కనకం చేసిన పనిని పెద్ద మనసుతో క్షమించమని కృష్ణమూర్తి చంపక్ లాల్ ని వేడుకుంటాడు. లేదు నన్ను టార్చర్ పెట్టినందుకు పోలీస్ కేసు పెడతానని బెదిరిస్తాడు. అయినా నువ్వు ఇంటి కాగితాలు పెట్టుకుని కదా అప్పు ఇచ్చావు. ఇల్లు మా నాన్న పేరు  మీద ఉంది, సంతకం పెట్టి డబ్బు తీసుకుంది మా అమ్మ. నువ్వే దొంగ సంతకాలు చేయించుకుని ఇల్లు కొట్టేయాలని చూస్తున్నావని కేసు పెడతానని అప్పు రివర్స్ లో బెదిరిస్తుంది. వడ్డీతో సహా అప్పు తీరుస్తానని కృష్ణమూర్తి మాట ఇస్తాడు. దీంతో రెండు నెలలు టైమ్ ఇస్తాను అప్పటిలోగా కట్టమని డెడ్ లైన్ పెట్టేసి వెళ్ళిపోతాడు. కావ్య పదవినోదం చేస్తూ ఒక ప్రశ్నకి సమాధానం దొరకలేదని  రాజ్ ని అడుగుతుంది. అన్నీ పెళ్లి, శోభనం, తొలిరాత్రి వంటి సమాధనాలకి సంబంధించి ప్రశ్నలు వేస్తుంది. వేటికీ కూడా సరైన సమాధానాలు చెప్పకుండా తిక్క తిక్కగా మాట్లాడతాడు.


Also Read: నీలాంబరి చేతిలో చావుదెబ్బ తిన్న అభిమన్యు- వేద, యష్ హనీ మూన్, ఉరి వేసుకోబోయిన మాళవిక


పదవినోదంలో పడి ఇద్దరూ ఒక దగ్గరకి చేరుకుంటారు. రాజ్ కావ్య మీద పడి బుక్ చూస్తూ పొరపాటున తన బుగ్గకి తగులుతాడు. దీంతో కావ్య కెవ్వుమని కేక పెడుతుంది. రుద్రాణి రాజ్ ని ఆఫీసుకి రెడీ చేస్తుంది. రాజ్ తన బ్రాంచ్ లో ఉండమని చెప్పాడు కాబట్టి తన స్థానం లాక్కోవడానికి ప్రయత్నించు. నువ్వు ఆ పనిలో ఉంటే రాజ్ ని ఇంట్లో సమస్యల్లో ఇరికిస్తాను. అటు ఇంట్లో పనులు చేసుకోలేక జుట్టు పీక్కోవాలి. అప్పుడే రాజ్ కంటే రాహుల్ బెటరని తాతయ్య కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలని రుద్రాణి కొడుక్కి సలహాలు ఇస్తుంది. అయితే ప్రతీ విషయంలో రాజ్ టప్పుడు నిర్ణయాలు తీసుకునే విధంగా చేస్తానని రాహుల్ అంటాడు. కొడుక్కి అల్ ది బెస్ట్ చెప్పి పంపిస్తుంది. రాహుల్ ఆఫీసుకి వచ్చి అమ్మాయిలని ఫ్లట్ చేసే పనిలో పడతాడు. వెళ్ళి ఎండీ సీట్ లో కూర్చుంటే ప్యూన్ వచ్చి అది రాజ్ సర్ సీటు అనేసరికి సీరియస్ అవుతాడు.


రాజ్ అప్పుడే ఆఫీసుకి రావడం చూసి నన్ను అసిస్టెంట్ గా పెట్టుకుని తప్పు చేశావని అనుకుంటాడు. ఒక అమ్మాయి వచ్చి డిజైన్స్ చూపించి వాటిని ఫైనలైజ్ చేసి రాజ్ కి చూపించాలని అంటుంది. కానీ రాహుల్ మాత్రం ఆ అవసరమే లేదని సూరజ్ కి తను సెలెక్ట్ చేసిన డిజైన్స్ పంపించమని చెప్తాడు. అవి చూసి సూరజ్ రాజ్ కి ఫోన్ చేసి ఇలాంటివి పంపించారు ఏంటని అడుగుతాడు. అవి చూసి రాజ్ కోపంగా శృతి దగ్గరకి వెళతాడు. నా పర్మిషన్ తీసుకోకుండా డిజైన్స్ ఎందుకు పంపించావని నిలదీస్తాడు. రాహుల్ వచ్చి నేనే చెప్పానని అంటాడు. ఎందుకు చేశావ్, వాళ్ళ బడ్జెట్ ఎంతో తెలుసా? నువ్వు చేసిన పని వల్ల 5 కోట్లు బిజినెస్ పోయేదని సీరియస్ అవుతాడు. ఎందుకు అంత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నావని రాహుల్ అంటే ఇక నుంచి తనకి తెలియకుండా ఏ పని చేయవద్దని అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఆఫీసులో జరిగిన పంచాయతీ రుద్రాణి ఇంట్లో పెడుతుంది. రాజ్ ఇంటికి వచ్చేసరికి అందరూ సీరియస్ గా ఉండటం చూసి ఏమైందని కావ్యకి సైగ చేసి అడుగుతాడు.


Also Read: బయటపడిన కనకం బండారం- రాహుల్ ని పడేసేందుకు స్వప్న ప్లాన్, ఇరుక్కున్న రాజ్


రుద్రాణి దగ్గరకి వెళ్ళి ఏమైందని అడుగుతాడు. నా కొడుకు ఏమైనా బానిస అనుకుంటున్నావా అందరి ముందు అలా అరిచావని నిలదీస్తుంది. కావ్య మొగుడ్ని వెనకేసుకోస్తూ మాట్లాడుతుంది. నువ్వు ఎందుకు జోక్యం చేసుకుంటావని అపర్ణ అంటే మావయ్యని అంటే మీరు ఊరుకుంటారా? అని ఎదురు ప్రశ్నిస్తుంది.