Ammayi garu Serial Today Episode: రాజు కోపంగా సూర్యప్రతాప్‌ ఇంటికి వచ్చి దీపక్‌, విజయాంభికలను తిడుతుంటాడు. భార్య చనిపోతే కనీసం బాధ కూడా పడలేదు నీకేం తెలుసు ప్రేమ గురించి పెళ్లి గురించి.. కట్టుకున్న వాణ్ని గాలికి వదిలేసిన నీకేం తెలుసు పెళ్లి గురించి అంటాడు.


వియాంభిక: చూశావా తమ్ముడు వాడు ఎన్నెన్ని మాటలు అంటున్నాడో..


రాజు: ఆ సార్‌ మాత్రం ఏం చేస్తారు. ఆ సారుకు ప్రేమకంటే పగే ముఖ్యం.. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు.. ఆయనకు జరిగినట్టే లోకమంతా జరుగుతుంది అనుకుంటారు. అసలు జరిగిందేంటి అని ఆయన ఆలోచించచరు. అలా తెలుసుకోకుండా అమ్మగారిని దూరం పెట్టిన ఆయనకేం తెలుసు ప్రేమ గురించి


సూర్య: రాజు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు.. పోరా బయటకు..


రాజు: పోతాను సార్‌ పోతాను. నేనేమీ వీళ్లలాగా పంది కొక్కుల్లాగా మెక్కడానికి రాలేదు. వీళ్లలాగా సంసారాలు కూల్చడానికి రాలేదు. రెండు జీవితాలు కాపాడటానికి వచ్చాను.


చంద్ర: మా పింకి గురించి మా అన్నయ్య కన్నా ఎవరు ఎక్కువగా ఆలోచించరు.. పింకీ ఏం కావాలో అన్నయ్యే ఇచ్చారు. ఇప్పటికీ అన్నయ్యే చూసుకుంటారు. దయచేసి గొడవ చేయకుండా వెళ్లు రాజు..


రాజు: నేను గొడవ చేస్తున్నానా..? పిల్లలకు ఏమి కావాలో అది ఇవ్వడం అంటే కార్లు బంగ్లాలు ఇవ్వడం కాదు. కోరినవన్నీ ఇచ్చి తల్లిదండ్రులుగా మీరు గెలిచామనుకుంటున్నారు. నిజమైన గెలుపు అంటే.. మీ పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చెరగకుండా చూడటమే అసలైన గెలుసు. ఒక్కసారి పింకీని చూసి చెప్పండి. ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసి మీరు గెలిచామనుకుంటున్నారా..?


విజయాంభిక: మరీ మా రూప ముఖం చూసి చెప్పు రాజు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నాక తను సంతోషంగా ఉందా..? భర్తగా నువ్వు గెలిచాను అనుకున్నావా..? భార్యను వదిలేసి ఏదో సాధించాను అనుకుంటున్నావా..?


రాజు: వదిలేయడం గురించి మీరు మాట్లాడకూడదు అని చెప్పాను కదా విజయాంబిక గారు.


సూర్య: రేయ్‌ నీతో మాటలు అనవసరం.. సెక్యూరిటీ వీణ్ని బయటకు గెంటేయండి..


రూప: నాన్నా…


సూర్య: నువ్వాగు రూప ఆరోజు నువ్వు చెప్తున్నా వినకుండా నీ మీద అపరాధం మోసి నిన్ను వదిలించుకున్నాడు వీడు. ఈ గుమ్మంలో అడుగు కూడా పెట్టనన్నాడు వీడు. ఇప్పుడు ఏం సంబందం ఉందని వచ్చాడు. సెక్యూరిటీ వీణ్ని బయటకు గెంటి వేయండి.


రాజు: నేను వెళ్తాను సీఎం గారు.. కానీ పింకీకి గోపికీ పెళ్లి చేయడం గురించి ఆలోచించండి.. లేదంటే నేను మళ్లీ వస్తాను.


రూప: నాన్నా.. రాజు ఏదో కోపంలో మాట్లాడాడు. మీరేం పట్టించుకోవద్దు నాన్నా.. రాజు గురించి మీకు తెలుసు కదా..?


విజయాంభిక: ఏంటి రూప వాడు మా అందరినీ చెప్పుతో కొట్టినా తుడుచుకుని పొమ్మంటావు అంతేగా…? వాడు మీ నాన్నన్ని పెద్దయ్యా అంటూ గౌరవంగా పిలిచేవాడు. ఇప్పుడు సీఏం అంటూ సారు అంటూ పిలిచే వరకు వచ్చింది. వాడు అన్నేసి మాటలు అంటుంటే మనం వింటూ కూర్చోవాలా..?  


అంటూ విజయాంబిక చెప్పగానే.. రూప అయోమయంగా చూస్తుంది.


సూర్య: అక్కా పెళ్లి వాళ్లకు మన తరపున క్షమాపణ చెప్పు..


విజయాంభిక: అలాగే తమ్ముడు..


సూర్య: అలాగే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందామని చెప్పు..


అని సూర్య వెళ్లిపోతాడు. రూప ఎంత చెప్పినా వినడు.. ఇంతలో రూప, రాజుకు ఫోన్‌ చేసి నాన్నా ఆ సంబంధాన్ని ఓకే చేశారని చెప్తుంది. పింకీ ఏడుస్తుంది. ఎంత త్వరగా మంచి ముహూర్తం ఉంటే అంత త్వరగా ఎంగేజ్‌మెంట్‌ చేయాలన్నారు అని చెప్తుంది. దీంతో రాజు.. పింకీని ధైర్యంగా ఉండమని చెప్పండి.. వాళ్లు ఎంగేజ్‌మెంట్‌ చేసే ముహూర్తానికే నేను వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పండి అంటూ రాజు ధైర్యం ఇస్తాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


 ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!