Ammayi garu Serial Today Episode పింకీ పెళ్లిని సూర్యప్రతాప్ తన ఇంట్లోనే ఏర్పాటు చేస్తాడు. ఇక రాజు ఫ్యామిలీ కూడా పెళ్లి ఏర్పాట్లు చేస్తుంటారు. బంటి ఆరు బయట ఫోన్‌ చూసుకుంటూ ఉంటాడు. జీవన్ లేడీ గెటప్ వేసుకొని అక్కడికి వస్తాడు. మరోవైపు రాజు కూడా హడావుడిగా రూప ఇంటి దగ్గరకు వస్తాడు. మొత్తం సెక్యూరిటీ ఉండటంతో చూసి అదంతా విజయాంబిక, దీపక్‌ల సెటప్ అనుకొని వాళ్ల పని చెప్తా అనుకొని మీ ప్లాన్స్ మీకు ఉంటే నా ప్లాన్ నాకు ఉంటుందని అనుకొని వెళ్తాడు.


ఇక లేడీ గెటప్‌లో రాజు ఇంటి దగ్గరకు వచ్చిన జీవన్ కొంగు కప్పుకొని చేతిలో పూల పళ్లెం పట్టుకొని బంటీ వైపు వెళ్తుంటాడు. రాజు సెక్యూరిటీ చూడకుండా వెనక వైపు నుంచి గోడ ఎక్కుతుంటాడు. పింకీ అక్కతో ఏంటి అక్కా ఇంకా రాజు రాలేదు అని బాధ పడుతుంటుంది ఇంతలో రాజు వచ్చేస్తాడు. పింకీ రూపలు చాలా సంతోషిస్తారు. రాజుతో రూప నేను వస్తానని చెప్తే రాజు వద్దని అనేస్తాడు. ఇంత వరకు సాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి రాజు పింకీని తీసుకొని వెళ్లిపోతాడు. ఇక జీవన్ బంటీ ముఖం రుమాలుతో మూసేసి బంటీని తీసుకెళ్లిపోతాడు. రాజు కూడా పింకీనీ తీసుకెళ్లిపోతాడు. మరోవైపు హారతికి మత్తు వదులుతుంది. జీవన్ బంటినీ కిడ్నాప్ చేస్తానని చెప్పిన మాటలు గుర్తు చేసుకొని లేస్తుంది. వెంటనే రూపకి కాల్ చేస్తుంది. 


హారతి: అమ్మాయి గారు ఇందాక జీవన్ దీపక్‌తో మాట్లాడుతుంటే విన్నాను ఆ మాటల్లో జీనవ్ ఎవరో బంటీ అనే బాబుని కిడ్నాప్ చేయాలని అనుకుంటున్నాడు. 
రూప: ఏమంటున్నావ్ హారతి ఇప్పుడు జీవన్ ఎక్కడున్నాడు
హారతి: బాబుని కిడ్నాప్ చేయడానికి వెళ్లాడు.
రూప: సరే హారతి నేను చూసుకుంటా ఈ లోపు నీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పు. ఫోన్ కట్ చేసిన తర్వాత. పింకీ ఇంట్లో లేదు ఈ విషయం బయటకు తెలిసింది అంటే నన్ను బయటకు వెళ్లనివ్వరు. నేను వెళ్లకపోతే బంటీ ప్రాణాలకే ప్రమాదం. పోనీ రాజుకి విషయం చెప్దామంటే పింకీ గోపీల పెళ్లి పనుల్లో ఉంటాడు. బంటినీ ఎలా అయినా కాపాడుకోవాలి ఇటు నుంచి వెళ్లిపోవడమే బెటర్. 


రూప పోలీస్‌కి కాల్ చేసి జీవన్ నెంబరు పంపించి దాన్ని ట్రేస్ చేయమని చెప్తుంది. జీవన్ బాబుని తీసుకొని రౌడీలకు అప్పగిస్తాడు. తర్వాత జీవన్ దీపక్‌కి కాల్ చేసి బంటీని కిడ్నాప్ చేసిన విషయం చెప్తాడు. దానికి దీపక్ ఇంట్లో పెళ్లి అవ్వగానే బంటీని చంపేద్దాం అప్పటి వరకు వాడిని జాగ్రత్తగా ఉంచమని చెప్తాడు. తర్వాత జీవన్ వెళ్లిపోతాడు. పోలీసులు జీవన్ నెంబరుని ట్రేస్ చేస్తుంటాడు. ఇక రాజు పింకీని ముత్యాలు వాళ్ల దగ్గరకు తీసుకొస్తాడు. పింకీని ముత్యాలు, విరూపాక్షి ముహూర్తం చీర ఇస్తారు. వరాలు పింకీని రెడీ చేయడానికి తీసుకెళ్తుంది. ఇక రూప, పోలీసులు బంటీని కిడ్నాపర్లు దాచిపెట్టిన ప్లేస్‌కి వస్తారు. రౌడీలు పారిపోతారు. రూప బంటీ ముఖం మీద నీళ్లు చల్లి బంటిని లేపుతుంది. నేను ఇక్కడున్నానేంటి అని బంటీ అడుగుతాడు. దాంతో రూప బంటీకి కిడ్నాప్ విషయం చెప్పకూడదని అనుకుంటుంది. ఇక మరోవైపు పెళ్లి కొడుకుని దీపక్ తీసుకొస్తాడు.


విజయాంబికి పింకీని తీసుకురావడానికి వెళ్తుంది. రాజు ఇంటి దగ్గర గోపీ పీటల మీద కూర్చొంటాడు. పింకీ వచ్చి గోపీ పక్కన కూర్చొంటుంది. విజయాంబిక గదిలో పింకీ, రూపలు లేకపోవడం గుర్తించి కేకలు వేసుకుంటూ వచ్చి విషయం సూర్య ప్రతాప్‌కి చెప్తుంది. పింకీ కనిపించడం లేదని తెలియగానే అందరూ షాక్ అయిపోతారు. గోపీ, పింకీల పెళ్లి జరిగిపోతుంది. అన్నయ్య మాటని కాదని ఇలా చేసింది అంటే పింకీని ఏం చేయాలి అని చంద్ర అంటాడు. రూప కూడా కనిపించడం లేదని విజయాంబిక చెప్తుంది. దాంతో అందరూ బిత్తరపోతారు. ఇక బంటీ అడ్రస్ చెప్పడంతో రూప బంటీని తీసుకొని ఇంటికి వస్తుంది. సరిగ్గా రూప లోపలికి వెళ్లే టైం సూర్య రూపకి కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడిగి 5 నిమిషాల్లో నా కళ్ల ముందు ఉండాలని అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అనుమానిస్తూ ప్రశ్నించిన దీప.. దాసు దుస్థితికి ఏడుస్తున్న పారు.. జ్యో దొరికిపోతుందా!