Karthika Deepam 2 Serial Today January 17th:  ‘కార్తీక దీపం 2’ సీరియల్ : కాశీకి నిజం చెప్పిన కార్తీక్‌ – జ్యోత్స్న ను తిట్టిన దశరథి

Karthika Deepam 2 Today Episode: డబ్బుల కోసం తన ఫ్రెండ్‌ రవిని అడిగి అవమానపడతాడు కార్తీక్‌. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Continues below advertisement

Karthika Deepam 2  Serial Today Episode: దాసు ప్రాణాలు పూర్తిగా తీయకుండా వచ్చానని జ్యోత్స్న బాధపడుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఎవరిని చంపడానికి వెళ్లావని అడుగుతుంది. ఆ వెంటనే వచ్చిన ధశరథ్‌  జ్యోత్స్న ను కోపంగా చూస్తుంటాడు.   పారిజాతం ఎంత అడిగినా జ్యోత్స్న పలకదు. దశరథిని చూసిన సుమిత్ర కంగారు పడుతుంది. ఎందుకు డల్లుగా ఉన్నారని అడుగుతుంది. దశరథి చేతికి అంటిన రక్తం మరకలు చూసి అవేంటని అడుగుతుంది. దారిలో ఎవరికో యాక్సిడెంట్ అయితే కాపాడానని అవే ఈ మరకలు అని చెప్తాడు దశరథి. అయితే ఆ చేతులు కడుక్కో అంటాడు శివనారాయణ. అంటిన రక్తాన్ని కడుక్కోగలం కానీ చేసిన పాపాన్ని కడుక్కోలేమని దశరథి అనగానే జ్యోత్స్న ఇంకా భయపడతుతుంది. దాసును కాపాడింది దశరథియేనా అని అనుమానిస్తుంది. మరోవైపు శౌర్య మెడలో లాకెట్‌ చూసి దీప కోప్పడుతుంది.

Continues below advertisement

దీప: శౌర్య ఆ లాకెట్‌ ముట్టుకోవద్దని ఎన్నిసార్లు చెప్తాలి.

కార్తీక్: నేనే ఇచ్చాను దీప.

దీప: ఇది మీ ప్రాణదాత అని అన్నారు. ఎవరికి ఇవ్వనని చెప్పి ఇప్పుడు ఎలా

ఇచ్చారు.

కార్తీక్‌:  ఇది నా ప్రాణదాత నాకు ఇచ్చింది. నేను నా ప్రాణానికి ప్రాణమైన శౌర్యకు ఇచ్చాను.

అని చెప్తూ కార్తీక్‌ శౌర్య ఆపరేషన్ గురించి అందుకు కావాల్సిన డబ్బు గురించి ఆలోచిస్తుంటాడు.

దీప: ఏం ఆలోచిస్తున్నారు కార్తీక్‌ బాబు.

కార్తీక్‌: ఏం లేదు దీప నా ఫ్రెండ్‌ తను వైఫ్‌ ఊరు వెళ్తున్నారు. వారి పాప ఇక్కడే ఉంది. ఆ పాపకు తోడుగా మన శౌర్యను పంపించమని అడిగారు. నువ్వు కాదనవన్న నమ్మకంతో నేను మాటిచ్చాను. రేపు ఉదయమే అక్కడికి పంపిద్దాము దీప.

కానీ దీప ఒప్పుకోదు.. కార్తీక్‌ కన్వీన్స్‌ చేస్తాడు. శౌర్య అక్కడికి వెళితే తన ఆరోగ్యం బాగవుతుందని చెప్తాడు. దీంతో ఆలోచనలో పడిపోయిన దీప, శౌర్య దగ్గరకు వెళ్లి నాకు వారం రోజులు దూరంగా ఉండగలవా అని అడుగుతుంది. ఉంటానని శౌర్య చెప్తుంది. దీంతో దీప కూడా శౌర్యను పంపడానికి ఒప్పుకుంటుంది. తర్వాత కార్తీక్‌ డాక్టర్‌కు ఫోన్‌ చేసి శౌర్యను రేపే హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేస్తామని చెప్తాడు. సరే డబ్బు కూడా రెడీ చేసుకోండని డాక్టర్‌ చెప్తాడు. డాక్టర్‌తో డబ్బుల గురించి కార్తీక్‌ మాట్లాడటం దీప వింటుంది.

దీప: ఐదు లక్షలు దేనికోసం కార్తీక్‌ బాబు..

కార్తీక్: ఒక రెస్టారెంట్ పెట్టడానికి ఆఫర్‌ వచ్చింది అందుకోసం దీప

దీప: రెస్టారెంట్‌ విషయం నాతో ఎందుకు చెప్పలేదు కార్తీక్‌బాబు.  

కార్తీక్‌: ఇప్పుడు చెప్తున్నానుగా దీప..

దీప: అది సరే బాబు.. శౌర్యను ఫ్రెండ్ ఇంటికి తీసుకెళతానన్నారుగా

కార్తీక్‌: ఎప్పుడు తీసుకెళతానో చెబుతా అన్నాను కదా.. ఎందుకు గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తావు..?

అంటూ కార్తీక్‌ విసుగ్గా బయటకు వెళ్తుంటే ఎక్కడకి వెళ్తున్నారని దీప అడుగుతుంది. తిరిగొచ్చి చెప్తానని కార్తీక్‌ అంటాడు. దీంతో కార్తీక్‌ బాబు నాతో ఏదో నిజం దాచిపెడుతున్నాడని మనసులో అనుకుంటుంది దీప. బయటకు వెళ్లిన కార్తీక్‌ తన ఫ్రెండ్‌ రవిని కలిసి డబ్బులు అడుగుతాడు. తన దగ్గర లేవని నువ్వు నీ మరదల్ని పెళ్లి చేసుకుని ఉంటే ఈ కష్టాలు పడేవాడివి కాదు కదా అంటూ సలహాలు ఇస్తాడు రవి. దీంతో కార్తీక్‌ కోపంగా అడిగితే సాయం చేసేవాడు బంధువు. అడగకుండా సాయం చేసేవాడు. స్నేహితుడు ఈ రెండింటిలో నువ్వు లేవని నాకు అర్థం అయిందని వెళ్లిపోతాడు కార్తీక్‌. రవిని కార్తీక్‌ డబ్బులు అడగడం చూసిన కాశీ వెళ్లి కార్తీన్‌ను డబ్బులు అవసరం ఉంటే నన్ను అడగొచ్చు కదా..? అసలు ఏమైంది అని కాశీ అడగ్గానే శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి నిజం చెప్తాడు కార్తీక్‌. నిజం తెలుసుకున్న కాశీ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.

 

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

Continues below advertisement