Krishnamma kalipindi iddarini July 5th: సునంద కొడుకు కోడల్ని తీసుకొని జువెలరీ షాప్ కి వెళ్లి అక్కడ వాళ్ళని నగలు సెలెక్ట్ చేసుకోమని అంటుంది. ఇక గౌరీ తో నీకు నచ్చిన నగలు సెలెక్ట్ చేసుకోమని అనడంతో పక్కనే ఉన్న అఖిల, భవానికి కు బాగా కోపం వస్తుంది. ఇక గౌరీ ఇవన్నీ తనకు వద్దని ఎప్పుడు వేసుకోలేదని అనటంతో పక్కనే ఉన్న భవాని వాళ్ళు ప్రేమతో ఇస్తున్నప్పుడు తీసుకోవచ్చు కదా అని అంటుంది. దాంతో గౌరీ మన స్థాయికి తగ్గట్టు ఉండాలి కానీ స్థాయికి మించి వెళ్లదు అని ఇన్ని నగలు ఏమి వద్దు అని అనటంతో సునంద నువ్వు మా ఈశ్వర్ కి ఎందుకు నచ్చావో ఇప్పుడు అర్థం అయింది అని పొగుడుతూ ఉంటుంది.
ఇక అఖిలను కూడా నచ్చిన నగలను సెలెక్ట్ చేసుకోమని చెబుతుంది. భవానీని కూడా నగలు తీసుకోమని అనటంతో భవాని షాక్ అవుతుంది. దాంతో తల్లి కూతుర్లు ఇద్దరు నగలు వెతుకుతూ మురిసిపోతూ కనిపిస్తుంటారు. సునంద ఆదిత్యతో అఖిలకు నగలు సెలెక్ట్ చేయమని అనడంతో పర్వాలేదు మమ్మీ తను సెలెక్ట్ చేసుకుంటుంది అని అంటాడు. దాంతో అఖిల ఆదిత్యకు తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో తెలియదు కానీ పెళ్లయ్యాక తన పని చెబుతాను అని అనుకుంటుంది.
ఇక ఈశ్వర్ గౌరీ కి డైమండ్ నెక్లెస్ తీసుకోమని చెబుతాడు. ఆ తర్వాత సునంద ఒక నెక్లెస్ తీసి ఈశ్వర్ చేత గౌరీ మెడలో వేయిస్తుంది. అది చూసి తల్లి కూతుర్లు ఇద్దరు కుళ్ళుకుంటారు. ఇక షాపింగ్ పూర్తయి బయటకు వెళ్తున్న సమయంలో అఖిలకు తనను గతంలో వైట్ బ్యూటీగా చేస్తానని మోసం చేసిన రాంబాబు కనిపించడంతో అతని దగ్గరికి వెళ్లి మోసం చేసినందుకు బాగా పడుతుంది. ఇక అతడు తన దగ్గర నుంచి తప్పించుకోవటానికి ఆ బ్యూటీ పార్లర్ వేరే అడ్రస్ కు మార్చారు అని ఆ విస్టింగ్ కార్డు ఇస్తాడు.
ఇంటికెళ్లాక గౌరీ ఈశ్వర్ గురించి తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే ఈశ్వర్ ఫోన్ చేయటంతో సంతోషంగా ఫోన్ లేపుతుంది. ఇక మీ గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది. అలా ఇద్దరు కాసేపు సరదాగా, ప్రేమగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఇక ఫోన్ కట్ చేశాక కూడా గౌరీ ఈశ్వర్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే అఖిల రాంబాబు చెప్పిన అడ్రస్ కి వెళ్తుంది.
మరోవైపు రాంబాబు బ్యూటీ పార్లర్ పేరుతో నువ్వు చేసిన వ్యాపారం ఎలా ఉంది అని ఒక లేడీ బ్రోకర్ ను అడుగుతూ ఉంటాడు. అంతేకాకుండా అఖిల గురించి చెబుతూ అది ఇక్కడ రాబోతుంది అని అంటాడు. మరోవైపు పార్లర్ కి వస్తున్న అఖిల తను రేపు పెళ్లిలో చాలా అందంగా ఉంటాను అని తెగ మురిసిపోతూ ఉంటుంది. ఇక రాంబాబు అఖిల గురించి ఆవిడతో బేరం చేస్తూ ఉంటాడు. ఇక ఆవిడ అమ్మాయి వచ్చాక రేటు మాట్లాడుతాను అని అంటుంది.
అప్పుడే అఖిల అక్కడికి వచ్చి రాంబాబు ని పిలుస్తుంది. ఇక రాంబాబు తన భాషలోతనకు అందంగా ట్రీట్మెంట్ చేయమని చెబుతూ ఉంటాడు. ఇక వాళ్ళు అలా చెబుతుంటే తను నిజంగా అందంగా అయిపోతానేమో అని అఖిల సంతోషపడుతుంది. ఇక సాయంత్రం మెహేంది ఫంక్షన్ ఉందని వెంటనే తనకు ట్రీట్మెంట్ చేయమని అంటుంది అఖిల. అఖిల లోపలికి వెళ్ళాక రాంబాబు ఆవిడ దగ్గర డబ్బులు అడగడంతో సాయంత్రం వచ్చి తీసుకోమని చెప్పటంతో రాంబాబు అక్కడి నుంచి వెళ్తాడు.
మరోవైపు గౌరీ డ్రెస్సులు తీసి సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అఖిలకు డ్రెస్ తీసి తనకు నచ్చుతుందో లేదో అని అనుకుంటుంది. అఖిలను పిలవడంతో తను ఎక్కడ కనిపించట్లేదని తన తల్లితో చెబుతుంది. దాంతో భవాని కూడా కంగారు పడుతుంది. వెంటనే గౌరీ ఫోన్ చేస్తుంది. గౌరీ తన అక్క ఫోన్ చేస్తుందని ఎక్కడికి వెళ్లావు అని అది ఇది అడుగుతుంది అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది. ఇక గౌరీ ఫోన్ తీయట్లేదని చెప్పటంతో భవాని అనుమానం పడుతుంది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial