Ammayi garu Serial Today Episode రాజు కాళ్లకి గాయం అవ్వడంతో అపురూప ఫస్ట్‌ఎయిడ్ చేస్తుంది. రాజు పడిపోబోతుంటే పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసికుంటారు. ఇక రూప రాజు చేతిని తన భుజం మీద వేసుకొని నడిపిస్తుంది. మరోవైపు జీవన్, హారతిలు ఎవరూ చూడకుండా దేవుడికి దండం పెట్టుకుంటారు. జీవన్ నన్ను పెళ్లి చేసుకునేలా చేయమని హారతి కోరుకుంటుంది. ఇక జీవన్ హారతిలు కలిసి ఉండగా ఒక వైపు నుంచి సూర్యప్రతాప్ వాళ్లు మరోవైపు ముత్యాలు వాళ్లు ఇంకో వైపు రూప, రాజులు ఉంటారు. దాంతో తప్పించుకోలేక జీవన్, హారతిలు పంతులు కాళ్ల మీద పడిపోతారు.
ఇక అందరూ దీపాలు విడిచి పెట్టడానికి వెళ్తారు. జీవన్ హారతిని వెళ్లిపోమంటే నేను దీపాలు వదలాలని హారతి అంటుంది. దాంతో జీవన్ నాకు దూరంగా ఉండమని చెప్తాడు. అందరూ దీపాలు కొలనులో విడిచిపెట్టడానికి వెళ్తారు. ముత్యాలు, విరూపాక్షిలు ఓ వైపు విడిచిపెడితే రూప వాళ్లు వస్తారు. రూప, రాజులను చూసి రాజు తల్లిదండ్రులు మురిసిపోతారు. ఇంతలో డాక్టర్ రాజుకి కాల్ చేసి డీఎన్‌ఏ రిపోర్ట్స్ తీసుకొని బయల్దేరానని అంటే రాజు డాక్టర్‌ని శివాలయానికి రమ్మని చెప్తాడు. ఇక ఆ విషయం సూర్యప్రతాప్‌కి చెప్తాడు.
దీపక్: మనసులో రాజు రూపలు చెప్పినట్లు జీవనే హారతి బిడ్డ తండ్రి అని తేలాలి అప్పుడు చెప్తా వాడి సంగతి.
జీవన్: మనసులో రాని రాని డీఎన్‌ఏ రిపోర్ట్స్‌తో వీళ్లందరికీ నా మీద అనుమానం పోతుంది. అప్పుడు ఆ ఇంట్లో మహారాజులా ఉండొచ్చు. రాక్షసుడిలా మారి అందరికీ ముప్పుతిప్పలు పెట్టొచ్చు.
పింకీ: దీపం వదులుతూ కార్తీకపౌర్ణమి రోజు పెళ్లి కాని ఆడపిల్ల మంచి భర్త రావాలని కోరుకుంటుంది. కానీ నాకు ఊహించని భర్త వచ్చాడు. నా దృష్టిలో అతను భర్త కాదు భర్త అంటే మనసులో ఉండాలి. నా మనసులో గోపీ ఉన్నాడు నా గోపీని నాకు దగ్గర చేసే బాధ్యత నీదే స్వామి.
జీవన్: మనసులో నన్ను అనుమానించి ఇరికించారు నేను మీ కంటే తెలివైన వాడినని మీకు మరి కాసేపట్లో తెలిసిపోతుంది.
జీవన్ రూపని కొలనులోకి తోసేయాలని రూప కాళ్లలో కాలు పెడితే రూప పడిపోబోతే రాజు పట్టుకుంటాడు. రాజు జాగ్రత్త చెప్తే నా పక్కన నువ్వుఉంటే నాకు ఏం కాదని రూప అంటుంది. ఇంతలో హారతి కూడా బిడ్డను ఎత్తుకొని దీపాలు పట్టుకొని వస్తుంది. సూర్యప్రతాప్‌ని విష్ చేస్తుంది. రూప హారతితో నువ్వేం బాధ పడకు హారతి దేవుడు నీకు న్యాయం చేస్తాడని అంటుంది. ఇక హారతి కూడా దీపాలు వదులుతుంది. రిపోర్ట్స్‌లో జీవనే తన బిడ్డకు తండ్రి అని తేలితే అవమానం జరిగినా సరే మేలు జరుగుతుందని నిజం తెలియాలని కోరుకుంటుంది.
డాక్టర్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి సూర్యప్రతాప్‌కి ఇస్తాడు. జీవన్ రిపోర్ట్స్ తనకు అనుకూలంగా వస్తాయని సంబరంతో నవ్వుకుంటాడు. ఇక డాక్టర్ జీవన్ సాంపిల్స్ హారతి బిడ్డతో మ్యాచ్ అయ్యాయని చెప్తాడు. దాంతో అందరూ షాక్ అయిపోతారు. ఫ్లాష్ బ్యాక్‌లో జీవన్ డబ్బు ఇచ్చి వెళ్లిన తర్వాత డాక్టర్ రాజుకి కాల్ చేస్తాడు. విషయం చెప్తాడు. దాంతో రాజు రిపోర్ట్స్‌లో మార్పులు వద్దని ఎలా వస్తే అలాగే ఉండాలని చెప్తారు. ఇక ముత్యాలు సూర్యప్రతాప్ వినేలా సీఎం గారు ఏం న్యాయం చేస్తారో చూద్దాం కట్టుకున్న భార్యకి కన్న కూతురికి కూడా శిక్ష వేసిన సీఎం గారు ఇప్పుడేం చేస్తారో చూద్దాం అని భర్తతో అంటుంది. జీవన్ బిత్తరపోతాడు.
సూర్యప్రతాప్ జీవన్ కాలర్ పట్టుకొని చితక్కొడతాడు. నా బిడ్డ మెడలో తాళి కట్టి ఎందుకు నా కూతురి జీవితం నాశనం చేశావని చంద్ర జీవన్‌ని కొడతాడు. సుమ కూడా నీ చెల్లి ఇలా చేస్తే ఊరుకుంటావా అని తిడుతుంది. అందరూ జీవన్ని నీచుడని తిడతారు. విజయాంబిక హారతిని తిడుతుంది. వాడి బిడ్డకి నా కొడుకుని తండ్రిని చేయాలని ప్రయత్నిస్తావా అని తిడుతుంది. నిన్ను తల్లిని చేసింది ఎవరో తెలిసినా ఊరుకున్నావ్ ఇప్పుడు పింకీ మెడలో వాడు తాళి కట్టాడు నీ బతకు ఏంటి అని ప్రశ్నిస్తారు సూర్యప్రతాప్. అందరూ గుడిలో రచ్చ ఎందుకని ఇంటికి రమ్మని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.