తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల నటి మీనా భర్త పోస్ట్ కోవిడ్ సమస్యలతో మరణించగా.. నిన్న ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు కన్ను మూశారు. ఈ ఘటనలను మరువక ముందే తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత, ఎడిటర్ గోరంట్ల రాజేంద్రప్రసాద్(86) కన్నుమూశారు. గత కొద్ది రోజులగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖ నిర్మాత రామానాయుడుతో కలిసి ఆయన పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. వీరిద్దరూ కలిసి ఎన్టీఆర్ తో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు. అక్కడ నుంచి రాజేంద్రప్రసాద్ సినీ ప్రయాణం మొదలైంది.


‘మాధవి పిక్చర్స్’ సంస్థను స్థాపించి ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. ‘దొరబాబు’, ‘సుపుత్రుడు’, ‘కురుక్షేత్రం’ వంటి చిత్రాలు ఆయన బ్యానర్ మీద వచ్చినవే. రాజేంద్ర ప్రసాద్ మృతి విషయం తెలిసి టాలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్ధించారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆయనకు నివాళి తెలిపారు.


Also Read : 'మెగా'స్టార్ న్యూమరాలజీ సెంటిమెంట్ - పేరులో చిరు మార్పు


Also Read: టాలీవుడ్‌లో విషాదం - ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత


Also Read: ‘లైగర్’ పూల బొకేపై సుమ షాకింగ్ పంచ్, టామ్‌ క్రూజ్‌నూ వదలని ‘హ్యాపీ బర్త్‌డే’ టీమ్!