Producer TG Vishwa Prasad: ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌తో  ‘ఎమ్మెల్యే’, ‘ఓ బేబి’, ‘ధమాకా’ తదితర సినిమాలు నిర్మించారు. తాజాగా ఆయన నిర్మించిన ‘ఈగల్’ శుక్రవారం విడుదలైంది. ఈ  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 


ఎక్సట్రార్డినరీ క్లైమాక్స్ తో ఈగల్ మూవీ..


‘ఈగల్’ సినిమా క్లైమాక్స్ అదిరిపోతుందని, ఈ మూవీలో స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుందన్నారు. లోకేష్ కనకరాజ్ మూవీ తరహాలో సాగుతుందన్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆయన స్టైల్ ఆఫ్ డైరెక్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మేకింగ్ స్టైల్ ఉంటుంది. అందులో లోకేష్ కనకరాజ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. 


పవన్, త్రివిక్రమ్ మూవీ.. 


ఇక సినిమాలు విషయాలు మాట్లాడుతూ.. ‘‘అమెరికాలో ఉండేటప్పుడు ప్రతి గురువారం సాయంత్రం సినిమాకి వెళ్లేవాడిని. ఆ  రోజు ఎన్ని సినిమాలు రిలీజ్ అయితే అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చూసేవాడిని. అలాగే సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది’’ అని చెప్పుకొచ్చారు. ‘‘ఒక సినిమా ఎంత మనీ కలెక్ట్ చేసింది అనేదాని కన్నా ఎంతమందిని రీచ్ అయింది అనేదాన్ని బట్టి సినిమా సక్సెస్ ని రేటింగ్ చేస్తాను’’ అని తెలిపారు.


పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ‘‘పవన్ కళ్యాణ్ ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు సినిమాలు తీయటానికి సిద్ధం. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫ్రీ అయితే అప్పుడు వాళ్ళతో సినిమాలు తీయటానికి రెడీగా ఉన్నాం. అయితే అదే కాంబినేషనా, కొలాబరేషనా అనేది వాళ్ల కమిట్మెంట్స్ ని బట్టి ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. ఇండస్ట్రీలో ఉన్న వీలైనంతమంది హీరోలతో సినిమాలు చేయాలని ఉంది లాస్ట్ వీక్ తమిళ్ సినిమా కూడా ప్రొడ్యూస్ చేశాను అని చెప్పుకొచ్చారు. అదే కాకుండా తమిల్‌లో ఇంకొక రెండు మూవీలు చేస్తున్నాను అని చెప్పుకొచ్చారు.


ఎలాంటి థియేటర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు..


‘ఈగల్’ మాసివ్ యాక్షన్ సినిమా అని తెలిపారు. అయితే దీనికి ఈ పార్ట్ 2 ఉంటుందా అనే ప్రశ్నకి మాత్రం స్పందించలేదు. ప్రస్తుతం థియేటర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నామని, అలాగే మా సినిమాలని మేమే రిలీజ్ చేసుకుంటామని అన్నారు. ‘‘ఒకటి రెండు సినిమాలను మాత్రమే విక్రయించాం. కానీ మిగిలినవి మేమే రిలీజ్ చేసుకున్నాం. అలాగే థియేటర్స్ విషయంలో తను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు.  వాళ్లతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. అలాగే మిగిలిన ప్రొడ్యూసర్లు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు వంటి వాళ్ళతో మంచి కనెక్షన్స్ ఉన్నాయని తెలిపారు. 


వారికి మాత్రమే వ్యతిరేకం..


‘‘ఇష్టపడి సినిమా వ్యాపారంలోకి వచ్చాను. ఇంకొకరి కష్టాన్ని దోచుకోవాల్సిన అవసరం నాకు లేదు’’ అంటూ అవినీతికి పాల్పడిన వారిపై కూడా యాక్షన్ తీసుకోనని క్లారిటీ ఇచ్చారు నిర్మాత. అలా యాక్షన్ తీసుకోకూడదు అనుకోవడం తన సొంత నిర్ణయం అని చెప్పుకొచ్చారు. దీంతో బయటవారికి సంబంధం లేదన్నారు. ‘‘వాళ్ల కష్టాన్ని, నా ధనాన్ని కలిపి దోచుకుంటున్న వారికి మాత్రమే నేను వ్యతిరేకం. నేనెప్పుడూ ఏ అవినీతికి పాల్పడుతున్న వ్యక్తికి కూడా తలవంచను. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. వ్యక్తి కంటే సినిమా చాలా గొప్పది’’ అని తన ట్వీట్‌లో వివరించారు టీజీ విశ్వప్రసాద్.



Also Read: హీరోయిన్‌తో వర్మ పార్టీ - ‘వ్యూహం’ రిలీజ్‌పై అప్డేట్, వారందరినీ టార్గెట్ చేస్తూ పోస్టులు