Triptii Dimris Instagram followers : నటి త్రిప్తి దిమ్రి. ‘యానిమల్’ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఈ పేరు మార్మోగిపోతోంది. సందీప్‌ రెడ్డివంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఆమె నటన, ఇంటిమేట్ సీన్స్ అందరినీ అలరించాయి. ప్రస్తుతం త్రిప్తికి వరుస అవకాశాలు వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా విడుదల తర్వాత ఆమె ఇన్ స్టా ఫాలోవర్స్ ఓ రేంజిలో పెరిగిపోతున్నారు.  


అప్పుడు 6 లక్షలు, ఇప్పుడు 31 లక్షలు


‘యానిమల్‌’ మూవీ డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు మందు ఆమె ఇన్ స్టాలో పెద్దగా ఫాలోవర్స్ లేరు. నవంబర్ ఎండింగ్ వరకు ఆమెకు కేవలం 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ సినిమా విడుదలయ్యాక త్రిప్తి ఇన్‌ స్టా ఫాలోవర్స్ పెరిగే తీరును చూసి అందరూ ఆశ్యర్చపోతున్నారు. ప్రస్తుతం ఆమె ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా 31 లక్షలు దాటింది.  2015లో త్రిప్తి ఇన్‌ స్టా అకౌంట్ ను ఓపెన్ చేసింది. అప్పటి నుంచి తన లేటెస్ట్ ఫోటోలు, రీల్స్ ను నెటిజన్లతో పంచుకుంటుకుంది. ప్రస్తుతం ఆమె పోస్టులకు నెటిజన్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.


అవసరం కాబట్టే ఆ సీన్స్ చేశా- త్రిప్తి


ఇక ‘యానిమల్’ సినిమాలో ఇంటిమేట్ సీన్స్ పై పలు విమర్శలు కూడా వచ్చాయి. వీటిపై తాజాగా త్రిప్తి  స్పందించింది. సినిమాకు ఆ సన్నివేశాలు కచ్చితంగా ఉండాలి కాబట్టే చేయాల్సి వచ్చిందని చెప్పింది. శృంగార సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపింది. “‘యానిమల్‌’ సినిమా గురించి నాకు చెప్పే సమయంలోనే ఈ సినిమాలో శృంగార సన్నివేశాల గురించి దర్శకుడు నాకు చెప్పారు. నాకు, రణబీర్‌ కు మధ్య ఇంటిమేట్ సీన్స్ ఉంటాయన్నారు. ఈ సీన్లు చేయడానికి ఏమైనా అభ్యంతరం ఉంటే చెప్పాలన్నారు.  ఆయన ఈ సినిమా కథ చెప్పాక, ఆ సీన్లు అవసరమని నాకు అర్థం అయ్యింది. అందుకే, ఓకే చెప్పాను. ఈ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలో దర్శకుడు చాలా కేర్ తీసుకున్నాడు. సెట్ లోకి ఎవరినీ రానివ్వలేదు. రణబీర్, నేను, దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ మాత్రమే ఉన్నాం” అని వెల్లడించింది.  అటు ఈ సీన్ల గురించి వస్తున్న విమర్శలపైనా ఆమె స్పందించింది. “నెట్ ఫ్లిక్స్ మూవీ 'బుల్ బుల్'లో తాను చేసిన రేప్ సీన్‌తో పోలిస్తే ఇదేం గొప్పగా లేదన్నారు. ఆ సీన్ చేయడం పెద్ద సవాల్ గా అనిపించింది. కానీ ‘యానిమల్’లో అలాంటి సీన్స్ చేయడం కష్టం కలిగించలేదు" అని చెప్పుకొచ్చింది.


‘యానిమల్’ మూవీ గురించి..


దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన రెండో బాలీవుడ్ మూవీ ‘యానిమల్’. ఈ చిత్రంతో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించారు. అనిల్‌ కపూర్‌ రణబీర్ తండ్రి పాత్ర పోషించగా, బాబీ డియోల్ విలన్ గా కనిపించారు. డిసెంబర్‌ 1న విడుదలైన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే రూ. 1000 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉంది. అటు ఈ మూవీకి సీక్వెల్‌ గా ‘యానిమల్‌ పార్క్‌’ను తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.






Read Also: ‘యానిమల్’లో కొడుకు పాత్రలో బ్రహ్మానందం, తండ్రి ఎవరో తెలుసా? ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు