స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్), హవల్దార్ (సీబీఐసీ & సీబీఎన్) 2022 పరీక్ష కీలను జూన్ 28న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అందుబాటులో ఉంచింది. ఎంటీఎస్ పోస్టుల భర్తీకి ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షను మే 2-19, జూన్ 13-20 తేదీల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించింది.
అభ్యర్థులకు ఆన్సర్ కీపై ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. జూన్ 28 నుంచి జులై 7 వరకు రెస్పాన్స్‌షీట్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీపై అభ్యంతరాలు తెలిపేందుకు జూన్ 28న సాయంత్రం 5 గంటల నుంచి జులై 4న సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అభ్యంతరాలు తెలిపే ఒక్కో ప్రశ్నకు రూ.100 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, ఆన్సర్ కీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో మల్టీటాస్కింగ్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనవరి 18న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మల్టీ టాస్కింగ్ పోస్టులకు సంబంధించి మొదట 11,409 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ప్రకటించింది, అయితే 12,523 ఖాళీలు ఉన్నట్లు ఖరారు చేస్తూ సవరించిన పోస్టుల వివరాలను జనవరి 20న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. వీటిలో రీజియన్ల (18-25 వయసు) వారీగా 9,329 పోస్టులు ఉండగా.. 18-27 వయసు వారీగా 2665 పోస్టులు, ఇక హవిల్దార్ పోస్టులు 529 ఉన్నాయి. అంటే మొత్తం 12,523 ఉద్యోగాల్లో 11,994 మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఉండగా, 529 హవిల్దార్ పోస్టులున్నాయి.
పోస్టుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
కేంద్ర కొలువులకు నోటిఫికేషన్, 261 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రారంభం!
కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 261 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ జూన్ 24న ప్రారంభంకాగా.. జులై 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులవారీగా విద్యార్హతలు, ఇతర అర్హతలు నిర్ణయించారు. నియామక పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial