Ramayan Actor Arun Govil Surprises As Modi: బాలీవుడ్ బ్యూటీ యామీ గౌతమ్, సౌత్ స్టార్ యాక్టర్ ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఆర్టికల్ 370’. జమ్ము కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370 రద్దు కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి సుహాస్ జంభలే దర్శకత్వం వహించారు. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ నిర్మాతగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని ఎత్తివేయడం వెనుకున్న కారణాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్  ట్రైలర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.  


ఆకట్టుకుంటున్న ‘ఆర్టికల్ 370’ ట్రైలర్


‘ఆర్టికల్ 370’ ట్రైలర్ లో జమ్మూకాశ్మీర్ లో పరిస్థితులను, పాక్ ఉగ్రమూకల అండతో వేర్పాటువాదులు చేసిన అరాచకాలను చూపించారు. జవాన్లపై దాడులు, కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయాలను ఇందులో ప్రస్థావించారు. ఈ చిత్రంలో ఇంటెలిజెన్స్ అధికారిగా యామి గౌతమ్ కనిపించగా, కేంద్ర ప్రభుత్వంలో కీలక అధికారిగా ప్రియమణి నటించారు. 2 నిమిషాల 40 సెకన్ల పాటు ఉన్న ఈ ట్రైలర్‌లో యామీ  కాశ్మీర్‌ కు ప్రత్యేక హోదా ఉంటే ఎన్నో సమస్యలు ఎదురవుతాయని అభిప్రాయపడుతుంది. ఆ ప్రాంతంలో తీవ్రవాదులు తమ నియంత్రణలోని ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని వెల్లడించిస్తుంది. ఇంటెలిజెన్స్ నుంచి NIAలో చేరిన యామీ కాశ్మీర్‌లో ఒక మిషన్‌ చేపడుతుంది. ఉగ్ర మూలాలను పెకిలించే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాజకీయ గందరగోళం ఉన్నప్పటికీ, యామీ, ప్రభుత్వం కలిసి ‘ఆర్టికల్ 370’ని ఎత్తివేతకు ఎలా కృషి చేశారు అనేది ఇందులో చూపించారు. 


మోడీ గెటప్ లో ‘రామాయణం’ స్టార్ అరుణ్ గోవిల్


ఇక ‘ఆర్టికల్ 370’   మూవీలో ప్రధాని మోడీ పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు నటుడు అరుణ్ గోవిల్. వాస్తవానికి ‘ఆర్టికల్ 370’ అనగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాత్రలో ఎవరు కనిపిస్తారో? అని సినీ జనాలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యాక రామానంద్ సాగర్ తెరకెక్కించిన ‘రామాయణం’లోని శ్రీరాముడు మోడీగా కనిపించి సినీ అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. మోడీ గెటప్ లో అరుణ్ చక్కగా ఫిట్ అయ్యారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు. ఆయన ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాత్రలో టీవీ నటుడు కిరణ్ కర్మాకర్‌ నటించారు. ఆయన కూడా అచ్చం అమిత్ షా మాదిరిగానే ఉన్నారని అందరూ ప్రశంసించారు.






ఫిబ్రవరి 23న ‘ఆర్టికల్ 370’   విడుదల


దేశంలోని కీలక ఘట్టాల్లో ఒకటైన ‘ఆర్టికల్ 370’ ఎత్తివేత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో వైభవ్ తత్వవాడి, స్కంద్ ఠాకూర్, అశ్విని కౌల్, దివ్య సేత్ షా, రాజ్ జుత్షి, సుమిత్ కౌల్, రాజ్ అర్జున్, అసిత్ గోపీనాథ్ రెడ్డిజ్, అశ్వనీ కుమార్. ఇరావతి హర్షే మాయాదేవ్ ఇతర పాత్రల్లో నటించారు.  



Read Also: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్‌ - బేబీ బంప్‌తో 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' బ్యూటీ