Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode విహారికి తన ఫ్రెండ్ కాల్ చేసి కనకం ఇంట్లో లేదు అని నీ దగ్గరే ఉందని అనుకుంటున్నారని అంటాడు. వాళ్లకి నిజం తెలిసేలోపు కనకాన్ని వెతికి వాళ్లకి అప్పగించాలని విహారి అంటాడు. ఇక విహారి డల్‌గా ఉండటం చూసిన తల్లి విహారి దగ్గరకు వస్తుంది. విహారి లక్ష్మీకి జరిగిన అవమానం గురించి ఆలోచిస్తున్నాడని అనుకొని మన ఇంట్లో వాళ్ల సంగతి తెలిసిందే కదా సర్దుకుపోవడం నాకు అలవాటు అయిపోయిందని నువ్వు కూడా అలవాటు చేసుకో అని అంటుంది.
కనకమహాలక్ష్మీ టిఫెన్ తీసుకొని విహారి గదికి వెళ్తుంటే సహస్ర చూసి లక్ష్మీని ఆపి తాను టిఫెన్ తన బావకి ఇస్తాను అని తీసుకెళ్తుంది. ఇక టిఫెన్ తీసుకొచ్చిన సహస్ర తినిపిస్తానని అంటుంది. అది కూడా బావకి కాబోయే భార్యగా తినిపిస్తాను అంటుంది. యమున పర్మిషన్ ఇస్తుంది. సహస్ర బావకి తినిపిస్తుంది. ఇక బయటకు వెళ్దామని సహస్ర అంటే విహారి ఇంట్రెస్ట్ లేదు అంటాడు.
సహస్ర: బావ మన పెళ్లిని నువ్వు మొహమాటానికి ఒప్పుకున్నావా.
విహారి: అలా ఏం లేదే ఎందుకు అలా అడిగావ్.
సహస్ర: ఏం లేదు బావ ఈ మధ్య నువ్వు డల్‌గా కనిపిస్తున్నావ్. ఉట్టి కొట్టిన దగ్గర కూడా యాక్టివ్‌గా కనిపించలేదు అందుకే అడగాలి అని అనిపించి అడిగా. నువ్వు ఏదో విషయం గురించి బాగా ఆలోచిస్తున్నావ్ కానీ బావ నేను అమ్మానాన్న అత్తయ్య అందరం మన నిశ్చితార్థం ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నాం. అది అయితే మన పెళ్లి సగం అయినట్లే. అప్పుడు కూడా నువ్వు ఇలా డల్‌గా ఉంటే మాత్రం నేను తట్టుకోలేను.ప్లీజ్ బావ హ్యాపీగా ఉండు.
విహారి: సరే
లక్ష్మీ: తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఎలా ఉన్నారు అమ్మ రోజంతా మీతో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ నిజం తెలిసిపోతుందని మాట్లాడట్లేదు. మీతో మాట్లాడకుండా ఉండలేక కన్నీటితో కాలం గడుపుతున్నాను. తాళిబొట్టు చూస్తూ.. ఆడపిల్ల జీవితం తాళితోనే మలుపుతుంది. మెడలో తాళి పడితే ఆడపిల్ల కొత్త జీవితం ప్రారంభిస్తుంది. తన భర్తతో అందంగా జీవితం పంచుకుంటుంది. కానీ ఈ తాళి నా జీవితాన్ని చీకటి చేసింది. అమ్మానాన్నల్ని దూరం చేసింది నాకు కన్నీళ్లు మిగిల్చింది.
మరోవైపు వసుధ భర్త స్టోర్ రూంలో ఏదో వెతుకుతుంటాడు. అది విన్న లక్ష్మీ తాళి దాచేస్తుంది. ఎవరా అని చూడటానికి వెళ్తుంది. వసుధ భర్తని చూసి తనని కొట్టి నగలు కాజేసిన వాడని గుర్తిస్తుంది. అతడు కూడా భయపడి ముఖం దాచేస్తాడు. దొంగ అనుకొని కనకం దొంగ దొంగ అని అరిచి తలుపు గడియ పెడుతుంది. అందర్ని పిలుస్తుంది. విహారి ఆ అరుపులు విని వెళ్లబోతే కనకం తండ్రి ఫోన్ చేస్తాడు. విహారి టెన్షన్ పడుతూనే మాట్లాడుతాడు. కనకం మాట్లాడిందని విహారి తెలుసుకుంటాడు. అల్లుడు అల్లుడు అని ఆదికేశవ్ మాట్లాడుతుంటే విహారి ఫీలవుతాడు. ఇక కనకం గురించి అడుగుతాడు ఆదికేశవ్. కనకం వంట చేస్తుందని విహారి కవర్ చేస్తాడు. ఇక వీలు అయితే వీడియో కాల్ చేయమని అంటాడు.
లక్ష్మీ అరుపులకు విహారి తాతయ్య, నానమ్మ, అంబిక, వసుధ, యమున అక్కడికి వస్తారు. వసుధ తలుపు తీసి తన భర్తని చూసి షాక్ అవుతుంది. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అతను వసుధ భర్త అని తెలుసుకున్న లక్ష్మీ షాక్ అయిపోతుంది. తన భర్త నీకు దొంగలా కనిపిస్తున్నాడా అని వసుధ అడుతుంది. ఇక చారుకేశ కూడా నిజం చెప్తే చంపేస్తా అని లక్ష్మీకి సైగ చేస్తాడు. కాదాంబరి కూడా లక్ష్మీని తిడుతుంది.
చారుకేశ: ఏమ్మా నా ముఖం నీకు దొంగలా కనిపిస్తుందా నీకు నాకు ఏమైనా శత్రుత్వం ఉందా లేదు కదా.
వసుధ: ఎందుకు ఉంటుంది మా ఆయన నీ బంగారం దోచుకొచ్చాడా ఈ గాజులు ఏమైనా దోచుకొచ్చాడా.
లక్ష్మీ: మనసులో ఈ గాజులు ఈయనే ఇచ్చి ఉంటాడు.
యమున: తెలీక అన్నాను అంది కదా లక్ష్మీ క్షమించమని అడుగు.
లక్ష్మీ: క్షమించండి.
కాదాంబరి: ఇంకెంత కాలం ఈ దరిద్రం ఇంట్లో ఉంటుందో తొందరగా పంపిచేయ్.
యమున: లక్ష్మీ నువ్వేమీ బాధ పడకు ఆ మాటలు నాకు ఇరవై ఐదేళ్ల నుంచి అలవాటే కానీ ఈ రోజు నువ్వు మాటలు పడకమ్మా.
లక్ష్మీ: పరవాలేదండి వచ్చిన రోజే అర్థమైంది.
విహారి వచ్చి ఏమైందని అడిగితే లక్ష్మీ చారుకేశని దొంగ అంది అని మేం చెప్పి వచ్చామని అంటుంది. ఇక అందరూ విహారితో లక్ష్మీ గురించి చాడీలు చెప్తారు. విహారి లక్ష్మీతో మాట్లాడుతాను అని అంటాడు. విహారి హాల్‌లో కూర్చొంటే పక్కనే సహస్ర వచ్చి కూర్చొంటే జాగ్రత్తగా ఇంటికి వెళ్లు అని చెప్పి విహారి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.