Trisha Remunaration For Vishwambhara: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ చెన్నై బ్యూటీ త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లు అందుకుంది. దళపతి విజయ్ సరసన త్రిష నటించిన 'లియో' ఈ ఏడాది కోలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. 'లియో' సక్సెస్ తో త్రిష క్రేజ్ మరింత పెరిగిపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మకి ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సుమారు 17 ఏళ్ల తర్వాత త్రిష టాలీవుడ్ కి రీ ఎంట్రీ ఇస్తున్న త్రిష మెగాస్టార్ చిరంజీవి సరసన 'విశ్వంభర' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం త్రిష తీసుకోనున్న రెమ్యూనరేషన్ గురించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.


'విశ్వంభర' కోసం త్రిష కి భారీ రెమ్యునరేషన్


కోలీవుడ్ లో రికార్డ్ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో నయనతార, త్రిష ముందు వరుసలో ఉన్నారు. గత కొంతకాలంగా త్రిష కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడంతో ఆమెకు తగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. కానీ తెలుగులో త్రిషకి సరైన సక్సెస్ లేక చాలా సంవత్సరాలు అయింది. కానీ 'విశ్వంభర' మూవీ కోసం ఆమెకి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 'విశ్వంభర' కోసం స్వయంగా చిరంజీవే త్రిష పేరుని సజెస్ట్ చేశారట. అందుకే నిర్మాతలు త్రిష అడిగినంత ఇచ్చి ఆమెని ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తోంది. 'విశ్వంభర' కోసం త్రిష తన గత సినిమాల కంటే మరింత ఎక్కువ రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.


'విశ్వంభర' షూటింగ్ తో త్రిష బిజీ బిజీ


ఇటీవలే త్రిష 'విశ్వంభర' సెట్స్ లో అడుగుపెట్టింది. సెట్స్ లో త్రిష అడుగుపెట్టిన ఓ వీడియోని చిరంజీవి స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇక లేటెస్ట్ షెడ్యూల్లో చిరంజీవి, త్రిషపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాదులోని ప్రముఖ స్టూడియోలో భారీ సెట్ కూడా వేసినట్లు తెలుస్తోంది. సుమారు రూ.100 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీని 2025 సంక్రాంతి రిలీజ్ చేస్తున్నారు. జనవరి 10న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు మూవీ ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.


17 ఏళ్ల తర్వాత మెగాస్టార్ కి జోడిగా త్రిష


మెగాస్టార్ చిరంజీవితో త్రిష 'స్టాలిన్' అనే సినిమాలో నటించింది. 2006లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, త్రిష ల జోడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత మళ్లీ ఆచార్యలో త్రిషాని హీరోయిన్ గా అనుకున్నారు. షూటింగ్ కి కొద్ది రోజుల ముందు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె హీరోయిన్ గా తప్పుకోగా ఆమె ప్లేస్ లో కాజల్ ని తీసుకున్నారు. సుమారు 17 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రిష చిరంజీవితో జోడి కడుతుండడం గమనార్హం.


Also Read : టీవీ చానల్స్‌లో భగవంత్ కేసరి, స్కంద - ఫ్లాప్ సినిమాకే ఎక్కువ టీఆర్పీ, ఇదేం మాస్ రియాక్షన్ బాసు!