రేంజ్ కి తగ్గట్టు మెయింటైన్ చేసే విషయంలో సెలబ్రెటీలు అస్సలు వెనకడుగు వేయరు. కార్ల విషయానికొస్తే ఇప్పటికే సెలబ్రెటీలు బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్‌, మెర్సిడేస్‌, ఆడి లాంటి కార్లను తమ గ్యారేజ్ లో చేరుస్తుంటారు. ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖరీదైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. ఈ కారును పొందిన దేశంలోనే తొలి వ్యక్తి ఈయనే కావడం విశేషం. జూనియర్‌ ఎన్టీఆర్‌కి ఉన్న కార్ల క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అత్యంత ఖరీదైన కార్లు (రూ.1.22 కోట్లకు పైగా ఉండే) పోర్స్చే 718 కేమన్, (రూ.38.04లక్షలపైగా) ఉండే స్కోడా సూపర్బ్‌, రూ.2.10 కోట్లు విలువజేసే రేంజ్‌రోవర్‌ కార్లు ఆయన దగ్గర ఉండగా.. తాజాగా భారత్‌లో విడుదలైన తొలి లాంబోర్గిని యూరస్‌ గ్రాఫైట్ క్యాప్సూల్ ఎడిషన్ కారు (ధర రూ.3.16 కోట్లు) బెంగళూరు నుంచి ఆయన ఇంటికి వచ్చినట్లు బుధవారం ఆటోమోబిలి ఆర్డెంట్‌ అనే కార్ల సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించింది. 


ఇండియాలో లాంచ్‌ అయిన తొలి రోజే ఈ కారును ఎన్టీఆర్‌ బుక్‌ చేసుకున్నాడు. రూ.3.16 కోట్లతో కొనుగోలు చేసిన లంబోర్గినీ ఊరుస్‌ బుధవారం ఇటలీ నుంచి శంషాబాద్‌ ఎయిర్ పోర్టుకు ఆ తర్వాత తారక్‌ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీకి చెందిన వోక్స్‌ వాగన్‌ కంపెనీ అనుబంధ సంస్థయే ‘లంబోర్గినీ’. ప్రపంచ వ్యాప్తంగా గతేడాది ఈ కార్లను ఉత్పత్తి చేయగా.. ఇండియాలో సోమవారం రోజున ఇది అధికారింగా లాంచ్‌ అయ్యింది. 




ఈ కారు ప్రత్యేకత ఏంటంటే.. 
3.16 కోట్ల రూపాయల విలువ చేసే ఈ కారు ఫుల్ ఆటోమేటేడ్‌ అట. ఇక బుల్లెట్ ఫ్రూవ్ అని కూడా చెబుతున్నారు. 200 కిలో మీటర్ల వేగంతో వెళుతున్నప్పటికీ ఎలాంటి కుదుపులు ఉండవట. పైగా 2 నిమిషాల్లో 200 స్పీడుకు వెళ్లి.. మళ్లీ 1 నిమిషంలో 10 కిలోమీటర్లు తగ్గించినా ఎలాంటి ఒడిదొడుకులకు లోను కాదట. అంతేకాదు ఇందులో ఆటో సెన్సర్ మిషన్స్ కూడా ఉండటంతో ఎదురుగా వాహనాలు ఉంటే అలర్ట్ చేస్తుందట. ఆటోమేటేడ్‌ కారు తాళాలు ఈ కారు ప్రత్యేకత. ఎలాంటి ప్రమాదం జరిగిన కారు అద్దాలు, కానీ డోర్‌లు కానీ అంత ఈజీ తెరచుకోవట. ఫుల్లీ ఆటోమెటెడ్‌, సెఫ్టీతో లంబోర్గినిని తయారు చేశారు.  దీంతో ఎన్టీఆర్‌ లంబోర్గినీ ఊరుస్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పటికే ఎన్టీఆర్‌ గ్యారేజ్‌‌లో 20పైగా కార్లు ఉన్నాయట. 


ఈ ఏడాది ఆరంభంలో వివిధ రంగుల్లో ఈ కారు విడుదలైంది. ఇటీవల ప్రభాస్‌ రూ. 6 కోట్లు విలువజేసే లంబోర్గిని ‘అవెంటిడోర్‌ రోడ్‌స్టర్‌’, బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌సింగ్‌ లంబోర్గిని యూరస్‌ పర్ల్‌ ఎడిషన్‌ కార్‌ను కొనుగోలు చేశారు.