‘హనుమాన్‌’ రెమ్యునరేషన్‌ వివాదం - క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్‌ వర్మ
ఈ సంక్రాంతి సందర్భంగా రిలీజై పండగ మూవీగా నిలిచింది హనుమాన్‌. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్‌ ఊహించని విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. భారతీయ ఇతిహాసాల్లోని సూపర్ హీరో ఆంజనేయుడి పాత్రను తీసుకుని విజువల్ వండర్‌‌గా చూపించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ విజువల్స్ బాగున్నాయంటూ ప్రతి ఒక్కరి నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. ఇక మూవీ రిలీజై దాదాపు నెల రోజులు అవుతున్న ఇప్పటికీ హనుమాన్‌ థియేటర్లో సందడి చేస్తూనే ఉంది. అంతా బాగుందని అనుకుంటుండగా.. రెండు రోజులు నుంచి మూవీకి సంబంధించి  ఓ నెగిటివ్‌ టాక్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పారితోషికం విషయంలో నిర్మాత నిరంజన్‌ రెడ్డి, డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మకు మధ్య గొడవలు వచ్చాయంటూ నెగిటివ్‌ ప్రచారం మొదలుపెట్టారు. ఈ వార్తలపై ప్రశాంత్‌ వర్మ స్పందించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'విశ్వంభర' కోసం త్రిష రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
కోలీవుడ్ లో రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయనతార, త్రిష ముందు వరుసలో ఉన్నారు. గత కొంతకాలంగా త్రిష కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో ఆమెకు తగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. కానీ తెలుగులో త్రిషకి సరైన సక్సెస్ లేక చాలా సంవత్సరాలు అయింది. కానీ 'విశ్వంభర' మూవీ కోసం ఆమెకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'విశ్వంభర' కోసం స్వయంగా చిరంజీవే త్రిష పేరుని సజెస్ట్ చేశారట. అందుకే నిర్మాతలు త్రిష అడిగినంత ఇచ్చి ఆమెని ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తోంది. 'విశ్వంభర' కోసం త్రిష తన గత సినిమాల కంటే మరింత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


లాల్ సలామ్ రివ్యూ: రజనీకాంత్‌ది ప్రత్యేక పాత్రనా? ఫుల్ లెంత్ పాత్రనా? సినిమా ఎలా ఉంది?
సూపర్ స్టార్ రజనీకాంత్ గతేడాది ‘జైలర్’తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఎన్నో ఫ్లాపులు, డిజాస్టర్ల తర్వాత రజనీ మార్కెట్‌ను మళ్లీ తీసుకువచ్చిన సినిమా అది. ‘జైలర్’ తర్వాత రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన సినిమా ‘లాల్ సలామ్’. విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ ఎక్స్‌టెండెడ్ కామియోలో నటించారని చిత్ర బృందం ప్రచారంలో పేర్కొంది. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఓటీటీలోకి మెగాస్టార్ ఎంట్రీ - వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్
ప్రస్తుత కాలంలో ఓటీటీ కంటెంట్ కు ఎంతలా డిమాండ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కోవిడ్ టైంలో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ ఆదరణ లభించింది. అక్కడి నుంచి ఆడియన్స్ ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడిపోయారు. మేకర్స్ కూడా అందుకు తగ్గట్లే మంచి మంచి కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగులో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ ఉంది. అందుకే యంగ్ స్టార్స్ తో పాటు సీనియర్ స్టార్స్ కూడా వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నుంచి పలువురు సీనియర్ హీరోలు డిజిటల్ ఎంట్రీ ఇవ్వగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


ఈగల్ రివ్యూ: మాస్ మహారాజా మారణహోమం... రవితేజ వన్ మ్యాన్ షో ఎలా ఉందంటే?
రవితేజకు సపరేట్ స్టైల్ ఉంది. కమర్షియల్ సినిమాల్లో స్టైల్, ఎనర్జీ కనిపిస్తాయి. అప్పుడప్పుడూ కమర్షియల్ సినిమాలు పక్కన పెట్టి డిఫరెంట్ జానర్స్, ఎక్స్‌పరిమెంట్స్ ట్రై చేయడం ఆయనకు అలవాటు. 'ఈగల్' ప్రచార చిత్రాల్లో 'ఇది కమర్షియల్ సినిమా. కానీ, రెగ్యులర్ కమర్షియాలిటీ ఉండదు. డిఫరెంట్ ఫిల్మ్' అని రవితేజ చెప్పారు. మరి, సినిమా ఎలా ఉంది? దర్శకుడిగా 'సూర్య వర్సెస్ సూర్య' వంటి డిఫరెంట్ ఫిల్మ్ తీసిన సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని ఈసారి ఎటువంటి సినిమా తీశారు? అనేది రివ్యూలో చూడండి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)