సౌత్ కొరియన్ చిత్రాలు(Korea web series), వెబ్ సీరిస్, టీవీ షోస్ (K-Dramas) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. సరికొత్త కథాంశాలతో కొరియన్ మేకర్స్ రూపొందించే థిల్లర్ డ్రామాలను సినీ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. చూస్తున్నంత సేపు టీవీలకు ఇట్టే కట్టిపడేస్తాయి. సైన్స్ ఫిక్షన్, రొమాన్స్, క్రైమ్, పీరియాడికల్ ఒకటేమిటీ అన్ని జానర్లలో తెరకెక్కిన సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు  అద్భుతంగా అలరిస్తాయి. చాలా వెబ్ సిరీస్ లు పరిమిత సంఖ్యలో ఎపిసోడ్ లను కలిగి ఉంటాయి. మంచి నిర్మాణ విలువలు, ఆకట్టుకునే కథాంశాలు,  పాత్రలు,  ప్రేక్షకుల మధ్య భావోద్వేగ సంబంధాన్ని పెంచుతాయి. అందుకే, ఒక్కసారి కే డ్రామాలకు అలవాటైతే.. వదిలిపెట్టరు. చాలా వరకు ప్రజాదరణ పొందిన సిరీస్ లు రొమాన్స్ పై  ఆధారపడి ఉన్నప్పటికీ, కొన్ని థ్రిల్లర్స్ కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  


1. Little Women (2022)


‘లిటిల్ ఉమెన్’  ఇటీవలి థ్రిల్లర్ డ్రామాలలో ఒకటి. మంచి ప్రేక్షకాదరణ పొందింది.  ఆరు వారాల పాటు ప్రతి వారాంతంలో రెండు ఎపిసోడ్‌లు విడుదలయ్యాయి. డబ్బు సంపాదించడం కోసం అక్కా చెల్లెళ్లు చేసే ప్రయత్నాలను ఈ డ్రామాలో అద్భుతంగా చూపించారు.  దురాశ కారణంగా ఏర్పడే సమస్యలను కళ్లముందు ఉంచారు. ఉద్రిక్త మలుపు తిరిగిన డ్రామాలో నటీనటులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ సీరిస్ Netflixలో అందుబాటులో ఉంది.


2. Through the Darkness (2022)


ఇది కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది.  కొరియా మొదటి ప్రొఫైలర్ డిటెక్టివ్ అయిన క్వాన్ ఇల్-యోంగ్, అతడి ఉద్యోగ శిక్షణ గురించి ఇందులో చూపిస్తారు. 2018లో, క్వాన్ తన కేసుల గురించి ఒక పుస్తకాన్ని ప్రచురించారు. దాని ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ డ్రామాలో వాస్తవ అనుభవాలు, సంఘటనలే ఎక్కువగా ఉంటాయి. నిజ జీవితంలో జరిగిన కథలు కావడంతో ప్రేక్షకులు బాగా చూశారు. ఈ సీరిస్ MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది. 


3. Beyond Evil (2021)


దక్షిణ కొరియాలోని ఒక చిన్న గ్రామంలో జరిగిన వరుస హత్యల చుట్టూ కథాంశం తిరుగుతుంది. అత్యంత అనుభవజ్ఞుడైన, బాగా ఇష్టపడే పోలీసు అధికారులలో ఒకరు ప్రధాన డిటెక్టివ్. ఆయన తన తెలివి తేటలతో తన సహ సిబ్బందితో కలిసి ఎలా కేసుల మిస్టరీని పరిష్కరించారు అనేది ఇందులో చూపించారు. ఈ సీరిస్ Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.  


4. Hell Is Other People (Strangers from Hell)


ఇది  ఈడెన్ స్టూడియో, డార్మిటరీలో జరిగిన వింత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.  ఇమ్ సి వాన్, లీ డాంగ్ వూక్  ఈ డ్రామాలో ప్రధాన పాత్రలు పోషించారు. ఇద్దరు యువకులు వారి నివాస ప్రాంతాల్లో జరిగే వింత పరిస్థితుల ఆధారంగా   ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ను రూపొందించారు.  


5. The Penthouse: War In Life


కొరియాలో అత్యంత ప్రజాదరణ పొందిన డ్రామాలలో ఇది ఒకటిగా నిలిచింది.  డ్రామా థ్రిల్లర్, మిస్టరీ, సస్పెన్స్, క్రైమ్, రివెంజ్‌ల సహా అన్ని అంశాలను ఈ సిరీస్ టచ్ చేస్తుంది. ఒక అపార్ట్ మెంట్ లో నివసించే సంపన్న కుటుంబాల నడుమ సరిగే సంఘటనల ఆధారంగా ఈ డ్రామా రూపొందించారు.  ఇందులోని ప్రతి పాత్రకు భయంకరమైన గత అనుభవం ఉండటం విశేషం.   


6. Extracurricular


ఈ పది-ఎపిసోడ్ డ్రామాలో  ప్రధాన పాత్ర ఓహ్ జి సూ అనే అద్భుతమైన విద్యార్థి. జి అకడమిక్ రికార్డు ఆకట్టుకుంటుంది. కానీ, కొన్ని ఎక్స్‌ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేస్తుంటాడు. కొన్ని కారణాలతో ఇతర విద్యార్థులను  అంతం చేయడానికి ఏమైనా చేస్తాడు. అత్యంత కిరాతకంగా హతమార్చుతాడు. అతడి కిరాతకాలకు అసలు కారణం ఏంటనేది ఈ సిరీస్ లో చూపించారు.   


7. Taxi Driver


తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఓ వ్యక్తి డీలక్స్ క్యాబ్ సర్వీస్‌ను అద్దెకు  తీసుకుంటాడు. దీని ద్వారా తన శత్రువులను ఒక్కొక్కరిగా లేకుండా చేస్తాడు. హింస, బ్లాక్‌ మెయిలింగ్ సహా పలు అంశాలతో ఈ డ్రామా నిండి ఉంటుంది.  


8. Mouse


కొరియాలోని అత్యంత ప్రసిద్ధ హంతకులలో ఒకడైన సీరియల్ కిల్లర్‌ కథ ఆధారంగా ఈ డ్రామాను తెరకెక్కించారు. సీరియల్ కిల్లర్ ను పట్టుకునేందుకు  పోలీసు డిటెక్టివ్ కొనసాగించే వేటను ఇందులో చూపించారు.  అనుమానితుడి కోసం వెతుకుతున్న సమయంలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది కథ.   


9. Signal


‘సిగ్నల్’ అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్.  పార్క్ హే-యంగ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఉండగా,  ఒక మహిళ క్లాస్‌మేట్‌ని కిడ్నాప్ చేయడాన్ని చూస్తాడు.  ఆమె తరువాత చనిపోయింది. అతను చూసిన దాని గురించి పోలీసులకు తెలియజేయడానికి అతను ప్రయత్నించినప్పటికీ, అసలు నిందితుడిని పోలీసులు పట్టుకోలేకపోతారు.  కొంతకాలం తర్వాత హే-యంగ్ పోలీసు అధికారిగా మారినప్పుడు, మాజీ క్లాస్‌మేట్ మరణంపై దర్యాప్తు చేస్తాడు. చివరకు అసలు నిందితుడిని పట్టుకుంటాడా?లేదా? అనేది? ఇందులో చూపించారు.    


Read Also: మన హీరోల్లో ఇన్‌స్టాగ్రామ్‌ కింగ్ ఎవరు? ఎవరికి ఎంతమంది ఫాలోవర్స్?


Join Us on Telegram: https://t.me/abpdesamofficial