తులసి, నందు కేఫ్ ఓపెన్ చేసి కస్టమర్స్ కోసం ఎదురుచూస్తుంటే లాస్య వచ్చి గోల చేస్తుంది. బయటకి వెళ్లిపొమ్మని అరుస్తాడు. ఇంకా గట్టిగా అరువు కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేస్తున్నావో అందరూ చూస్తారని బెదిరిస్తుంది. నాకు ఇవ్వాల్సిన భరణం సంగతి ఏంటి? టైమ్ కి ఇవ్వకపోతే కోర్టుకి వెళ్తానని అంటుంది. గొడవ చేయవద్దని తులసి బతిమలాడుతుంది. ఆ మాట నాకు కాదు నా మాజీ మొగుడికి చెప్పు భార్యగా ఉన్నప్పుడే మాట వినలేదు ఇప్పుడు ఎందుకు వింటానని నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోతుంది. సంజయ్ డబ్బు తీసుకుని విక్రమ్ ని పిలుస్తాడు. డబ్బులు తీసుకెళ్ళను నువ్వే తీసుకెళ్లమని చెప్తాడు. మీ వదిన మాటలకి ఇలా అంటున్నావని అర్థం అయ్యిందని విక్రమ్ అంటాడు. సందు దొరికింది కదాని రాజ్యలక్ష్మి, సంజయ్ దివ్యని టార్గెట్ చేసి మాటలు అంటారు. నీలో చిన్న పిల్లతనం ఇంకా పోలేదని గాలి తీసేస్తాడు. కాసేపు దివ్య, సంజయ్ వాదులాడుకుంటారు.


Also Read: 'నేను నా భార్యని ప్రేమిస్తున్నా ముకుంద, నీ భర్తని నువ్వు ప్రేమించు' తెగేసి చెప్పిన మురారీ


తనకి కాన్ఫరెన్స్ ఉందని అబద్ధం చెప్పి తప్పించుకుంటాడు. స్టాఫ్ శాలరీ డబ్బులు కదా అని దివ్య అడిగితే అవును అంటాడు. సరే ఆ డబ్బులు నేను తీసుకెళ్తానని విక్రమ్ వాటిని తీసుకుని హాస్పిటల్ కి బయల్దేరతాడు. తులసి వాళ్ళు కేఫ్ లో కస్టమర్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఫలితం వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందేనని తులసి అంటుంది. అప్పుడే ఒకతను వచ్చి ఎవరూ లేకపోయేసరికి వెళ్లబోతుంటే తులసి అపుతుంది. తను ఒక ఈవెంట్ మేనేజర్ అని రెగ్యులర్ గా ఇలా బల్క్ ఆర్డర్స్ ఉంటాయని చెప్తాడు. దివ్య తన వెనుక ఏదో జరుగుతుందని అనుమానపడుతుంది. విక్రమ్ పూర్తిగా వాళ్ళ అమ్మ ట్రాప్ లో పడిపోయాడని అనుకుంటూ ఉండగా రాజ్యలక్ష్మి వస్తుంది.


రాజ్యలక్ష్మి: నా దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతున్నావా? నిన్న రాత్రి కూడా అత్యుత్సాహానికి పోయి విక్రమ్ తో తిట్లు తిన్నావ్ ఇంకా బుద్ధి రాలేదా? నేను చెప్పిన అబద్ధలు నమ్మి నీ మొగుడ్ని తీసుకొస్తావ్ అప్పుడు నమ్మడు. నేను తర్వాత నిజం చెప్పినా వాడు నమ్మడు. ఈలోపే విక్రమ్ ఆస్తి మొత్తం లాగేసుకుంటాను  


దివ్య: తల్లి ప్రేమని అడ్డం పెట్టుకుని కొడుకుని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది. విక్రమ్ చాలా మంచివాడు


రాజ్యలక్ష్మి: ఏంటి వేదాంతం మొదలు పెడుతున్నావ్, ఒడిపోయానని తెలుసుకుని కాళ్ళ బేరానికి వచ్చావు


దివ్య: నువ్వు ఏంటో ఏదో ఒక రోజు తెలిసేలా చేస్తాను అప్పుడు తొక్కేస్తాడు


రాజ్యలక్ష్మి: లాస్యకి ఫోన్ చేసి జరగబోయే కథ ఎంతో నువ్వే చెప్పమని అంటుంది.


లాస్య: నీ హాస్పిటల్ లో చేరి నీకు నరకం చూపించబోతున్నా బీ రెడీ


Also Read: ఆఫీసులో అందరి ముందు రాహుల్ కి రాజ్ వార్నింగ్- ఇంట్లో పంచాయతీ పెట్టిన రుద్రాణి


దివ్య:  విక్రమ్ అసలు ఒప్పుకోడు


లాస్య: మీ ఆయన నీ పక్కన ఉన్నంత వరకే హీరో మీ అమ్మ పక్కన నిలబడితే జీరో. బయటకి వెళ్ళిన మీ ఆయన ఇంకాసేపటిలో చిటపటలాడుతూ ఇంటికి వస్తాడు.


విక్రమ్ డబ్బు తీసుకుని కారులో వెళ్తూ ఉండగా పోలీసులు కారుని ఆపి సోదా చేయాలని అడుగుతాడు. కానిస్టేబుల్స్ చెక్ చేసి డబ్బులున్న బ్యాగ్ బయటకి తీసుకొస్తారు. ఈ క్యాష్ తనదేనని విక్రమ్ అంటాడు. కానీ ఇది మీదేనని సాక్ష్యం ఏంటని పోలీస్ అడుగుతాడు. ఇంత డబ్బు తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదని చెప్తాడు. ఇదేం కొత్త రూల్ తనెక్కడా చూడలేదని అంటాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇంత డబ్బు తీసుకెళ్లడం కరెక్ట్ కాదని డబ్బు తమకి ఇవ్వమని లేదంటే కేసు బుక్ చేస్తామని పోలీస్ అడుగుతాడు. విక్రమ్ వెంటనే రాజ్యలక్ష్మికి ఫోన్ చేస్తాడు. దారిలో పోలీసులు ఆపారని చెప్తాడు. ఆర్డర్ ఉంది ఆ డబ్బు పోలీసులకి ఇచ్చి వచ్చేయమని చలనా ఇస్తారు తీసుకుని ఇంటికి వచ్చేయమని చెప్తుంది. అదంతా పక్కనే ఉన్న దివ్య వింటూ రగిలిపోతుంది. అమ్మ మాట కాదని అంటే ప్రతిరోజూ ఇలాంటి ఇష్యూ జరుగుతూనే ఉంటుందని రాజ్యలక్ష్మి దివ్యని బెదిరిస్తుంది.