కరోనా కారణంగా వాయిదాపడిన 2021-22 విద్యా సంవత్సరాన్ని పూర్తి చేసేందుకు ఏపీ విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో తరగతుల నిర్వహణ సమయాన్ని పెంచింది. పాఠశాలల ప్రారంభానికి ముందు గంటా 45 నిమిషాలు, తరగతులు ముగిసిన తర్వాత గంటా 15 నిమిషాలను పెంచి ఉన్నత పాఠశాలల మొత్తం సమయాన్ని 10 గంటలు చేశారు. పెంచిన ఈ 3 గంటల సమయాన్ని పాఠ్యాంశాల బోధన, విరామం, ఇతర కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్‌ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేలా పాఠ్య ప్రణాళికను సిద్ధంచేశారు. 


విద్యా సంవత్సరం 188 రోజులు


గతంలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 9.45 గంటల నుంచి సాయంత్రం 4.45 వరకు ఉండేవి. గతేడాది కరోనా కారణంగా ఈ సమయాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటలకు మార్చారు. తాజా ఈ సమయాన్ని సహ పాఠ్య కార్యక్రమాల కోసం పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో 188 రోజులు పాఠశాలలు పనిచేస్తాయని తెలిపింది. ఏప్రిల్‌ 30 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అనంతరం వేసవి సెలవులు అని విద్యాశాఖ తెలిపింది. 


Also Read: IND vs ENG : సూర్యకుమార్‌, పృథ్వీ షా... వాట్ ఏ కామెడీ టైమింగ్ 


నో బ్యాగ్ డే, నీటి గంట అమలు 


6-10 తరగతుల సమ్మెటివ్‌-1 పరీక్షను డిసెంబరు 27 నుంచి జనవరి 7 వరకు, 6-9 తరగతుల సమ్మెటివ్‌-2 పరీక్ష ఏప్రిల్‌ 18 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. సెప్టెంబరు, నవంబరు, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫార్మెటివ్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రతి నెలా మొదటి, మూడో శనివారం ‘నో బ్యాగ్‌ డే’, నీళ్లు తాగేందుకు నీటి గంట ఇందుకోసం 5 నిమిషాల విరామం కేటాయించారు. విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచేందుకు ప్రతి రోజు ‘చదవడం మాకిష్టం’ కార్యక్రమం నిర్వహణకు ఒక పీరియడ్ కేటాయించారు. 9, 10 తరగతుల విద్యార్థులకు ప్రతి శుక్రవారం 8వ పీరియడ్‌లో ‘కెరీర్‌ గైడెన్స్‌’పై అవగాహన కల్పించనున్నారు. వారంలో ఒక రోజు పాఠశాల ఆరోగ్య కార్యక్రమం, ప్రముఖ దినోత్సవాలు, సామూహిక పఠనం కార్యక్రమాలు నిర్వహించాలని విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ తో తెలిపింది.  


Also Read: Horoscope Today: ఈ రాశుల వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమే… ఆ ఐదు రాశులవారు ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందుతారు….


ఇక 10 గంటల బడి


ఉన్నత పాఠశాలల్లో మొత్తం 10 గంటలు తరగతులు నిర్వహించనున్నారు. ఉన్నత పూర్వ, ఉన్నత, ఉన్నత ప్లస్ బడులు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేయనున్నాయి. శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలు(పీపీ-1,2) ఉదయం గం.9.05ల నుంచి సాయంత్రం గం.3.30ల వరకు పనిచేయనున్నాయి. ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ పాఠశాలలు ఉదయం గం.8 నుంచి సాయంత్రం గం.4.30 వరకు పనిచేయనున్నారు. 


Also Read: Petrol-Diesel Price, 19 August: పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు.. మీ నగరంలో తాజా ధరలివే..


పండగ సెలవులు 


ఏపీలో ప్రభుత్వ పాఠశాలలకు విద్యాశాఖ పండగ సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 11-16 వరకు దసరా సెలవులు, దీపావళికి నవంబర్ 4న, క్రిస్మస్(మిషనరీ బడులకు) డిసెంబర్ 23-30 వరకు సెలవులు ఇస్తారు. జనవరి 10-15 వరకు సంక్రాంతి సెలవులు, ఉగాది ఏప్రిల్ 2న సెలవు ఇస్తారు.


Also Read: Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు... చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు