గం గం గణేశా'లో సాంగ్ విడుదల చేసిన రష్మిక - 'ప్రేమిస్తున్నా' కంటే పెద్ద హిట్ కావాలి ఆనందా
'బేబీ'తో బాక్సాఫీస్ బరిలో యువ కథానాయకుడు, విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ భారీ విజయం అందుకున్నారు. ఆ ఒక్కటి మాత్రమే కాదు... ఆ సినిమాతో నటుడిగా విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'గం గం గణేశా'. 'గం..గం..గణేశా' సినిమాలో ఆనంద్ దేవరకొండ జోడీగా 'పెద కాపు 1' ఫేమ్, నార్త్ ఇండియన్ బ్యూటీ ప్రగతి శ్రీవాత్సవ నటిస్తున్నారు. హై - లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఉదయ్ శెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో తొలి పాటను ఈ రోజు రష్మిక విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రణ్ బీర్, సాయి పల్లవి, యశ్ కాంబోలో 'రామాయణం' - 2024లో షూటింగ్ స్టార్ట్
బాలీవుడ్ ఫిలిం మేకర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన 'ఆదిపురష్' ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. దర్శకుడు ఓం రౌత్ రామాయణ కథకు మోడ్రన్ టచ్ ఇచ్చి అనవసరమైన గ్రాఫిక్స్, వీఎఫెక్స్ వాడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో 'ఆదిపురుష్' దెబ్బకి మళ్లీ ఏ దర్శకుడు రామాయణం జోలికి వెళ్లడేమో అనుకుంటున్న సమయంలో మరోసారి బాలీవుడ్ లో అదే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈసారి బాలీవుడ్ గ్రేట్ ఫిలిం మేకర్ నితీష్ తివారి రామాయణాన్ని విజువల్ వండర్ గా తెరకెక్కించబోతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'డుంకీ', 'సలార్'లో దేన్ని ఎంచుకుంటారు? 'మాస్టర్' బ్యూటీ డేరింగ్ ఆన్సర్!
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. #Ask Malavika పేరుతో అభిమానులను తమకిష్టమైన ప్రశ్నలను అడగమని చెబితే ఓ అభిమాని 'డుంకి, 'సలార్' వీటిలో ఏ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని అడిగితే, మాళవిక ఆ అభిమానికి అదిరిపోయే రిప్లై ఇచ్చింది. కోలీవుడ్ లో దళపతి విజయ్ సరసన 'మాస్టర్' సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది మాళవిక. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో ఒక్క సినిమాతోనే ప్రభాస్ కి జోడిగా నటించే అవకాశం అందుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ... 
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఎక్కడ ఉన్నారో తెలుసా? ముంబైలో! ఆయన మంగళవారం ముంబై మహా నగరంలో అడుగు పెట్టారు. బుధవారం సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ముంబైలో మిస్టర్ కూల్, స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోని (MS Dhoni)ని కలిశారు. రామ్ చరణ్, ఎంఎస్ ధోని కలిసి మంగళవారం ఓ యాడ్ చేశారు. షూటింగులో వాళ్ళిద్దరూ పాల్గొన్నారు. అయితే... ఆ యాడ్ ఏమిటి? అందులో చరణ్, ధోని పాత్రలు ఎలా ఉంటాయి? ఎప్పుడు విడుదల చేస్తారు? వంటివి ప్రస్తుతానికి సస్పెన్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


రజనీకాంత్ కొత్త మూవీ షూటింగ్ షురూ, ఫుల్ జోష్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్
‘జైలర్’ సంచలన విజయంతో మంచి జోష్ లో ఉన్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. అదే ఉత్సాహంతో మరో సినిమా చేస్తున్నారు. ప్రముఖ తమిళ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ‘తలైవా 170’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి చిత్రబృందం కీలక విషయాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం షూటింగ్ ఇవాళ మొదలైనట్లు తెలిపింది. ఈ మేరకు రజనీకాంత్ పోస్టర్ తో షూటింగ్ షూరూ అయ్యిందని తెలిపింది.  త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని ప్రకటించింది. ఈ అనౌన్స్ మెంట్ తో  రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)