మళ్ళీ ప్రభాస్ తో కలిసి నటిస్తారా? - డార్లింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్!
రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జంటగా నటించిన తాజా చిత్రం 'చంద్రముఖి 2' సెప్టెంబర్ 28న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ యూనిట్ వరుస ప్రమోషన్స్ ని ప్లాన్ చేస్తోంది. సెప్టెంబర్ 23న 'చంద్రముఖి 2' ప్రమోషన్స్ కోసం బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనోత్ హైదరాబాద్ కి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ప్రభాస్ తో కలిసి ఏక్ నిరంజన్ 2 సినిమా చేసే అవకాశం వస్తే చేస్తారా? అనే ప్రశ్న కంగనకు ఎదురవగా, దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. అలాగే ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


షారుక్, సల్మాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రామ్ పోతినేని!
ఉస్తాద్ హీరో రామ్ పోతినేని - బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన 'స్కంద'(Skanda) సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. రిలీజ్ టైం దగ్గర పడడంతో 'స్కంద' ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే రామ్ తాజాగా స్కంద హిందీ ప్రమోషన్స్ కి హాజరయ్యారు. ఈ ప్రమోషన్ లో రామ్ షారుక్, సల్మాన్ ఖాన్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రామ్ కి తెలుగులో మాత్రమే కాదు హిందీలోనూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ సినిమాలు హిందీలో డబ్బింగ్ చేస్తే వాటికి మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే రామ్ కి హిందీలో డబ్బింగ్ చెప్పే సంకేత్ మాత్రే స్కంద ప్రమోషన్స్ లో భాగంగా  ఇంటర్వ్యూ చేశాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


నవంబర్ నుంచి మార్చ్ కి షిఫ్ట్ అయిన 'సలార్' రిలీజ్?
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'సలార్' మూవీ రిలీజ్ ఈ ఏడాది లేనట్టేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న 'సలార్' ఏకంగా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు 'సలార్' సినిమాని నిర్మిస్తున్న హోంబలే ఫిలిమ్స్ తమ డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చిందన్న వార్త ప్రస్తుతం ట్రేడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది. సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అయిన సలార్ ని నవంబర్ లేదా డిసెంబర్ నెలల్లో విడుదల చేయాలనుకున్న మాట వాస్తవమేనని, అయితే పోటీతోపాటు సోలో రిలీజ్ దక్కే అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆ ఒత్తిడిని తీసుకోకుండా వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేయాలని మేకర్స్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


మరో బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పూజా హెగ్డే - మొదటిసారి ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన పూజ హెగ్డే కి కెరియర్ పరంగా గత కొంతకాలంగా బ్యాడ్ టైం నడుస్తుంది. సుమారు రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్స్ గా నిలుస్తున్నాయి. తెలుగులోనే అనుకుంటే బాలీవుడ్ లో చేస్తున్న సినిమాలు కూడా ఆమెకి ఆశించిన స్థాయి సక్సెస్ ని అందించలేకపోతున్నాయి. మొన్నటి వరకు సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ అంటే అందరూ పూజ హెగ్డే పేరునే చెప్పేవారు. స్టార్ హీరోలు సైతం ఏరి కోరి ఈ హీరోయినే కావాలని అనేవారు. కానీ రెండేళ్ల నుంచి పూజ హెగ్డే కెరియర్ చూసుకుంటే ఒక్క హిట్టు కూడా లేదు. 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' తర్వాత పూజ హెగ్డే నటించిన ఆరు సినిమాలు ప్లాప్స్ గా నిలిచాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కేరళలో 'లియో' మూవీని బ్యాన్ చేస్తున్నారా? - ట్రెండింగ్ లో #Kerala Boycott Leo?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కి సౌత్ ఇండియా వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలను తెలుగులో డబ్ చేసి మెల్లమెల్లగా టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఏర్పరచుకున్నారు విజయ్. అటు కేరళలోనూ ఈ హీరోకి మంచి మార్కెట్ ఉంది. అయితే విజయ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ 'లియో'(Leo) మూవీని ఇప్పుడు కేరళ ఆడియన్స్ బాయికాట్ చేసేందుకు సిద్ధమైనట్లు ఓ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ట్విటర్ లో మీడియాలో #Kerala Boycott Leo అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)