అక్కినేని నాగచైతన్య ‘లవ్ స్టోరీ’ మూవీ విడుదల తేదీని ప్రకటించగానే… నేచురల్ స్టార్ నాని ‘టక్ జగదీశ్’ మూవీ రిలీజ్ పై తన మనసులోని మాట బయట పెట్టాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఓటీటీలో విడుదల కాబోతోందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టకుండా, తాను మరోసారి క్రాస్ రోడ్స్‌లో నిలబడినట్టు అయ్యిందనే ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ సినీ అభిమానిగా అందరితో కలిసి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడమే తనకు ఇష్టమని, ‘టక్ జగదీశ్’ మూవీని కూడా థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీశామని చెప్పాడు.
కానీ కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పూర్తిగా థియేటర్లు తెరుచుకోకపోవడం, నిర్మాతలకు ఉన్న ఇబ్బందులు… వీటన్నింటి దృష్ట్యా నిర్ణయాన్ని వారికే వదిలేశానని అన్నాడు. అయితే… నిర్మాతలు మనసు మార్చుకుని థియేట్రికల్ రిలీజ్‌కు అంగీకరిస్తే… మొదట ఆనందించేది తానే భావనను నాని ఈ లేఖలో ఇన్ డైరెక్ట్ గా తెలిపాడు. నిర్మాతలు ఏ నిర్ణయం తీసుకున్నా, తాను సహకరిస్తానని, ఫైనల్‌గా నిర్ణయాధికారం ప్రొడ్యూసర్స్‌కే ఉంటుందని అన్నాడు. ‘టక్ జగదీశ్’ మూవీ ఎలా విడుదలైనా తన సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పాడు నాని. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ‘అమెజాన్ ప్రైమ్’ ‘టక్ జగదీష్’ చిత్ర నిర్మాతలతో పెద్ద మొత్తంలో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఓటీటీ ధర, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్ మొత్తం కలుపుకుంటే.. ‘టక్ జగదీష్’ సినిమా కాస్తంత లాభానికే అమ్ముడుపోయినట్లు సమాచారం.
‘టక్ జగదీష్’తో పాటు శేఖర్ కమ్ముల తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’ కూడా ఓటీటీలోనే విడుదల అవుతుందని అంతా భావించారు. అయితే.. తమ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లు ‘లవ్‌స్టోరి’ టీం ప్రకటించింది. తాజాగా.. సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్టుగా కూడా విడుదల తేదీని ప్రకటించింది. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నాక తెలుగులో విడుదలైన తొలి సినిమా ‘ఎస్‌ఆర్ కల్యాణ మండపం’. థియేటర్లకు ప్రేక్షకులు వచ్చి సినిమాలు చూస్తారన్న నమ్మకాన్ని కలిగించింది ఈ మూవీ.
అయితే గతేడాది కూడా కరోనా కారణంగా… నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన ‘వి’ మూవీ ఓటీటీలోనే విడుదల చేశారు. కానీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. అయితే… ఈ ఏడాది ప్రారంభంలో దాన్ని తిరిగి థియేటర్లలో విడుదల చేసినా స్పందన కరవైంది. దీంతో ఓటీటీ కన్నా ‘టక్ జగదీశ్’ను థియేటర్లలో ముందుగా విడుదల చేస్తేనే బెటర్ అని భావనతో నాని ఉన్నట్టు తెలుస్తోంది. మరి నాని లెటర్ తర్వాత నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి....
Also Read: Love Story: వినాయక చవితి నాడు ‘లవ్ స్టోరీ’ చెప్పనున్న నాగచైతన్య , సాయిపల్లవి
Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్
Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?
Also Read: తగ్గేదే లే అంటున్న లీకు వీరులు.. తగ్గిస్తామంటున్న బన్నీ
Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!