రయత్నం చేసింది కూడా వీడే అని విజయాంబిక ప్రతాప్‌కి ఎక్కిస్తుంది. ప్రతాప్ కోపంతో రాజు మీద విరుచుకుపడతాడు. మళ్లీ ప్రతాప్, ముత్యాలులు గొడవ పడతారు. రాజు తండ్రి క్షమాపణ చెప్పి ఇంట్లోకి రమ్మంటే ఇంట్లో అడుగు పెట్టనని ప్రతాప్ అంటాడు. ఇక విజయాంబిక రూప కూడా ప్లాన్‌లో ఉందని అంటుంది. దీపక్ వాళ్లని క్షమించొద్దని అంటాడు. తనని క్షమించమని రాజు అంటే ప్రతాప్ తెగదెంపులు చేసుకుందామని అంటాడు. రాజుని తీసుకొని ముత్యాలు, రూపని తీసుకొని ప్రతాప్ వెళ్లిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: తన నగలు కొట్టేసిన చారుకేశ విహారి ఇంట్లో వాడని తెలుసుకున్న లక్ష్మీ.. విహారికి ఆదికేశవ్ ఫోన్!