Alitho Saradaga Latest Promo: తెలుగమ్మాయి అంజలి మరోసారి తెలుగు తెరపై సందడి చేయబోతోంది. గతంలో ఆమె నటించి సూపర్ హిట్ మూవీ ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కామెడీ, హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కోన వెంక‌ట్ క‌థ, స్రీన్ ప్లే అందించారు. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ నేపథ్యంలో అంజలి, కోన వెంకట్ తో కలిసి ‘ఆలీతో సరదగా’ కార్యక్రమంలో పాల్గొన్నది.


దాని కోసం కోన 4 ఏళ్లు తీసుకున్నారు- అంజలి


ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంజలి, ఈ సినిమాతో పాటు పలు వ్యక్తిగత అంశాల గురించి మాట్లాడింది. “అలాంటి ఆయనను చేసుకోబోతున్నావంట నీవు? అని ఆలీ అనగానే.. “అగ్ర నిర్మాత” అని అంజలి చెప్తుంది. “స్టేజి మీద ఏర్పాటు చేసిన డెకరేషన్ చూస్తుంటే ఏం అనిపిస్తుంది” అనగానే,  “ఉగాది సెలబ్రేషన్ లా కనిపిస్తుంది” అని చెప్తుంది. “పెళ్లికి చేసే డెకరేషన్ లా కనిపించడం లేదా?” అని ఆలీ అనడంతో అందరూ నవ్వుతారు.  ఇక గతంలో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాతో పోల్చితే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చాలా స్పెషల్ మూవీ అని చెప్తుంది. ఈ సినిమా కథను డెవలప్ చేయడానికి కోనకు 4 ఏళ్లు పట్టిందని వివరించింది.  


1000కి 50 నోట్లు ఎన్నో తెలియదా?


ఈ షోలో పాల్గొన్న కోన వెంకట్ తన సౌందర్య రహస్యం ఏంటో చెప్పారు. బీ పాజిటివ్, స్టే పాజిటివ్ అనే సూత్రాలను పాటిస్తే అందరూ అందంగానే ఉంటారని చెప్తారు. ఇక ఈ సినిమాలో కొత్త పాయింట్ ఏంటి? అని ఆలీ అడగ్గా, దెయ్యలాతో షూటింగ్ చేయడమే ఈ సినిమాలో కొత్త పాయింట్ అంటారు. 1000 రూపాయలకు ఎన్ని 50 రూపాయలు వస్తాయని అంజలిని అలీ అడిగితే, 10 అని చెప్తుంది. నీ రెమ్యునరేషన్ నువ్వే లెక్కబెట్టుకుంటావా? వేరెవరైనా లెక్కబెడతారా? అనడంతో..  మేనేజర్ లెక్కబెడతారని చెప్తుంది. ఇకపై నీ మేనేజర్ గా నేనుంటాను అని చెప్తాడు. నా మేనేజర్  సేఫ్ అని చెప్పడంతో, నేను సేఫ్ కాదా? అంటాడు అలీ. అందరూ నవ్వుతారు.


బాలయ్య కోపాన్ని కంట్రోల్ చేసుకున్నారా?


ఇక బాలయ్యతో ’డిక్టేటర్’ సినిమా చేస్తున్న సమయంలో తాను ఎంత అల్లరి చేసినా ఆయన కూల్ గా ఉండేవారని అంజలి చెప్పింది. అల్లరి చేయకూడదు ఓం శాంతి, శాంతి అనేవారు అని వెల్లడించింది. ఈ రోజుల్లో చాలా మంది మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నారని, ఫిల్టర్లు పెట్టుకుని ప్రవర్తిస్తున్నారని కోన వెంకట్ చెప్పారు. అంజలి అలా కాకుండా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుందని చెప్పుకొచ్చారు.


ఇక ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాలో సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్‌, అలీ, బ్రహ్మాజీ, రవి శంకర్‌, రాహుల్ మాధవ్ సహా పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎంవీవీ సినిమాస్‌ బ్యానర్‌ తో కలిసి కోన ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై కోన వెంకట్‌ తెరకెక్కిస్తున్నారు.


Read Also: ఫ్యాన్స్ ప్రేమకు ఫిదా - ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్‌లో మృణాల్ చేసిన పనికి అంతా షాక్