Prema Entha Madhuram September 2nd: ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్య నీరజ్ తో ఈ పిల్లలు ఇప్పటి నుంచి పనులు నేర్చుకుంటే వాళ్లకి చాలా ఉపయోగం అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు. ఇంతలో అంజలి అక్షరని తన పేరు అడుగుతుంది ముందు నీ పేరు చెప్పు అని అనడంతో గడుసు దానివే అని అంటుంది అంజలి. దాని తర్వాత నీరజ్ కూడా వచ్చి అక్షరతో మాట్లాడుతారు. తర్వాత ఆర్య ఆ పిల్లలందరినీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పోసిషన్ ఇవ్వగా అక్షరని సీఈవోగా ప్రకటిస్తాడు.తర్వాత అంజలి నీరజ్ సైట్ పని ఉంది అని ఆర్యని పర్మిషన్ అడిగితే... ఈరోజు నేనే కదా సీఈఓ ని నా పర్మిషన్ తీసుకునే వెళ్లాలి అని అక్షర అంటుంది. అంతా నవ్వుతారు. అక్షర పర్మిషన్ ఇచ్చి నీరజ్ వాళ్లని పంపిస్తుంది. తర్వాత ఆర్య అక్షర ని తన క్యాబిన్ కి తీసుకొని వెళ్తాడు. మరోవైపు అంజలి నీరజ్ మాట్లాడుకుంటూ అక్షర చాలా మంచి అమ్మాయి అందరితో బాగా కలిసిపోయింది. ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరు అని అనుకుంటూ అను ఎలాఉందో అని బాధపడుతూ ఉంటారు.


Also Read: తిలోత్తమతో నిజం కక్కించిన నయని, అందరి లెక్కలు తేలుస్తానన్న చంద్రశేఖర్


నీరజ్ ను చూసి దాక్కున్న అను
అదే సమయంలో అను అభయ్ తో రోడ్డు మీద ఉంటుంది. అభయ్ స్టేషనరీ షాప్ కి వెళ్లి వస్తువులు కొనుక్కుంటాను అని అంటాడు. అప్పుడు అను రోడ్డుమీద ఒక షాప్ దగ్గర ఉంటుంది. అదే సమయంలో నీరజ్ కార్ అటువైపు నుంచి వెళ్లడంతో అను అంజలిని చూస్తుంది. అంజలి కూడా అనుని చూసి కారు ఆపిస్తుంది. కానీ అను అంజలిని చూసి దాక్కుంటుంది. ఎంత వెతికినా నీరజ్ వాళ్లకి అను కనిపించదు.మరోవైపు అను చీర కొంగుని నుదుటిమీద కప్పుకొని వెనకనుంచి అభయ్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటువైపు అక్షర సీఈవో సీట్లో కూర్చొని చాలా బాగుంది అని మురిసిపోతుంది. 


షిండే-అక్షర
అక్కడ షిండే అక్షరని చిన్న బిజినెస్ గురించి సలహా అడుగుతాడు. ఐదు రూపాయల 10 రూపాయలకే అమ్మితే మనకి అయిదు రూపాయలు లాభం కదా. ఏమంటావు అని అనగా అక్షర ఆలోచించి దాంతోపాటు మూడు రూపాయల పెన్సిల్ ని ఫ్రీగా ఇద్దాము.అప్పుడు మనకి రెండు రూపాయలు ప్రాఫిట్ కదా అని అంటుంది.రెండు రూపాయలే ప్రాఫిట్ కదా అని షిండే అనగా రెండు రూపాయలు అని తక్కువగా అంచనా వేయొద్దు. మా అమ్మ నాకు రోజుకి ఐదు రూపాయలు ఇస్తే అందులో నేను రెండు రూపాయలు దాసుకుంటాను. న్యాయంగా డబ్బులు సంపాదించాలి ఎంత కావాలో అంత సంపాదిస్తే చాలు అని మాకు అమ్మ నేర్పింది అని అనగా మంచి విలువలతో మీ అమ్మ నిన్ను పెంచింది అని అంటాడు షిండే.  మీ నాన్న ఏం చేస్తారు అని అడిగితే అక్షర బాధపడుతూ నాకు నాన్న లేరు అమ్మని ఎంత అడిగిన ఏడుస్తుంది గాని చెప్పదు అని అంటుంది.


Also Read: తండ్రి గురించి అడిగి అనుని బాధపెట్టిన అక్షర.. ఆర్య ఇంటికి వచ్చి గొడవకు దిగిన మాన్సీ, ఛాయదేవి?


ఆర్య-అక్షర
మీకు పిల్లలు లేరా అని అక్షర ఆర్యని అడుగుతుంది. ఉన్నారు దూరంగా వాళ్ళ అమ్మతోపాటు చదువుకుంటున్నారు అని బాధపడుతూ చెబుతాడు. అయితే నాకు మీ పిల్లల్ని పరిచయం చెయ్యు నేను వాళ్ళతో ఫ్రెండ్స్ అవుతాను ఫ్రెండ్ అని అంటుంది అక్షర. ఇంక నాకు లేట్ అవుతుంది నేను వెళ్తాను ఇంట్లో అమ్మ ఎదురుచూస్తుంది అని అక్షర అనగా మీ అమ్మకి ఫోన్ చేసి నేనే వచ్చి దింపుతాను కంగారు పడొద్దు అని చెప్పు అని అంటాడు ఆర్య. అయితే ఆర్య ఫోన్ తీసుకొని అక్షర అను కి ఫోన్ చేస్తుంది. అభయ్ ఫోన్ ఎత్తి ఇంకా రాలేదు ఎందుకు అని అడుగుతాడు. నేను మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీకి వచ్చాను లేటవుతుంది అన్నయ్య అని అక్షర అనగా ఇంతలో అను వచ్చి ఏమైంది అని ఫోన్ తీసుకుంటుంది. అదే సమయంలో అక్షర దగ్గర నుంచి కూడా ఆర్య ఫోన్ తీసుకుంటాడు. అప్పుడు ఆర్య అనుతో నమస్కారమండి నేను వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఆర్య వర్ధన్ నీ మాట్లాడుతున్నాను అని అనగా అను ఒకేసారి షాక్ తిన్నంత పని అవుతుంది. అక్షరని నేనే మా కంపెనీకి తీసుకొని వచ్చాను చిన్న ప్రోగ్రాం మీద. నేనే మీ ఇంటికి వచ్చి తనని క్షేమంగా దింపుతాను అని ఆర్య అంటాడు. ఇంటికి వచ్చి దింపుతాను అని అనడంతో అను కంగారు పడుతుంది.ఏం మాట్లాడలేక సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు షిండే అక్షర దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటాడు. నువ్వే నాకు రాయించు అని అక్షర ఆర్య ని అడగగా ఆర్య అక్షర చేయి పట్టుకుని సంతకాన్ని రాయిస్తాడు. నాకు ఈ ఆఫీస్ చూడాలని ఉన్నది ఫ్రెండ్ అని అక్షర అడుగుతుంది. అప్పుడు ఒక ఎంప్లాయి ని పిలిచి ఆఫీస్ చూపించమంటాడు ఆర్య. అప్పుడు అక్షర అక్కడి నుంచి వెళ్తుంది.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial