Satyabhama Serial Today Episode క్రిష్‌ సత్యని వెతికి తీసుకురావడానికి బయల్దేరుతాడు. ఇంతలో సత్య గుడికి వచ్చేస్తుంది. అందరూ సత్యని చూసి సంతోషంగా ఫీలైతే భైరవి, రుద్ర మాత్రం సత్య వచ్చేసిందేంటని అనుకుంటారు.


సత్య: వదిలేసి వెళ్లిపోయింది పీడ విరగడైపోయింది అనుకున్నావా క్రిష్. కనపడకుండా పోయింది విడాకులతో పని లేదు అనుకున్నావా. 
భైరవి: వాడి మీద నిందలు వేస్తావేంటి నువ్వు ఎక్కడికి వెళ్లావో ఏమైపోయావో వాడికి ఎలా తెలుస్తుంది. 
విశ్వనాథం: తెలియకుండానే ఇక రాదు పారిపోయింది మోసం చేసింది అని నిందలు వేశారు కదమ్మా. 
హర్ష: అవకాశం దొరికితే చాలు అవమానిస్తున్నారు. ఇంటి నుంచి గెంటేయాలి అని చూస్తున్నారు.
సత్య: అన్నయ్య వాళ్లని మాత్రమే నిందించకు తప్పు నాది కూడా ఉంది. (క్రిష్‌ చేయి పట్టుకొని దేవుడి దగ్గరకు తీసుకెళ్తుంది.) ఆ అమ్మవారి సమక్షంలో అమ్మవారి సాక్షిగా నా మనసులో మాట చెప్తున్నా క్రిష్‌. ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్న మాట నిజమే. కానీ ఇప్పుడు నా గుండెల నిండా నువ్వంటే ఇష్టం ఉంది. కలిసి కాపురం చేయడానికి ఇష్టం లేక నిన్ను దూరం ఉంచిన మాట నిజమే కానీ ఇప్పుడు  నా మనసు నీ తోడు కోరుకుంటుంది. నువ్వు కాదు అంటే బతకను అంటోంది. (అందరూ సంతోషిస్తారు.) నన్ను నమ్ము క్రిష్ నా ప్రేమ నాటకం కాదు ఎవరి కోసమే నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఈ నిర్ణయం నేను తొందర పాటుతో తీసుకోలేదు. నాకు తగిలిన ఎదురు దెబ్బల అనుభవంతో తీసుకుంటున్నాను. నీ కోసం తీసుకుంటున్నాను. నా మనసు నీ మనసుకి బానిస అయింది క్రిష్. ఆవేశంలో పెళ్లి చేసుకొని అందర్ని బాధ పెట్టాను. ఇంకోసారి అలాంటి తప్పు జరగకూడదనే నా నిర్ణయాన్ని నేనే వంద సార్లు పరీక్షించుకున్నాను. ఇంక చాలు ఇంక నన్ను పరీక్షించకు తట్టుకునే ఓపిక అయిపోయింది. నాకు కావాల్సింది దొరికింది దాన్ని చేయి జార్చుకోలేను. నేను నా మనసులో మాటలు చెప్పాను నటించడం నాకు తెలీదు. నువ్వు నన్ను కాదు అంటే నేను ఏమవుతానో నాకే తెలీదు. ఇక ఏమవుతానో నాకే తెలీదు. 

క్రిష్‌:  (ప్రేమగా సత్యని హగ్ చేసుకుంటాడు) ఇలాంటి ఒక రోజు వస్తుందో రాదో అని ఆశ వదులుకున్నా సంపంగి. నా జీవితం ముగిసిపోయినట్లే అనుకున్నా. గుడికి పోయి దేవుడి ముందు చాలా సార్లు బాధ పడ్డా. విడదీయాలి అనుకున్నప్పుడు ఎందుకు మమల్ని ముడిపెట్టావు అని ప్రశ్నించినా. నేను బండోడిని మొండోడిని కానీ నాకు ఓ మనసు ఉంటుందని నిన్ను చూశాక తెలిసింది సంపంగి. అది నిన్ను చూశాక తెలిసింది. నా జీవితంలో నీకు తప్ప వేరే ఎవరికీ జాగా లేదు అని డిసైడ్ అయ్యా. అందుకే నీ వెంట పడ్డా కానీ నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. నువ్వు నన్ను ఇష్టపడ్డావనే అనుకొని నీకు తాళి కట్టా. నీ మనసులో నేను లేను అని తెలిసుంటే అప్పుడే నీకు దూరం అయ్యే వాడిని సంపంగి. 
సత్య: తెలియకపోవడమే మంచిది ఒక ప్రేమించే మనిషికి దూరంగా ఉండేదాన్ని.
క్రిష్: అవునా చివరిగా నీకో పరీక్ష. తప్పదు నేను ప్రశ్నలు అడుగుతా నువ్వు సమాధానం చెప్పాలి. నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా.
సత్య: చచ్చేంత
క్రిష్: నా మీద ఎంత ప్రేమ దాచుకున్నావ్.
సత్య: మోయలేనంత.
క్రిష్: నీ మనసులో నాకు చోటు ఇస్తావా.
సత్య: కావాల్సినంత.
క్రిష్: మరి మనం దగ్గరయినట్లేనా.
సత్య: ఎవరూ విడదీయలేనంత. (సత్య క్రిష్‌లు సంతోషంగా నవ్వుకుంటారు)ఇంకా అడగాల్సినవి ఏమైనా మిగిలున్నాయా.
క్రిష్: ఇవ్వాల్సినవే ఉన్నాయి.
మహదేవయ్య: రేయ్ మీ సెటిల్ మెంట్ ఇంకా పూర్తి కాలేదా.
భైరవి: మరి దీని సంగతి అని విడాకుల పత్రాలు చూపిస్తుంది.


సత్య అత్త దగ్గరకు వెళ్లి విడాకుల పేపర్లు తీసుకొని వాటిని చింపేసి అగ్నిలో పడేస్తుంది. ఇక సత్య, క్రిష్‌తో పాటు మిగతా జంటలు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. నందిని, సత్యలు హర్ష, క్రిష్‌ల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. భైరవి సత్యని చూసి మనసులో నువ్వు నీ భర్తకి భార్యవి అవుతావు కానీ ఎప్పటికీ నాకు కోడలివి కాలేవని అనుకుంటుంది. సత్య అందరికీ వాయినం ఇస్తుంది. 


ఇంటికి వచ్చాక జయమ్మ అందర్ని పిలిచి ఓ విషయం అని చెప్తుంది. మహదేవయ్య నువ్వు ఇలా పిలవడం కాదు అమ్మ ఆర్డర్ వేస్తే చేస్తా అని అంటాడు. సత్య, క్రిష్‌ల తొలిరేయి వారంలో జరిపిద్దామని జయమ్మ అంటుంది. దాంతో క్రిష్ వద్దమ్మా అంటాడు. శోభనం వద్దా అని జయమ్మ అంటే దానికి వారం రోజులు గడువు వద్దని అంటాడు. సత్య సిగ్గు పడుతుంది. ఇవాళో రేపో జరిపించమని అంటాడు. ఇంతలో భైరవి ముహూర్తాలు పెట్టొద్దని వాళ్ల పాటికి వాళ్లని వదిలేద్దామని అంటుంది. జయమ్మ కుదరదు అని అంటుంది. పంతుల్ని పిలిచి ముహూర్తం పెట్టే వరకు సత్యని ముట్టుకోవద్దని అంటుంది. ఇంతలో ఇంటికి పార్టీకి సంబంధించిన రావు అనే వ్యక్తి వస్తారు. పార్టీ యూత్ లీడర్ పదవి మీ ఫ్యామిలీకి ఇవ్వాలని పార్టీ నిర్ణయించుకుందని మీ ఇద్దరు కొడుకుల్లో ఎవరికి ఆ పదవి ఇవ్వాలో చెప్పమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీపని చంపడానికి వచ్చిన నర్శింహ చేతిలో బలైపోయిన కార్తీక్.. కండీషన్ సీరియస్!