Madhuranagarilo June 29th: మధుర దంపతులు రాధకు కార్డు ఇవ్వడంతో శ్యామ్ ఆగిపోతాడు. ఇక కాలనీ వాళ్లందరికీ కార్డ్స్ పంచడానికి అని చెప్పి అక్కడి నుంచి మధుర దంపతులు బయలుదేరుతుండగా బయట ఉన్న శ్యామ్ ను చూసి నువ్వు కూడా లోపలికి రాలేకపోయావా అని అంటారు. ఇక వెంటనే శ్యామ్ నీతో ఒకటి చెప్పాలి అని అనటంతో.. కార్డ్స్ పంచుతున్నాము అందరికీ పంచాక అప్పుడు చెప్పు అని అంటుంది మధుర.


కార్డ్స్ పంచక ముందే చెప్పాలి అని అనటంతో మధుర ఆశ్చర్య పోతుంది. సరే విషయం ఏంటి చెప్పు అని అనటంతో.. అప్పుడే లోపల పండు స్పృహ కోల్పోయి కింద పడిపోవటంతో రాధ గట్టిగా అరుస్తుంది. దీంతో మధురవాళ్ళు రాధ అరుపులు విని లోపలికి పరిగెత్తడంతో అక్కడ పండు పడిపోయి ఉంటాడు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్ లోపలికి తీసుకెళ్లి చికిత్స చేస్తూ ఉంటుంది.


ఇక రాధ టెన్షన్ పడుతూ ఉండటంతో శ్యామ్ ఏం భయపడకు నవ్వుకుంటూ తిరిగి వస్తాడు అని అంటాడు. వాడికి ఏమైనా అయితే నేను ఉండలేను అని రాధ అనడంతో.. నీతో పాటు అమ్మ కూడా తట్టుకోలేదు అని అంటాడు శ్యామ్. మరోవైపు మధుర దేవుడు ముందు పండుకు ఏం జరగకూడదు అని దండం పెట్టుకుంటుంది. వాడికి ఏమైనా అయితే ఉండలేను అని అంటుంది.


ఆ తర్వాత నర్సు వచ్చి శ్యామ్ ను టాబ్లెట్స్ కి పంపించగా ఇక డాక్టర్ రాధ దగ్గరికి వచ్చి ఏం పరవాలేదు కాసేపట్లో స్పృహలోకి వస్తాడు అని చెబుతుంది. ఒకసారి లోపలికి రమ్మని చెప్పగా రాధ లోపలికి వెళ్తుంది. బాబుకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది. దాంతో రాధ చెప్పిన విషయం బట్టి.. బాబుకు లివర్ ప్రాబ్లం ఉందని నీకు కూడా తెలిసే ఉండొచ్చు కదా అని అంటుంది డాక్టర్.


దాంతో అవును అంటుంది రాధ. తన తండ్రి లివర్ పెడితేనే బాబు క్షేమంగా ఉంటాడు అని చెప్పటంతో.. తన తండ్రి ఇక్కడ లేడు అని చెబుతుంది రాధ. మరి ఇందాక వచ్చిన వ్యక్తి తన తండ్రి కాదా అంటే తమ ఇంటి ఓనర్ అని చెబుతుంది. అది కాకుండా మరో మార్గం ఉందని.. డెలివరీ టైంలో స్టెమ్సస్ ప్రిసాల్వ్ చేస్తున్నారు కదా మీరు చేసి ఉంటారు కదా అనడంతో ఏమో మేడం అంటుంది రాధ.


అదేంటి అంటూ డాక్టర్ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయటంతో తను తన బాబు కాదు అని చెబుతుంది. దాంతో ఆ మాటలు అన్ని సంయుక్త వింటుంది. అంటే పండు రాధ కన్న కొడుకు కాదేమో అని ఇక ఇప్పటివరకు శ్యామ్ తో నాకు పెళ్లి జరగదేమో అని టెన్షన్ ఉండే కానీ ఇప్పుడు నమ్మకం వచ్చింది అని అనుకుంటుంది. అదే సమయంలో మెడిసిన్స్ తీసుకొని శ్యామ్ అక్కడి నుంచి రావడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.


ఇక శ్యామ్ పండుకు ఎలా ఉందంట అని రాధను అడగటంతో పర్వాలేదు అని కాసేపట్లో స్పృహలోకి వస్తాడు అని చెబుతుంది. ఆ తర్వాత పండు, రాధ, శ్యామ్ ఇంటికి వెళ్ళగా మధుర వాళ్ళకు ఏం కాలేదు అని అంత బాగానే ఉందని చెబుతుంది రాధ. ఆ తర్వాత మధురవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు. ఇక పండు కన్న కొడుకు కాదు అని సంయుక్త అపర్ణకు చెప్పటంతో.. ఈ విషయం మధురకు తెలిస్తే వెంటనే వారి పెళ్లి చేసేస్తుంది అని అంటుంది.


అలా జరగనివ్వను అని రాధను ఆ ఇంట్లో నుంచి వెళ్లగొట్టేస్తాను అని అంటుంది సంయుక్త. ఆ తర్వాత రాధ ఇంటికి వెళ్లి మొదట డొంక తిరుగుడు మాటలు మాట్లాడి ఆ తర్వాత శ్యామ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అని.. నువ్వు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలి అని వార్నింగ్ ఇస్తుంది. తర్వాయి భాగంలో రాధ పండును తీసుకొని లగేజ్ పట్టుకొని వెళ్తుండగా మధురవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతారు.


ఊరికి వెళ్ళిపోతున్నాను అనడంతో పెళ్లి తర్వాత చూసుకోవచ్చు కదా పనులు అని అంటారు. అప్పుడే శ్యామ్ నిన్ను ఎవరు పంపించారు.. నిన్ను ఎవరు బెదిరించారు అని సీరియస్గా అడుగుతాడు. ఇక అక్కడే ఉన్న సంయుక్త భయపడుతూ కనిపిస్తుంది.


Also Read: Trinayani June 29th: కసి హత్యకేసులో తిలోత్తమా ఫ్యామిలీపై అనుమానం-పిండి పరీక్షతో నిజం బయటపడనుందా?