Krishnamma kalipindi iddarini June 29th: పూజా కోసం పెళ్లికూతురులను తీసుకొని వస్తుండగా.. ఆ సమయంలో గౌరీ తలలో ఉన్న రోజా పువ్వు చూసి ఈశ్వర్ వాళ్ళ పిన్ని ఇది ఎక్కడిది అని అడగటంతో గౌరీ సిగ్గుపడుతూ కనిపిస్తుంది. దాంతో ఈశ్వర్ పెట్టాడు అని అర్థమవుతుందని అంటూ కాసేపు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటారు. పూజ దగ్గరికి గౌరీని తీసుకొని వెళ్తారు.
ఇంట్లో వాళ్లంతా గౌరిపై అంత ప్రేమ చూపిస్తుండడంతో అఖిల అస్సలు తట్టుకోలేక పోతుంది. తన తల్లితో చెప్పుకుంటూ కోపంగా కనిపిస్తుంది. దాంతో భవాని ఈ పెళ్లి కానీ పెళ్లయ్యాక ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను అని అంటుంది. ఇక అప్పుడే సౌదామిని భవానిని పక్కకి రా అంటూ బలవంతంగా తీసుకొని వెళుతుంది.
ఇక ఆనందయ్య తన ఇద్దరు కూతుర్ల పెళ్లి జరుగుతుందని సంతోషంగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక తన కూతుర్ల గురించి చెప్పుకుంటూ ఉండగా సునంద ఆ మాటలను ఎమోషనల్ గా వింటూ కనిపిస్తుంది. అప్పుడే ఆనందయ్య అఖిలతో మీ అమ్మ ఎక్కడ అని అడగటంతో ఏదో పని ఉందని ఇప్పుడే వెళ్లింది ఇక్కడేం పని అని అనుమానం పడతాడు.
మరోవైపు సౌదామిని దుర్గ భవాని వైపు కోపంగా చూస్తూ ఉండటంతో వెంటనే దుర్గాభవాని అక్కడ నిశ్చితార్థం అవుతుంది నేను వెళ్తాను అంటుంది. కానీ సౌదామిని ఎక్కడికి వెళ్ళేది లేదు అంటూ.. డబ్బు తీసుకొని చావు తెలివితేటలు చూపిస్తున్నావు అంటూ మాట్లాడుతుంది. నిశ్చితార్థం క్యాన్సిల్ చేయమని చెబితే ఏకంగా ఇక్కడికే తీసుకొచ్చావు కదా అని అంటుంది.
దాంతో భవాని నేను నా పిల్లలకు ఎంత చెప్పినా కూడా నా పిల్లని వినలేదు అని.. ఆ పెద్దింటి ఇంటికి మేము కోడళ్లగా వెళ్తాము అని ఇక్కడికి వచ్చారు అని.. వారితో పాటు నేను కూడా వచ్చాను అని కథలు అన్నీ చెబుతుంది. ఇక ఆ మాటలు నమ్మదు. దాంతో ఇప్పుడే వస్తాను అని దుర్గ భవాని అక్కడి నుంచి వెళ్తుంది.
మరోవైపు నిశ్చితార్థం పూజ జరుగుతూ ఉంటుంది. అందరూ సంతోషంగా కనిపిస్తుంటే ఆదిత్య మాత్రం డల్ గా ఉంటాడు. మరోవైపు అమృత ఆదిత్య ఇంటికి రావడానికి బయలుదేరుతుంది. ఇక పూజ జరుగుతుండగా అమృత లోపలికి వచ్చి ఆదిత్య అని గట్టిగా అరుస్తుంది. మరోవైపు భవాని డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తుంది.
ఇక డబ్బులు ఎలా ఉన్నాయో కూడా చూడలేదు అని మా పిల్లలు అలా అనేసరికి బ్యాగు తీసుకొచ్చాను అని అంటుంది. ఇక అమృత ఆదిత్యను పిలవటంతో అందరూ సైలెంట్ అవుతారు. ఆదిత్య టెన్షన్ పడుతూ కనిపిస్తాడు. వెంటనే అమృత ఆదిత్య కు నాకు నాలుగేళ్ల అని చెబుతూ ఉండగా ఫ్రెండ్షిప్ ఉంది అని అంటాడు ఆదిత్య.
తనకు ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటాను ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో నేరుగా ఇంటికి వచ్చేసింది అని ఇప్పుడే మాట్లాడేసి వస్తాను అని తనను బయటకు తీసుకొని వెళ్తాడు. సౌదామిని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తేనే మంచిది లేదంటే మీ ఇంటికి వెళ్ళేది మీరు కాదు మీ సేవలు అంటూ వార్నింగ్ ఇస్తుంది. ఇక పూజారి ఆదిత్య గురించి అడగటంతో నేను తీసుకొస్తాను అని అంటుంది అక్కడి నుంచి వెళ్తుంది సునంద.
ఇక సునంద రాకను చూసి సౌదామిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అమృత ఆదిత్యతో ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు.. నేను అస్సలు ఉండలేదు.. మన విషయం ఇంట్లో చెప్పు అని అంటుంది. అసలు ఎందుకు చెప్పట్లేవు అని అడుగుతుంది. ఎందుకంటే మా అన్నయ్యకు గౌరీ అంటే ఇష్టం.. గౌరీ లేకపోతే తను కోమాలోకి వెళ్తాడు.. మా అమ్మ ప్రాణాలతో ఉండదు.. అందుకే తప్పనిసరి నిర్ణయం తీసుకున్నాను అని అంటాడు. మరి నా పరిస్థితి ఏంటి నేనేం కావాలి నాకు చావు ఒకటే మార్గం అని అంటుంది. దాంతో ఇద్దరం కలిసి చనిపోదాం అని అంటాడు ఆదిత్య. వెంటనే అమృత ప్రేమించుకుంది కలిసి బతకడానికి కానీ కలిసి చావడానికి కాదు అని అంటుంది.