Trinayani july 20th: తిలోత్తమా, వల్లభ అఖండ స్వామి దగ్గరికి వెళ్తారు. ఇక ఆయన చెప్పండి అనడంతో వెంటనే వల్లభ తన తల్లికి తిన్నది అరగలేదు అని అంటాడు. దాంతో తిలోత్తమా వాడు ఏదో వాగుతున్నాడు. ఉదయం నుండి ఉపవాసం ఉండటంతో సాయంత్రం తినడంవల్ల కాస్త జీర్ణం అవ్వలేదు వాడికి చెప్పరాకుండా మీతో అలా అన్నాడు అని అంటాడు.


ఇక తిలోత్తమా తమ ఇంట్లో గాయత్రి పాప వల్ల తనకు ఐదుసార్లు గండాలు ఎదురయ్యాయని గతంలో గోరింటాకు పెట్టినప్పుడు జరిగిన విషయం గురించి చెబుతుంది. అంతేకాకుండా బోనం కడవ కింద పడేలా చేయటంతో తనకు ముక్కులో నుండి రక్తం వచ్చిందని చెబుతుంది. అఖండ స్వామి మీరు ఎంత మంది వచ్చారు అనటంతో ఇద్దరమే అని అంటారు.


కానీ అఖండ స్వామి ముగ్గురు అన్నడంతో వల్లభ భయపడతాడు. దాంతో అఖండ స్వామి అలా అనిపించింది అని మళ్లీ కవర్ చేస్తాడు. ఇక మీరు వెళ్ళండి రేపు వచ్చి పిల్లలను చూస్తాను అని అంటాడు. వెంటనే ఆ మాటలు విన్న గురువు విశాల్ కి ఫోన్ చేసి చెప్పాలని అనుకుంటాడు. అఖండ స్వామికి కూడా బాగా శక్తులు ఉంటాయని అనుకుంటాడు.


మరోవైపు గాయత్రి డ్రెస్ ల గురించి నయని విశాల్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే గురువు ఫోన్ చేసి తిలోత్తమా అఖండ స్వామి దగ్గరికి వచ్చి గాయత్రి గురించి చెప్పింది అని రేపు స్వామి కచ్చితంగా వస్తాడు అని.. అంతలోపు జాగ్రత్తగా ఉండమని చెబుతాడు.  తను కూడా తన వంతు ప్రయత్నం చేస్తాను చెబుతాడు. ఇక విశాలాక్షి అమ్మని కాపాడమని కోరుతాడు గురువు.


ఇక పిల్లలను రేపు ఉదయం లేవగానే హాల్లోకి తీసుకొని రాకు అని నయనికి చెప్పటంతో నయని కాస్త అనుమానం పడుతుంది. మరుసటి రోజు అందరూ అఖండ స్వామి కోసం ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే ఇంట్లోకి గురువు వస్తాడు. ఆయనతో పాటు డమక్క కూడా పూల మాల తీసుకొని వస్తుంది. ఇక వాటిని పూజ గదిలో పెట్టమని గురువు అనడంతో వెంటనే విశాల్.. ఇంటికి ఎవరు స్వామీజీ వస్తున్నారంట వారికి ఈ మాల వేయొచ్చా అని అడుగుతాడు.


దాంతో గురువు ఒప్పుకుంటాడు. తిలోత్తమా కూడా ఒప్పుకుంటుంది. ఇక విశాల్ మనం అనుకున్నట్లే ప్లాన్ సక్సెస్ అయింది అని అనుకుంటాడు. అప్పుడే అఖండ స్వామి రాగా తిలోత్తమా గాయత్రి ఫోటో చూపిస్తుంది. పునర్జన్మ ఎత్తింది అని స్వామి అనడంతో.. తను మాత్రం ఇక్కడ లేదు అని సుమన అంటుంది. పిల్లలు ఎక్కడ వారిని తీసుకొని రండి అని అనటంతో అంతలోపు మాలవేసి సత్కరించమని గురువు చెబుతాడు.


దాంతో అఖండ స్వామికి పూల మాల వేసి కమలం ఇస్తారు. ఇక హాసిని, నయని పిల్లలను తీసుకొని వస్తారు. స్వామికి గాయత్రి ఇద్దరిలాగా కనిపిస్తుంది. ఇక ఇద్దరు మీ పిల్లలే కదా అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే సుమన అందులో ఒకరు దత్తత తీసుకున్న పాప అని చెప్పాము కదా అని అంటుంది. కానీ స్వామి ఇద్దరు కవల పిల్లలు అనటంతో అందరూ మరోసారి ఆశ్చర్యపోతారు. పేర్లు వేరైనా ఆ ఇద్దరు ఒక్కరే అని అంటాడు.


also read it : Rangula Ratnam July 19th: ‘రంగులరాట్నం’ సీరియల్: తన మాటలతో పూర్ణని బాధపెట్టిన శంకర్, సిద్దు ని ఘోరంగా అవమానించిన రేఖ?



 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial