Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today January 20th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: సొంత ఊరిలో అక్కాచెల్లెళ్లని కలపడానికి మిత్ర, వివేక్‌ల ప్లాన్.. పప్పూ, ఆవకాయ్, నెయ్యి కథ షురూ!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ, జానులను కలపడానికి మిత్ర, వివేక్‌లు కలిసి వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేయడానికి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అందరూ లక్ష్మీ వాళ్ల ఊరు బయల్దేరుతారు. మనీషాని కూడా పిలవమని మిత్ర లక్ష్మీతో చెప్తాడు. లక్ష్మీ మనీషా గదికి వెళ్తుంది. దాంతో మనీషా చూశావా లక్ష్మీ మిత్రకి నా మీద ఎంత ప్రేమో నేను లేకపోతే రాను అని నన్ను పిలవమన్నాడని అంటుంది. దానికి లక్ష్మీ అంత సీన్ లేదు నిన్ను ఒంటరిగా వదలడం ఇష్టం లేక అలా చెప్పారని అంటుంది. వెళ్లేది తన ఊరని ఓవర్ చేస్తే పచ్చడైపోతావ్ అని చెప్తుంది.

Continues below advertisement

అందరూ ఊరు వెళ్తారు. జాను వాళ్లు కూడా వెళ్తారు. జాను కావాలనే తాతయ్యకు అర్థం కానట్లు లక్ష్మీని దెప్పిపొడుస్తుంది. ఇక ఊరు మనుషులు లక్ష్మీని పొగిడితే జాను సీరియస్ అయిపోతుంది. ఎప్పుడూ మా ఇంటి దగ్గరే ఉంటారు మరేం పని లేదా అని అడుగుతుంది. దాంతో వివేక్ జానుతో నిన్ను చూడటానికి వచ్చినవాళ్లతో జోకులు ఏంటి అని కవర్ చేస్తారు. ఇక హారతి ఇవ్వడంతో అందరూ లోపలికి వెళ్తారు. మిత్ర, వివేక్ మాట్లాడుకుంటారు.

వివేక్: మనతో మా అమ్మని తెచ్చి తప్పు చేశాం అన్నయ్య. మామ్ ఉంటే మనం వదిన, జానులను కలపలేం. చూశావు కదా ఇందాక ఏం చేసిందో. అన్నయ్య నా దగ్గర ఒక సలహా ఉంది ఇప్పటి వరకు ఇంటాబయట వదినే అన్ని ప్రయత్నాలు చేసింది కదా ఇప్పుడు వదినకే అడుగుదామా వాళ్లని కలపడానికి సలహా.
మిత్ర: చెండాలంగా ఉంది నీ ఐడియా. నాదో ఐడియా ఈ ఇంట్లోనే చిన్నప్పుడు నుంచి అక్కా చెల్లెళ్లు కలిసే ఉన్నారు కదా అందుకు వాళ్ల మెమోరీలు గుర్తొచ్చేలా తాతయ్యని అడిగి మొత్తం గుర్తొచ్చి రియలైజ్ అయ్యేలా చేద్దాం. పిన్ని ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోవాలి.
వివేక్: సరే అన్నయ్య.

లక్ష్మీ గదిలో పని వాళ్లు లగేజ్ పెడతారు. ఊరి విషయాలు లక్ష్మీ వాళ్లని అడిగితే కాంతమ్మ తన భర్తని చెప్పనివ్వకుండా అపుతుంది. ఇక లక్ష్మీ తాతయ్యని విషయం అడుగుతుంది. ఊరిలో ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లుందని అంటే తాతయ్య అలా ఏం లేదని కవర్ చేస్తారు. జాను గురించే బెంగ అని చెప్తారు. మరోవైపు మనీషా, దేవయానిలు మాట్లాడుకుంటారు. జాను వాటా ఇప్పించే తీరుతానని వీలునామా కొట్టేద్దామని మనీషా అంటుంది. వీలునామా కొట్టేస్తే వాటాకి అడ్డు ఉండదని అంటుంది. ఇక మిత్ర లక్ష్మీ దగ్గరకు వెళ్లి అవకాయ, నెయ్యి, అన్నం తిందామని అవన్నీ తీసుకొని రమ్మని చెప్తాడు. లక్ష్మీ అన్ని తీసుకొస్తుంది. అందరూ కింద అరుగుపై కూర్చొంటారు. డైనింగ్ టేబుల్ ఉంది కదా అని జాను అంటుంది.

మిత్ర అందరితో లక్ష్మీ అందరినీ చుట్టూ కూర్చొపెట్టుకొని అన్నం అవకాయ నెయ్యి ముద్దలు కలిపి పెడుతుందని అంటాడు. ఆవిడ చేసిన ముద్దలు తినాలా అని జాను అరుస్తుంది. రెండు ముద్దలు తింటే ఏం కాదని వివేక్ చెప్పి జానుని కూర్చొమంటాడు. లక్ష్మీ అన్నంలో పప్పు ఆవకాయ్, నెయ్యి కలుపుతుంది. మనీషా, దేవయానిని కూడా మిత్ర పిలుస్తాడు. లక్ష్మీ, జానులు ఈ ఇంట్లో కలిసి పెరిగారు కదా వాళ్ల కథ చెప్పుకొని అన్నం తిందామని మిత్ర అంటాడు.  మిత్ర తాతయ్యని వాళ్ల లైఫ్‌లో మర్చిపోలేని జ్ఞాపకం అడుగుతాడు. దాంతో పెద్దాయన ఓ చెక్క పెట్టి చూపించి దాన్ని మైల పెట్టే అంటారని అందులో విడిచిన, పాత బట్టలు వేస్తారని చెప్తారు. లక్ష్మీకి పదేళ్లని అప్పుడు ఆ విషయం జరిగిందని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్‌ని అనుమానిస్తూ ప్రశ్నించిన దీప.. దాసు దుస్థితికి ఏడుస్తున్న పారు.. జ్యో దొరికిపోతుందా!

Continues below advertisement