Karthika Deepam 2 Serial Today Episode: ఈ ఒక్క తప్పును క్షమించు నాన్న అని జ్యోత్స్న ప్రాధేయపడుతుంది. ఇక్కడి నుంచి వెళ్లిపో అని కన్నీరు. పెట్టుకుంటుంది. అయినా దాసు వినకుండా నిజం చెప్పేస్తానని లోపలికి వెళ్తుంటే.. కర్ర తీసుకుని దాసును వెనక నుంచి తల మీద గట్టిగా కొడుతుంది జ్యోత్స్న. దాసు గట్టిగా అన్నయ్యా అంటూ అరుస్తాడు. దాసు అరుపు విని ధశరథి బయటకు వస్తాడు. దాసు చూసి షాక్ అవుతాడు. అడ్డుకోవడానికి పరుగున వస్తాడు. తండ్రి రాకను గమనించిన జ్యోత్స్న.. దాసును కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దశరథి ఫాలో అవుతుంటాడు. ఒక దగ్గర కారు ఆపుతుంది జ్యోత్స్న. దాసు స్పృహ కోల్పోయి ఉంటాడు.
జ్యోత్స్న: నన్నెందుకు హంతకురాలిని చేస్తున్నావు... నిజం చెప్పొద్దు అన్నప్పుడు నా మాట వినొచ్చుగా.. నా గురించి నిజం తెలిసిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో ఉండకూడదు.
అని దాసును చంపబోతుంటే.. ధశరథి వచ్చి కాపాడతాడు. జ్యోత్స్న అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు శౌర్య పరిస్థితి తలుచుకుని ఆలోచిస్తుంటాడు కార్తీక్.
శౌర్య: నాకు ఏమైంది.. నాన్నా..
కార్తీక్: నీకు బలం లేదంటా ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుందని డాక్టర్ అన్నారు.
శౌర్య: నేను డాక్టర్ చెప్పినవి అన్ని విన్నాను నాన్నా..?
కార్తీక్: శౌర్య నువ్వు విన్న విషయాలేవి అమ్మకు చెప్పొద్దు.. నేను చెప్పినట్టు వింటే నీకు ఇష్టమైంది ఏదైనా ఇస్తాను.
అనడంతో తనకు లాకెట్ కావాలని అడుగుతుంది.. కార్తీక్ బాధపడతాడు. నిన్ను ఎలాగైనా బతికించుకుంటానని మనసులో అనుకుంటాడు. మరోవైపు రూంలో ఉన్న సుమిత్ర గట్టిగా కేకలు వేయగానే.. పారిజాతం వచ్చి డోర్ లాక్ తీస్తుంది. అప్పుడే జ్యోత్స్న ఇంటికి వస్తుంది. ఎక్కడికి వెళ్లావని అడిగితే మర్డర్ చేయడానికి వెళ్లి వచ్చానని జ్యోత్స్న చెప్తుంది. మరోవైపు ధశరథి, దాసును హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు. డాక్టర్ పరిశీలించి అతను బతకడని ఒకవేళ బతికినా కోమాలోనే ఉంటాడని చెప్తాడు. డాక్టర్ మాటలు విన్న ధశరథి తన కూతురు జ్యోత్స్న ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలా అంటూ బాధపడుతుంటాడు. మరోవైపు కార్తీక్, శౌర్యను తీసుకుని ఇంటికి వెళ్తాడు.
దీప: కార్తీక్ బాబు శౌర్యకు ఏమైంది.
కార్తీక్: ఏం కాలేదు దీప
దీప: ఏం కాకపోతే ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ ఎందుకు ఇచ్చాడు.
కార్తీక్: శౌర్య నీరసంగా ఉందని డాక్టర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు.
దీప: శౌర్య విషయంలో నేను బాధపడతానని మీరు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నారు కార్తీక్‌బాబు. శౌర్య కోసమే నేను బతుకుతున్నాను. శౌర్యకు ఏమైనా అయితే నేను బతకలేను.
కార్తీక్: దీప నా మీద నీకు నమ్మకం ఉంది కదా..? ఉంటే మరోసారి నన్ను ఈ ప్రశ్న అడగొద్దు..
అని చెప్పి కార్తీక్ వెళ్లిపోతాడు. మరోవైపు దాసు ప్రాణాలు పూర్తిగా తీయకుండా వచ్చానని జ్యోత్స్న బాధపడుతుంది. ఇంతలో పారిజాతం వచ్చి ఎవరిని చంపడానికి వెళ్లావని అడుగుతుంది. ఇంతలో ధశరథ్ వచ్చి జ్యోత్స్న ను కోపంగా చూస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!