Trinayani June 29th: హాసిని తిలోత్తమాతో గబగబా తినేయకండి మునక్కాయ గొంతుకు గుచ్చుకుంటుంది అంటూ వెటకారం చేయటంతో తిలోత్తమా తనపై చిరాకు పడి అక్కడ నుంచి పంపిస్తుంది. విశాల్ విక్రాంత్ తో గురువుగారిని డ్రాప్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. ఇక అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. అక్కడ తిలోత్తమా, వల్లభ, సుమన మాత్రమే ఉంటారు.


ఇక సుమన తిలోత్తమా దగ్గరికి వచ్చి.. మా అక్క ఇలా జరుగుతుందని ముందే చెబితే బాగుండేది.. ఇలా జరగకపోయేది అని అంటుంది. దాంతో తిలోత్తమా వదిలేసేయ్.. నీకు పుట్టబోయే బిడ్డను చూడటానికి బతికానేమో అని అంటుంది. ఆ మాటలు విని వల్లభ అమ్మ సుమనకు బిస్కెట్ వేసింది అని అనుకుంటాడు.


మరోవైపు నయని గాయత్రి పాపతో ఎందుకలా చేశావు అని అడుగుతుంది. ఇక అక్కడే ఉన్న హాసిని, పావనమూర్తి తనేం చేసింది అని అడగటంతో.. తిలోత్తమా అత్తయ్యకు అలా జరగడానికి కారణం గాయత్రి పాప అని.. తను అక్కడున్న బట్టను లాగటం వల్ల గాయత్రి అమ్మ గారి ఫోటో కింద పడి గాజు ముక్క తిలోత్తమా అత్తయ్యకు తగిలింది అని అంటుంది.


దాంతో హాసిని నయనికి గాయత్రి పాప మీద అనుమానం వస్తుందేమో అని వెంటనే పాపని తీసుకొని అలా ఏమి జరగదు తనకేమి తెలుసు అంటూ అవాయిడ్ చేసి మాట్లాడుతుంది. అంతేకాకుండా తిలోత్తమా గురించి ఒక విషయం చెబుతుంటే వెంటనే పావన మూర్తి ఇంట్రెస్టింగ్ గా వింటాడు. ఇక నయని అవన్నీ చెప్పకు బాబాయ్ భయపడతాడు అని అక్కడినుంచి వెళ్ళిపోతుంది.


ఇక పావన తనకేమీ భయం లేదు అని ఏం జరిగిందో చెప్పమని హాసినిని అడుగుతాడు. వెంటనే హాసిని మీకు దయ్యం అంటే భయమా అని లైట్ ఆఫ్ చేస్తుంది. ఆ తర్వాత తను పావనను భయపడించడంతో దెబ్బకు భయపడి కింద పడిపోతాడు. ఆ తర్వాత గాయత్రి పాపను ఆడిపిస్తూ ఉండగా.. ఆ సమయంలో అందరూ అక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటారు.


ఇక నయని పేలాలు పిండి తీసుకొని రావటంతో.. సుమన తన అక్క ఏమో చేస్తుంది అని అంటుంది. ఇది పేలాల పిండి అంటూ దాని గురించి చెబుతుంది నయని. ప్రతి తొలి ఏకాదశికి నయని ఇవి చేస్తూనే ఉంటుంది కదా అని అంటాడు విశాల్. వెంటనే విక్రాంత్ తొలి ఏకాదశి గురించి అడగటంతో విశాల్ దాని గురించి వివరిస్తూ ఉంటాడు.


ఆ సమయంలో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రావటంతో సమయానికి వచ్చారు ప్రసాదం తీసుకోండి అని అనటంతో.. ప్రసాదం కోసం రాలేదని ఒకరిని అరెస్టు చేయడానికి వచ్చాను అని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఏం జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంటారు. ఇక చంద్రశేఖర్ కసిని హత్య చేసి చంపారు అని అనటంతో అందరూ మరోసారి షాక్ అవుతారు.


ఇక మీ ఫ్యామిలీలోనే ఎవరో చంపారు అని అనుమానంతో వచ్చాను అని అంటాడు. ఎవరా అన్నట్లుగా చర్చ చేస్తూ ఉంటారు. అందర్నీ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లాలి అని అనడంతో.. లైవ్ డిటెక్టర్ చేయండి అని విశాల్ అంటాడు. దానికోసమైన స్టేషన్ కి వెళ్ళాలి అలా వెళ్తే పరువు పోతుంది అని తిలోత్తమా అంటుంది.


వెంటనే నయని అలాకాకుండా పూర్వీకుల లాగా పిండి తోని పరీక్షిస్తే దోషి ఎవరు బయటపడతారు అని అనటంతో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అందరి నోట్లో ఎద్దులయ్యతో పిండి కొట్టిస్తాడు. ఇక లాలాజలం ఊరినట్లయితే వాళ్ళు తప్పు చేయనట్లు అని అంటాడు. దాంతో మొదట విక్రాంత్ ను పరీక్షించగా అతడు దోషి కాదని తెలుస్తుంది. ఇక వల్లభ దగ్గరకు రాగానే అనుమానంతో కనిపిస్తాడు.


Also Read: Rangula Ratnam June 28th: ‘రంగులరాట్నం’ సీరియల్: రేఖపై చేతులెత్తిన పనివాళ్ళు, పనిమనిషిగా మారిన స్వప్న?