Nindu Noorella Saavasam Serial Today January 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: సీసీటీవీలో నిజం తెలుసుకున్న అమర్ – అమర్‌కు ఫోన్ చేసి నిజం చెప్పిన రామ్మూర్తి
Nindu Noorella Saavasam Today Episode: షాపు బయట ఘోరాను చూసిన ఆరు అక్కడి నుంచి రామ్మూర్తిని తీసుకుని పారిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Nindu Noorella Saavasam Serial Today Episode: భాగీ ప్రశాంతంగా హ్యాపీగా అమర్‌కు ఫోన్ చేసి విషయం చెప్తుంది. అయితే నేనే అక్కడికి వెళ్లి వాళ్లను తీసుకుని ఇంటికి వస్తానని చెప్తాడు అమర్. ఫోన్ కట్ చేసిన తర్వాత అమర్ ఆలోచిస్తుంటే..
రాథోడ్: ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్
అమర్: ఏం లేదు రాథోడ్ అక్కడ ఉన్నది అంజుయేనా అని అనుమానం వస్తుంది.
రాథోడ్: అలా అంటారేంటి సార్
అమర్: ఉదయం మిస్సమ్మ ఒక మాట చెప్పింది. ఆరుకు మనుషుల్లో ప్రవేశించే శక్తి వచ్చిందేమో అని.. అ మాట ప్రకారం చూసుకుంటే ఆరు, అంజులో ప్రవేశించిందేమో..?
రాథోడ్: అలా ఎలా కుదరుతుంది సార్
అమర్: అవును రాథోడ్ అంజలి.. రామ్మూర్తి గారి ఇంటికి వెళ్లడం ఏంటి..? ఇద్దరూ కలిసి శారీ కొనడం ఏంటి..?
రాథోడ్: సార్ అయితే మనం ఇప్పుడు మేడంతో మాట్లాడొచ్చా సార్
అమర్: ఏమో రాథోడ్ పాస్ట్ గా అక్కడికి వెళ్లు మనం అంజులో ఆరు ఉందే లేదో తెలుసుకుందాం
అని అమర్ చెప్పగానే రాథోడ్ కారు స్టార్ట్ చేస్తాడు. షాపులో అంజు, రామ్మూర్తి చీరలు చూస్తుంటారు. షాపు బయట ఘోర కాచుకుని ఉంటాడు.
అంజు: ఈ శారీ నాకు ఎలా ఉంది..?
రామ్మూర్తి: ఆ చీరలో నువ్వు మహాలక్ష్మీలా ఉంటావు తల్లి
అంజు: ఎంతైనా మీ కూతురిని కదా
రామ్మూర్తి: నా కూతురా..?
అంజు: అదే మిస్సమ్మ మీకు కూతురు కదా..? నేను మిస్సమ్మకు కూతురుని కదా అందుకే అలా అన్నాను. ఇంతకీ రేపు కాశీకి వస్తున్నారా..? తాతయ్య.
రామ్మూర్తి: రావాలి కదమ్మా.. పెళ్లి చేసి నా కూతురిని అత్తారింటికి పంపలేకపోయాను.. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందామనుకుంటున్నాను.
అంజు: కన్నీళ్లతో తల రాతలు తుడిపేసే అవకాశమే ఉంటే ఈ లోకంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకు అడుగువేయాలి కానీ అక్కడే ఉండకూడదు నాన్నా.. అదే తాతయ్యా .. అయినా చనిపోయింది మా అమ్మ కదా..? ఎవరైనా వింటే నిజంగానే మీ కూతురు అనుకుంటారు
అంటూ రామ్మూర్తి కన్నీళ్లు తుడుస్తుంది అంజు. తర్వాత బట్టలు తీసుకుని బయటకు వచ్చిన అంజులో ఉన్న ఆరు ఘోరాను చూస్తుంది. ఘోర కూడా అంజును చూసి నా ఆత్మ నీకోసమే ఎప్పటి నుంచో ఇక్కడ కాచుకుని ఉన్నాను అంటాడు. అంజు భయంతో రామ్మూర్తిని తీసుకుని అక్కడి నుంచి పారిపోతుంది. ఘోరా వాళ్లను ఫాలో అవుతుంటాడు. ఇంతలో షాపు దగ్గరకు వచ్చిన అమర్, అంజు గురించి ఎక్వైరీ చేస్తాడు. షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజీ చూసి కచ్చితంగా ఆరు, అంజులో ప్రవేశించిందని నిర్ధారణకు వస్తాడు. వెంటనే అంజు షాపు నుంచి బయటకు వచ్చి అంజు వాళ్లను వెతుకుతాడు. కొద్ది దూరం వెళ్లాక రామ్మూర్తి ఆయాసం వస్తుందని కూర్చోగానే.. అంజలి పారిపోతుంది. ఇంతలో అమర్ రామ్మూర్తి దగ్గరకు వస్తాడు. అంజలి ఎక్కడ అని అడిగితే అటువైపు పారిపోయిందని చెప్తాడు. ముగ్గురు కలిసి అటు వైపు వెళ్తారు. ఒక పాడుబడిన బంగ్లాలోకి వెళ్లిన అంజును ఘోర బంధించి ఆత్మను బంధించాలని మంత్రాలు చదువుతుంటే ఇంతలో అమర్ వచ్చి ఘోరను కొడుతుంటే.. ఘోర కూడా ప్రతిఘటిస్తుంటాడు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!