Yami Gautam Is Pregnant: యామీ గౌతమ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు హీరో శీరిష్‌ డెబ్యూ మూవీ 'గౌరవం'తో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయమైంది. ఇక హీరోయిన్‌గా కంటే కూడా ఫెయిర్‌ అండ్‌ లవ్లీ యాడ్‌తో ఆమె ఎక్కువగా గుర్తింపు పొందింది. అలా ప్రకటనల్లో నటిస్తూ గుర్తింపు పొందిన ఆమె బాలీవుడ్‌ హీరోయిన్‌ వరకు ఎదిగింది. పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్‌ చేసుకుంటుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం హిందీ చిత్రాల్లోనే ఫుల్ బిజీ అయిన ఆమె విభిన్న  పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తోంది. 


ప్రస్తుతం 'ఆర్టికల్‌ 374' సినిమాతో బిజీగా ఉంది. ఇక 2021లో దర్శక-నిర్మాత ఆదిత్య ధర్‌ను పెళ్లాడిన యామీ గౌతమ్‌ త్వరలో గుడ్‌న్యూస్‌ చెప్పబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె తల్లికాబోతుందంటూ బాలీవుడ్‌ మీడియాలో కథనాలు వినిస్తున్నాయి. దీని కారణం రీసెంట్‌ వీడియోల్లో యామీ బేబీ బంప్‌తో కనిపించడమే. ఆమె నటించిన 'ఆర్టికల్‌ 374' మూవీ ప్రమోషన్స్‌కు యామీ తన భర్త, నిర్మాత ఆదిత్య ధర్‌తో హాజరైంది. ఈ సందర్భంగా వారిద్దరు నడుచుకుంటు వస్తుండగా యామీ తన పొట్టను దాస్తు కనిపించింది. అంతేకాదు చూస్తుంటే ఆమె పొట్ట ముందుకు ఉన్నట్టు కనిపించింది. 


Also Read: రవితేజ 'ఈగల్'ను ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు వస్తే హిట్టు?


దీంతో ఈ 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' బ్యూటీ గర్భం దాల్చిందని ఫ్యాన్స్‌ అంతా కన్‌ఫాం అయ్యారు. ఇక త్వరలోనే యామీ-ఆదిత్యలు గుడ్‌న్యూస్‌ చెప్పబోతున్నారంటూ ఈ జంట ఫ్యాన్స్‌ ఖుష్‌ అవుతున్నారు. అందరు అనుకున్నట్టుగానే తాజాగా జరిగిన 'ఆర్టికల్ 370 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని ఆఫీషియల్ చేశారు యామీ-ఆదిత్యలు.  ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు జంటగా హాజరైన ఈ కపుల్స్.. యామీ గౌతమ్ గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతిగా ఉందని ఆమె భర్త, డైరెక్టర్ ఆదిత్య వెల్లడించారు. దీంతో వారి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. మే నెలలో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతుందని తెలుస్తోంది. కాగా 'ఉరి: ది సర్జికల్ స్ట్రైక్' (2019) మూవీ సెట్‌లో కలుకున్న యామీ-ఆదిత్యలు రెండేళ్ల సీక్రెట్‌ డేటింగ్‌ అనంతరం జూన్ 4, 2021న మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. 


ఆ సంఘటన ఆధారంగా 'ఆర్టికల్ 370'


యామి గౌతమ్, ప్రియమ‌ణి ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కిన ఆర్టికల్ 370 మూవీ ఫబ్రవరి 23న రిలీజ్ కాబోతోంది.  ఈ సినిమాకు రెండుసార్లు జాతీయ అవార్డు అందుకున్న ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహిస్తుండ‌గా.. జియో స్టూడియోస్, A B62 స్టూడియోస్ బ్యాన‌ర్‌ల‌పై ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ డైరెక్టర్ ఫేమ్ ఆదిత్య ధ‌ర్(యామీ గౌతమ్ భర్త) నిర్మిస్తున్నాడు. 2019 ఫిబ్ర‌వ‌రి 14న పుల్వామా దాడి జ‌రిగిన అనంతరం జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ర‌ద్దు చేసే అంశం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించార.  అయితే ఆర్టికల్‌ 370ను ర‌ద్దు చేసే క్ర‌మంలో కశ్మీర్‌లో ఎలాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి అనే ఆధారంగా ఈ సినిమా సాగనుంది.