Rangula Ratnam June 28th: ప్రసాద్ తన దగ్గర అర్చన ఉందనుకొని కోపంతో కనిపించగా వెంటనే.. డాక్టరమ్మ ఇప్పుడు నీకు తోడు అవసరం కాబట్టి పావని అనే నర్సును పెట్టాను అని చెబుతుంది. ఇక పూర్ణ కూడా.. తను నర్సు అన్నట్లుగా మాట్లాడటంతో శంకర్ ప్రసాద్ కి నమ్మకం వస్తుంది. డాక్టరమ్మ బయటికి రావడంతో వెంటనే రఘు డాక్టరమ్మ కాళ్ల మీద థాంక్స్ చెప్పుకుంటాడు.


మీరు మాకు కుటుంబానికి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉన్నారు అని అనటంతో.. వెంటనే డాక్టరమ్మ అర్చన నా కూతురు లాంటిది నా కూతురు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోలేను అని చెబుతుంది. ఆ మాట విని రఘు, సీత సంతోషపడతారు. పూర్ణ శంకర్ ప్రసాద్ దగ్గరికి టిఫిన్ తీసుకొని వస్తుంది. టిఫిన్ చేస్తేనే టాబ్లెట్లు వేసుకోవాలి అని అంటుంది. దాంతో ప్రసాద్ తనకు తినాలని లేదంటూ అసలు బతకాలని లేదు అని అంటాడు.


నమ్మిన వాళ్లే మోసం చేశారు అని అనటంతో వెంటనే పూర్ణ.. సొంత వ్యక్తులు ఎప్పుడు మోసం చేయరు.. మోసం చేసే వాళ్ళు సొంత వ్యక్తులు కారు అని తన మాటలతో ప్రసాద్ కి ధైర్యం ఇస్తూ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసిన వారిని తిరిగి ఎదిరించండని అనటంతో ఈ పరిస్థితుల్లో నేను ఎలా ఎదిరించగలను అని అంటాడు. మనసుపెట్టి చేస్తే అన్ని మార్గాలు తెలుస్తాయని.. మీ వెంట నేనున్నాను అంటూ ధైర్యం ఇస్తుంది.


ఇక నర్సింగ్ ఇంటికి చేరుకోగానే ఇంటి పని వాళ్లు నర్సింగ్ ను శంకర్ ప్రసాద్ ఆరోగ్యం గురించి అడుగుతూ ఉంటారు. ఇంకా ఎలా ఉంటుంది ఆ రేఖ మోసం చేసింది కదా ఆయనకు కళ్ళు లేకుండా చేసింది అని అంటాడు. ఇక ఆ మాటలు అన్ని రేఖ ఒక చోట నిలబడి వింటుంది. తను డబ్బు మనిషి అంటూ డబ్బు కోసం అయ్యగారిని మోసం చేసింది అంటూ.. మంచి మనసున్న అమ్మగారిని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టిందని.. అయ్యగారికి కళ్ళు లేకుండా చేసిందని రేఖను తిడతారు.


అప్పుడే రేఖ వచ్చి వారిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే వాళ్లు తిరిగి రేఖపై చెయ్యి ఎత్తుతారు. అంతేకాకుండా ఎదుటనే తనను బాగా తిడతారు. ఇక్కడ పని చేయము అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. ఇక హాస్పిటల్ కి చేరుకున్న నర్సింగ్ అక్కడ పూర్ణను చూసి అమ్మ అనటంతో ప్రసాద్ ఆశ్చర్యపోతాడు. పూర్ణ ఏమి చెప్పదు అని సైగలు చేయడంతో ఏమీ లేదు అంటూ తాము ఇంట్లో నుంచి ఉద్యోగం మానేసాము అని చెబుతాడు.


దాంతో శంకర్ మీరెందుకు ఉద్యోగం మానేశారు మీకు ఇబ్బంది కాదా.. మీరు లేని ఆ ఇంట్లో మేము ఉండలేము అని అంటాడు. అప్పుడే నర్సు వచ్చి డాక్టర్ పిలుస్తుంది అని పూర్ణ ను తీసుకెళ్తుంది. ఇక డాక్టర్ శంకర్ ప్రసాద్ కు చూపు రాదని.. అని ఎవరైతే కళ్ళను డొనేట్ చేస్తారో వాళ్ళ కళ్ళను పెట్టే అవకాశం ఉందని.. వీలైనంత తొందరగా పెడితే కళ్ళు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. దాంతో పూర్ణ బయటికి వచ్చి తన భర్తను చూస్తూ బాధపడుతుంది. తర్వాయి భాగంలో ఇంట్లో పనివాళ్ళు లేకపోయేసరికి రేఖ స్వప్నను పనిమనిషి లాగా మారుస్తుంది. అంతేకాకుండా సిద్దును గార్డెన్ కు నీళ్లు కొట్టమని చెప్పడంతో సిద్దు కోపంతో రగిలిపోతాడు.


Also Read: Krishnamma kalipindi iddarini June 28th: సునంద ఇంటికొచ్చి ప్రేమ విషయం చెప్పనున్న అమృత-నిప్పు పెట్టే ప్రయత్నంలో సౌదామిని?