Ravi Teja's Eagle pre release business details: 'ఈగల్'తో థియేటర్లలో సందడి చేయడానికి మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) రెడీ అయ్యారు. సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. మరి, మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా జరిగింది? వరల్డ్ వైడ్ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? ఎన్ని కోట్లు రాబడితే హిట్టు? అనేది చూస్తే.... 


'ఈగల్' బిజినెస్ @ 21 కోట్లు!
ప్రపంచవ్యాప్తంగా 'ఈగల్' డిస్ట్రిబ్యూషన్ హక్కులను రూ. 21 కోట్లకు అమ్మినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏ ఏరియాను ఎన్ని కోట్లకు అమ్మారు? అని ఏరియాల వారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే...



  • నైజాం (తెలంగాణ) - రూ. 6 కోట్లు

  • సీడెడ్ (రాయలసీమ) - రూ. 2.5 కోట్లు

  • ఆంధ్ర (అన్ని జిల్లాలు కలిపి) - రూ. 8.5 కోట్లు

  • కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 2 కోట్లు

  • ఓవర్సీస్ (విదేశాలు) - రూ. 2 కోట్లు

  • టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ - రూ. 21 కోట్లు


Also Read: ప్రేక్షకులకు అందుబాటులో 'ఈగల్' - మాసోడి సినిమాకు మామూలు టికెట్ రేట్లే!


రెండు తెలుగు రాష్ట్రాల్లో 'ఈగల్' బిజినెస్ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే. వరల్డ్ వైడ్ బిజినెస్ రూ. 21 కోట్లు. రవితేజ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేసిన 'ధమాకా' ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే రెండున్నర కోట్లు ఎక్కువకు 'ఈగల్' సినిమాను అమ్మారు. డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే రూ. 22 కోట్లు 


పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ఎక్కువ ఆశ లేదు!
రవితేజ లాస్ట్ సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 38 కోట్ల రూపాయలు. ఆ సినిమా విషయంలో రిజల్ట్ కాస్త తేడా కొట్టింది. అయినప్పటికీ 'ఈగల్' మీద ఎఫెక్ట్ పడలేదు. సినిమాకు మంచి ఆఫర్లు వచ్చాయని ట్రేడ్ టాక్. అయితే... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎక్కువ డబ్బులకు ఆశ పడలేదు. రీజనబుల్ రేట్లకు డిస్ట్రిబ్యూటర్లకు సినిమా ఇచ్చారు. 'ధమాకా' కంటే కొంచెం ఎక్కువ రేట్లకు అమ్మారు. రీసెంట్ రవితేజ సినిమాల్లో డీసెంట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఆఫర్ 'ఈగల్'కు వచ్చిందని చెప్పవచ్చు.


Also Read: 'యాత్ర 2' థియేటర్‌లో పవన్, జగన్ ఫ్యాన్స్ మధ్య గొడవ - తర్వాత ఏం జరిగిందంటే?






'ఈగల్' సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. సినిమాటోగ్రఫీలో ఆయనకు మంచి పేరు ఉంది. 'సూర్య వర్సెస్ సూర్య'తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. కొంత విరామం తర్వాత 'ఈగల్'తో మళ్లీ మెగాఫోన్ పట్టారు. ఇందులో రవితేజ జోడీగా కావ్య థాపర్ నటించారు. కీలక పాత్రలో మరో హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ కనిపించారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, వినయ్ రాయ్, అజయ్ ఘోష్ తదితరులు మిగతా పాత్రల్లో నటించారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతి బరిలో విడుదల కావాలి. అయితే... అప్పట్లో ఎక్కువ సినిమాలు ఉండటంతో వాయిదా వేశారు. ఇప్పుడు విడుదల చేస్తున్నారు.